IPL 2022, mi vs lsg preview mumbai indians vs lucknow supergiants head to head records: ఐపీఎల్ 2022లో 26వ మ్యాచులో ఐదుసార్లు ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ (Mumbai Indians), కొత్త జట్టు లక్నో సూపర్‌జెయింట్స్ (Lucknow Supergiants) తలపడుతున్నాయి. ముంబయిలోని బ్రబౌర్న్ (Braboune Stadium) ఇందుకు వేదిక. వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిపోయిన హిట్‌మ్యాన్ సేనకు ఇది దాదాపుగా చావోరేవో మ్యాచ్. ఇందులో గనక ఓడిపోతే ఆ జట్టు వరుసగా ఎనిమిది మ్యాచులు గెలిస్తేనే ప్లేఆఫ్ చేరుకోగలదు. మరోవైపు ఆల్‌రౌండర్లో కూడిన లక్నో సమతూకంతో కనిపిస్తోంది. మరి వీరిలో గెలుపు ఎవరిది? తుది జట్టులో ఎవరుంటారు?
ముంబయి ఆ అద్భతం చేస్తుందా?
క్రికెట్ అంటేనే ఓ గమ్మత్తైన ఆట! అందుకే క్రికెట్లో అద్భుతాలు జరుగుతుంటారు. 1992 ప్రపంచకప్ తొలి ఐదు మ్యాచుల్లో ఒకటే గెలిచిన పాకిస్థాన్ విజేతగా అవతరించింది. గతంలో ముంబయి ఇలాగే ఐదు మ్యాచులు ఓడి తర్వాత కప్ గెలిచేసింది. 2014లో కోల్‌కతా వరుసగా తొమ్మిది మ్యాచులు గెలిచి రెండోసారి విజేతగా ఆవిర్భవించింది. అందుకే ముంబయి ఇండియన్స్‌ను ఇప్పటికీ తక్కువగా అంచనా వేయలేం.
వేధిస్తున్న పొరపాట్లు
సెలక్షన్ తప్పిదాలు ముంబయిని వేధిస్తున్నాయనడంలో సందేహం లేదు. దేశవాళీ పేసర్లు, స్పిన్ డిపార్ట్‌మెంట్ బలంగా లేకపోవడం హిట్‌మ్యాన్ సేనను వెనకడుగు వేయిస్తోంది. ఆ జట్టు సీనియర్లు రోహిత్‌త్ శర్మ (Rohit Sharma), కీరన్ పొలార్డ్, జస్ప్రీత్ బుమ్రా స్థాయికి తగ్గటు రాణించాల్సి ఉంది. పంజాబ్ మ్యాచులో బుమ్రా యార్కర్లతో పుంజుకోవడం శుభసూచకం. ఇక సూర్యకుమార్ యాదవ్ (Suryakumar yadav) వరుస మ్యాచుల్లో రప్ఫాడిస్తున్నాడు. తిలక్ వర్మ, డీవాల్డ్ బ్రూవిస్ ఈజీగా షాట్లు ఆడుతుండటం పాజిటివ్ న్యూస్. బౌలింగ్‌లో మాత్రం ఆ జట్టు మరింత మెరుగవ్వాల్సిన అవసరం ఉంది.
సూపర్ 'డెప్త్'
ఈ సీజన్లో లక్నో సూపర్‌జెయింట్స్ (LSG) తన డెప్త్‌తో అందరినీ సర్‌ప్రైజ్ చేస్తోంది. విస్తృతంగా బౌలింగ్ ఆప్షన్లు ఉండటంతో రాజస్థాన్ మ్యాచులో కృనాల్ పాండ్య, మార్కస్ స్టాయినిస్, దీపక్ హుడా అసలు బౌలింగ్ చేయాల్సిన అవసరమే రాలేదు. ఎనిమిదో నంబర్లో స్టాయినిస్ వస్తుండటంతో బ్యాటింగ్ ఆర్డర్లో ఫ్లెక్సిబిలిటీ కనిపిస్తోంది. చెన్నై, దిల్లీపై రన్‌ఛేజ్‌లో డికాక్ 61, 80తో సాలిడ్‌గా బ్యాటింగ్ చేశాడు. కేఎల్ రాహుల్ (KL Rahul), ఆయుష్ బదోనీ, దీపక్ హుడా నిలకడగా రాణిస్తున్నారు. అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్య బౌలింగ్ బాగుంది. అయితే డెత్‌లో లక్నో విదేశీ పేసర్లు పరుగుల్ని కంట్రోల్ చేయడంలో ఇబ్బంది పడుతున్నారు. అలాగే పవర్‌ప్లేలో లైన్ అండ్ లెంగ్త్‌ను త్వరగా పసిగట్టలేకపోతున్నారు.
MI vs LSG Probable XI
లక్నో సూపర్‌జెయింట్స్ (LSG Playing XI): కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, మార్కస్ స్టాయినిస్, దీపక్ హుడా, ఆయుష్ బదోనీ, జేసన్ హోల్డర్, కృనాల్ పాండ్య, కృష్ణప్ప గౌతమ్, దుష్మంత చమీరా, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్
ముంబయి ఇండియన్స్ (Mumbai Indians): ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, డీవాల్డ్ బ్రూవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, తైమల్ మిల్స్ / టిమ్ డేవిడ్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మర్కండే /మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, బాసిల్ థంపి / ఫాబియన్ అలన్