IPL 2022, KKR vs RCB: ఐపీఎల్‌ 2022లో (IPL 2022) బుధవారం ఇంట్రెస్టింగ్‌ మ్యాచ్‌ జరగబోతోంది. డీవై పాటిల్‌ స్టేడియంలో (DY Patil Stadium) కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (KKR vs RCB) తలపడుతున్నాయి. ఇప్పటికే కేకేఆర్‌ బోణీ కొట్టగా ఆర్సీబీ విజయం కోసం ఎదురు చూస్తోంది. మరి ఈ రెండు జట్లలో ఆధిపత్యం ఎవరిది? చివరి ఐదు సార్లు తలపడ్డప్పుడు ఏం జరిగింది?


KKR ఆధిపత్యం


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (Kolkata Knightriders), రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bangalore) ఇప్పటి వరకు 30 సార్లు తలపడ్డాయి. కేకేఆర్‌ 17 సార్లు గెలవగా ఆర్‌సీబీని 13 సార్లు విజయం వరించింది. చివరి సారి తలపడ్డ ఐదు మ్యాచుల్లో 3-2తో ఆర్‌సీబీదే ఆధిపత్యం. అయితే గతేడాది ప్లేఆఫ్‌ సహా ఆడిన మూడింట్లో కేకేఆర్‌ రెండు గెలిచింది. దీనిని బట్టి బెంగళూరుపై కోల్‌కతాదే పూర్తి ఆధిపత్యంగా కనిపిస్తోంది.


KKR vs RCB Records


* గత సీజన్లో వంద పరుగులు చేసిన 20 మందిలో స్పిన్‌లో విరాట్‌ కోహ్లీదే (Virat Kohli) అత్యల్ప స్ట్రైక్‌రేట్‌. నేడు సునిల్‌ నరైన్‌ (Sunil Narine), వరుణ్‌ చక్రవర్తి (Varun chakravarthy) బౌలింగ్‌లో అతడి ఆట ఆసక్తికరంగా ఉండనుంది.
* 2020 నుంచి కేకేఆర్‌ డెత్‌ బౌలింగ్‌లో పస లేకుండా పోయింది. ఓవర్‌కు 10+ చొప్పున ఇస్తున్నారు.
* ఐపీఎల్‌ 2018 నుంచి ఉమేశ్ యాదవ్‌ (Umesh Yadav) కన్నా దీపక్‌ చాహర్‌ (42), ట్రెంట్‌ బౌల్ట్‌ (27) మాత్రమే పవర్‌ప్లేలో ఎక్కువ వికెట్లు తీశారు.
* 2020 సీజన్‌ నుంచి లీగులో 1000+ పరుగులు చేసింది ముగ్గురే. కేఎల్‌ రాహుల్‌ (1296), శిఖర్ ధావన్‌ (1248), డుప్లెసిస్‌ (1170) వరుసగా ఉన్నారు.
* 2019 నుంచి కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) 78 సిక్సర్లు కొట్టగా ఆండ్రీ రసెల్‌ (Andre Russell) 75తో రెండో స్థానంలో ఉన్నాడు. 
* అజింక్య రహానె (Ajinkya Rahane) 4000 పరుగులు పూర్తి చేసుకోవడానికి మరో 15 పరుగులే అవసరం. ఈ రోజు చేస్తే ఈ ఘనత సాధించిన తొమ్మిదో భారతీయుడిగా అవతరిస్తాడు.


RCB, KKR probable XI


రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: డుప్లెసిస్‌, అనుజ్‌ రావత్‌, విరాట్‌ కోహ్లీ, దినేశ్‌ కార్తీక్‌, షెర్ఫాన్‌ రూథర్‌ఫర్డ్‌, షాబాజ్‌ అహ్మద్‌, వనిందు హసరంగ, హర్షల్‌ పటేల్‌, డేవిడ్‌ విలే, మహ్మద్‌ సిరాజ్‌, సిద్ధార్థ్‌ కౌల్‌


కోల్‌కతా నైట్‌రైడర్స్‌: వెంకటేశ్‌ అయ్యర్‌, అజింక్య రహానె, శ్రేయస్‌ అయ్యర్‌, నితీశ్ రాణా, సామ్‌ బిల్లింగ్స్‌ / మహ్మద్‌ నబీ, షెల్డన్‌ జాక్సన్‌, అండ్రీ రసెల్‌, సునిల్‌ నరైన్‌, ఉమేశ్‌ యాదవ్‌, శిమ్‌ మావి, వరుణ్‌ చక్రవర్తి