ఐపీఎల్‌లో గురువారం రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గుజరాత్‌కు ఈ మ్యాచ్‌తో అస్సలు ప్రాధాన్యం లేదు. గెలిచినా, ఓడినా వారు మొదటి స్థానంలోనే ఉంటారు. కానీ బెంగళూరు ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే మాత్రం ఈ మ్యాచ్ కచ్చితంగా భారీ తేడాతో గెలవాల్సిందే.


రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తుదిజట్టు
విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుఫ్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటీదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లొమ్రోర్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, సిద్ధార్థ్ కౌల్, జోష్ హజిల్‌వుడ్


గుజరాత్ టైటాన్స్ తుదిజట్టు
వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), మాథ్యూ వేడ్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, రవి శ్రీనివాసన్ సాయి కిషోర్, లోకి ఫెర్గూసన్, యష్ డాయల్, మహ్మద్ షమీ