IPL 2022, MI vs PBSK Memes: పాపం! ముంబయి ఇండియన్స్‌ను ఆడేసుకుంటున్న మీమర్స్‌!

IPL 2022, MI vs PBSK Memes: ఐదుసార్లు ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians)కు కాలం అస్సలు కలిసిరావడం లేదు. వరుసగా ఐదో మ్యాచ్‌లో ఓటమి పాలైంది. దాంతో మీమర్లు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.

Continues below advertisement

IPL 2022, MI vs PBSK Memes: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగు (IPL)లో ఐదుసార్లు ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians)కు కాలం అస్సలు కలిసిరావడం లేదు. ఈ సీజన్లో ఇప్పటి వరకు బోణీ కొట్టలేదు. ఐపీఎల్‌ 2022లో వరుసగా ఐదో మ్యాచ్‌లో ఓటమి పాలైంది. దాంతో ఆ జట్టు ప్లేఆఫ్‌ అవకాశాలు దాదాపుగా చేజార్చుకున్నట్టే అనిపిస్తోంది. పంజాబ్‌ కింగ్స్‌ (Punjab Kings) చేతిలో బుధవారం హిట్‌మ్యాన్‌ సేన ఓడిన సంగతి తెలిసిందే.

Continues below advertisement

మ్యాచ్‌ జరుగుతున్నంత సేపు ముంబయి శిబిరం ఒత్తిడిలోనే కనిపించింది. ఆటగాళ్లే కాకుండా కోచింగ్‌ బృందంలోనూ నిస్సత్తువ ఆవహించింది. గెలుస్తామన్న ధీమా కనిపించలేదు. ముంబయి యాజమాన్యం సైతం చాలా ఫ్రస్ట్రేషన్‌కు గురైంది. దీంతో ముంబయి ఇండియన్స్‌పై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు మీమర్లు మీమ్స్‌తో సోషల్‌ మీడియాలో హంగామా చేస్తున్నారు.

MI vs PBKS మ్యాచ్‌ ఎలా సాగిందంటే?

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ముంబయి ఓటముల పరంపర కొనసాగుతోంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇది ముంబయి ఇండియన్స్‌కు వరుసగా ఐదో ఓటమి. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లో ఐదు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అనంతరం ముంబయి ఇండియన్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 186 పరుగులకే పరిమితం అయింది.

ఒత్తిడిలో రనౌట్
ఇక ముంబయి ఇండియన్స్‌కు మాత్రం ఆశించిన ఆరంభం లభించలేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ (28: 17 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు), ఇషాన్ కిషన్ (3: 6 బంతుల్లో) వరుస ఓవర్లలో అవుటయ్యారు. అనంతరం యువ బ్యాటర్లు డెవాల్డ్ బ్రెవిస్ (49: 25 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు), తిలక్ వర్మ (36: 20 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) ముంబైని ఆదుకున్నారు. బౌండరీలు కొడుతూ స్కోరును ముందుకు నడిపించారు. అయితే అర్థ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో భారీ షాట్‌కు ప్రయత్నించి డెవాల్డ్ బ్రెవిస్ అవుటయ్యాడు.

Continues below advertisement