LSG vs RCB, Eliminator Highlights: ఐపీఎల్ 2022 ఎలిమినేటర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమేజింగ్‌గా ఆడింది. మెరుపు బ్యాటింగ్‌తో ఆకట్టుకుంది. లక్నో సూపర్‌జెయింట్స్ ముందు 208 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది. కుర్రాడు రజత్ పాటిదార్ (111*; 53 బంతుల్లో 12x4, 7x6) ఈడెన్‌లో చుక్కలు చూపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఎలిమినేటర్లో తిరుగులేని సెంచరీ బాదేశాడు. అతడికి విరాట్ కోహ్లీ (25; 24 బంతుల్లో 2x4), దినేశ్ కార్తీక్ (37*; 23 బంతుల్లో 5x4, 1x6) అండగా నిలిచారు. బ్యాటర్లు ఇచ్చిన విలువైన క్యాచులను వదిలేసిన లక్నో తగిన మూల్యం చెల్లించుకుంది.
ఈడెన్‌లో చిరుజల్లులు కురవడంతో మ్యాచ్ ఆలస్యంగా మొదలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి శుభారంభం దక్కలేదు. 4 పరుగుల వద్దే కెప్టెన్ డుప్లెసిస్ (0)ను మొహిసిన్ ఖాన్ పెవిలియన్ పంపించాడు. అయినా బెంగళూరు ఒత్తిడి చెందలేదు. అందుకు కారణం రజత్ పాటిదారే. క్రీజులోకి వచ్చిన క్షణం నుంచి బాదుడే లక్ష్యంగా పెట్టుకున్నాడు. పవర్‌ప్లేలో కృనాల్ పాండ్య బౌలింగ్‌ను ఉతికారేశాడు. కోహ్లీతో కలిసి రెండో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యం అందించాడు. పవర్‌ప్లేలో 52/1తో ముగించిన ఆర్సీబీ 70 వద్ద కోహ్లీ, 86 వద్ద మాక్స్‌వెల్ (9), 115 వద్ద లోమ్రర్ (14) వికెట్లు చేజార్చుకుంది
కాసేపు లక్నో బౌలర్లు బెంగళూరు స్కోరును కంట్రోల్ చేశారు. ఈ సిచ్యువేషన్‌లో 28 బంతుల్లోనే రజత్ హాఫ్ సెంచరీ చేశాడు. బిష్ణోయ్ వేసిన 16వ ఓవర్లో వరుసగా 6,4,6,4,6 కొట్టాడు. ఆ తర్వాతి ఓవర్లో డీకే నాలుగు బౌండరీలు దంచాడు. 18.4వ బంతిని సిక్సర్‌గా మలిచి రజత్ సెంచరీ చేశాడు. ఇందుకు 49 బంతులే తీసుకున్నాడు. ఆ తర్వాతా సిక్సర్లు, బౌండరీల వర్షం కురవడంతో బెంగళూరు 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. డీకే, రజత్ కలిసి ఐదో వికెట్‌కు 41 బంతుల్లోనే 92 పరుగుల అజేయ భాగస్వామ్యం అందించారు.