IPL 2022, SRH vs KKR head to head records: ఐపీఎల్ 2022లో 25వ మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడుతున్నాయి. బ్రౌబర్న్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ముందు నుంచీ కేకేఆర్ విజయాలు సాధిస్తుండగా హైదరాబాద్ రీసెంట్‌గా ఫామ్‌లోకి వచ్చింది. మరి ఈ రెండు జట్లలో ఆధిపత్యం ఎవరిది? తుది జట్లలో ఎవరెవరు ఉంటారు? గెలుపు ఎవరిది?
ఈ ఐపీఎల్‌లో కేకేఆర్ జోరు కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు ఐదు మ్యాచులాడి మూడు గెలిచింది. ఆరు పాయింట్లతో టాప్-4లో ఉంది. మరోవైపు ఆలస్యంగా ఫామ్ అందుకున్న సన్‌రైజర్స్ 4 ఆడి 2 గెలిచి 2 ఓడింది. అందుకే ఈ మ్యాచులో గెలిచి లెక్క సరిచేయాలని పట్టుదలగా ఉంది. కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ బలంగా అనిపిస్తున్నా నిలకడగా పరుగులు చేయలేకపోతున్నారు. బౌలింగ్‌లో ఉమేశ్ యాదవ్ రెచ్చిపోతున్నాడు. ఇక ఓపెనింగ్‌లో కేన్ విలియమ్సన్, అభిషేక్ శర్మ పరుగులు చేయడంతోనే హైదరాబాద్ విజయాలు సాధిస్తోంది. వాషింగ్టన్ సుందర్ గాయపడటంతో స్పిన్ అటాక్ బలహీన పడింది. పేస్‌లో మాత్రం తిరుగులేదు.
ఆధిపత్యం కేకేఆర్ దే
ఇండియన్ ప్రీమియర్ లీగులో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటి వరకు 21 మ్యాచుల్లో తలపడ్డాయి. పైచేయి స్పష్టంగా కేకేఆర్దే. ఏకంగా 13 గెలిచింది. మరోవైపు హైదరాబాద్ 7 విజయాలే సాధించింది. ఒక మ్యాచ్ టై అయినా కేకేఆర్ గెలిచింది. హైదరాబాద్ రీసెంట్ ఫామ్ మాత్రం డిప్ అయింది. చివరి ఐదింట్లో కేవలం ఒకటి మాత్రమే గెలిచింది. అదీ 2019లో. 2020, 2021లో కేకేఆర్‌దే జోరు.
Also Read: ఇంత భక్తేంటి సామీ! వద్దంటున్నా సచిన్ కాళ్లకు దండం పెట్టిన జాంటీరోడ్స్!
SRH vs KKR Probable XI
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్, రాహుల్ త్రిపాఠి, అయిడెన్ మార్‌క్రమ్, నికోలస్ పూరన్, శశాంక్ సింగ్, శ్రేయస్ గోపాల్, భువనేశ్వర్ కుమార్, మార్కో జన్‌సెన్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్
కోల్‌కతా నైట్‌రైడర్స్: అజింక్య రహానె/ఆరోన్ ఫించ్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, సామ్ బిల్లింగ్స్ / షెల్డన్ జాక్సన్, నితీశ్ రాణా, ఆండ్రీ రసెల్, ప్యాట్ కమిన్స్, సునిల్ నరైన్, రసిక్ సలామ్, ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తి