ఐపీఎల్‌లో గురువారం రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ ఫాఫ్ డుఫ్లెసిస్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్లేఆఫ్స్ బరిలో నిలవాలంటే పంజాబ్ కింగ్స్‌కు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. పాయింట్ల పట్టికలో బెంగళూరు నాలుగో స్థానంలో ఉండగా... పంజాబ్ కింగ్స్ ఎనిమిదో స్థానంలో ఉంది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తుదిజట్టు
విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుఫ్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటీదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), మహిపాల్ లొమ్రోర్, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, జోష్ హజిల్ వుడ్
పంజాబ్ కింగ్స్ తుదిజట్టు
జానీ బెయిర్‌స్టో, శిఖర్ ధావన్, భనుక రాజపక్స, మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), లియాం లివింగ్‌స్టోన్, రిషి ధావన్, కగిసో రబడ, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్