Csk ms dhoni are in a big problem without deepak chahar they will loss more matches: ఐపీఎల్‌ 2022లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు (Chennai Superkings) మరిన్ని కష్టాలు తప్పేలా లేవు! మున్ముందు వారికి మరిన్ని ఓటములు ఎదురయ్యే అవకాశం ఉంది. ఒక చిన్న మిస్టేక్‌తో వారు ప్లేఆఫ్‌కు దూరమైనా చెప్పలేం! మరొక దేశవాళీ ఫాస్ట్‌ బౌలర్‌ లేకపోవడం వారిని ఇబ్బంది పెడుతోంది. దీనికి తోడుగా నిఖార్సైన దేశీ స్పిన్నర్లు కరవయ్యారు.


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులోనే అత్యుత్తమ రెండో జట్టు చెన్నై సూపర్‌కింగ్స్‌ (CSK). దాదాపు అన్నింటా వీరి ప్రణాళికలు అద్భుతంగా ఉంటాయి. వేలానికి దిగేముందే ఎంతో కసరత్తు చేస్తారు. అన్ని బేసెస్‌ కవర్‌ చేసేందుకు ప్లానింగ్‌ చేస్తారు. ఎంఎస్‌ ధోనీ (MS Dhoni), స్టీఫెన్ ఫ్లెమింగ్‌ ఈ విషయంలో చాలా శ్రమిస్తారు. అలాంటిది ఈ సీజన్లో మెరుగైన దేశవాళీ ఫాస్ట్‌ బౌలర్లు, స్పిన్నర్లను తీసుకోవడంలో వెనకబడి పోయారు. దాంతో ఐపీఎల్‌ 2022లో వీరి గెలుపు అవకాశాలకు గండి పడేలా ఉంది.


కొన్నేళ్లుగా చెన్నైకి దీపక్‌ చాహర్‌ (Deepak Chahar), శార్దూల్‌ ఠాకూర్‌ (Shardul Thakur) అత్యుత్తమ దేశవాళీ పేసర్లు, ఆల్‌రౌండర్లుగా సేవలు అందించారు. ముఖ్యంగా దీపక్‌ ముంబయి, చెన్నై తరహా కండిషన్స్‌లో బెస్ట్‌ బౌలింగ్‌ చేస్తాడు. పవర్‌ప్లేలో బంతిని రెండువైపులా స్వింగ్‌ చేస్తూ వికెట్లు పడగొడతాడు. దాంతో సీఎస్‌కేకు మంచి ఓపెనింగ్‌ లభించేది. ఇక శార్దూల్‌ మిడిల్‌ ఓవర్లలో పార్ట్‌నర్‌షిపులు విడదీసేవాడు. తోడుగా డ్వేన్‌బ్రావో (Dwane Bravo) వంటి పేసర్లు ఉండటంతో బౌలింగ్‌కు తిరుగుండేది కాదు. ఇప్పుడు గాయం కారణంగా దీపక్‌ సగం మ్యాచులకు అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. ఇంకా ఎక్కువే దూరం కావొచ్చు. శార్దూల్‌ను దిల్లీ కొనుగోలు చేసింది. దీంతో సరైన సమయంలో వికెట్లు తీసేవాళ్లు లేకుండా పోయారు.







లక్నో సూపర్‌ జెయింట్స్‌ మ్యాచులో ఇది స్పష్టంగా కనిపించింది. ముకేశ్‌ చౌదరీ, తుషార్‌ దేశ్‌పాండే డ్యూ కండిషన్స్‌లో బౌలింగ్‌ చేయలేకపోయారు. తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. బ్యాటర్‌ ఆధిపత్యం చెలాయించాడంటే భయపడిపోతారు. బ్రావో, ప్రిటోరియస్‌ బాగా బౌలింగ్‌ చేసినా.. మిగతా ఓవర్ల కోటాను పూర్తి చేయాలంటే మళ్లీ వీరే దిక్కయ్యారు. అందుకే ధోనీ ముందుగా బ్రావో, ప్రిటోరియస్‌ బౌలింగ్‌ను కంప్లీట్‌ చేయించాడు. దాంతో 19వ ఓవర్లో శివమ్‌ దూబెతో వేయించాడు. అది బ్యాక్‌ఫైర్‌ అయింది. జడ్డూ, మొయిన్‌కు ఓవర్లు ఉన్నా స్పిన్నర్లతో వేయించలేని పరిస్థితి. అదే శార్దూల్‌, దీపక్‌ ఉంటే వేరేలా ఉండేది.


చెన్నైలో ఇంకా కేఎం ఆసిఫ్‌, సమర్‌జీత్‌ సింగ్‌, రాజ్‌వర్ధన్‌ హంగర్‌గేకర్‌ (ఆల్‌రౌండర్‌), ప్రశాంత్‌ సోలంకీ వంటి దేశవాళీ బౌలర్లు ఉన్నారు. వీరిలో ఎవరికీ ఇంటర్నేషనల్‌ స్థాయి క్రికెటర్లు బౌలింగ్‌ వేసిన అనుభవం లేదు. అంతా కుర్రాళ్లు. నెట్‌బౌలింగ్‌ కోసం తీసుకున్నవాళ్లు. క్రిస్‌ జోర్డాన్‌, ఆడమ్‌ మిల్న్‌ వంటి విదేశీయులు ఉన్నా జట్టులో తీసుకోవాల్సింది నలుగురినే. డ్వేన్‌ బ్రావోకు ఒక ప్లేస్‌ గ్యారంటీ. మొయిన్‌ అలీ మూడో స్థానంలో ఆడతాడు. డ్వేన్‌ ప్రిటోరియస్‌ ఆడిన తొలి మ్యాచులోనే బాగా బౌలింగ్‌ చేశాడు. అంటే ఇక మిగిలింది ఒకే స్థానం. అందులోనే జోర్డాన్‌, మిల్న్‌, కాన్వే, శాంట్నర్‌ను ఆడించాలి. అంటే స్పిన్నర్‌ను తీసుకుంటే పేసర్‌కు చోటుండదు. పేసర్‌ను తీసుకుంటే స్పిన్నర్‌కు చోటుండదు. మొయిన్‌ అలీ, జడ్డూ బౌలింగ్‌లో పస లేదనుకోండి మరో స్పిన్నర్‌ దిక్కుండడు. ఈ కష్టాలు తీరాలంటే దీపక్‌ చాహర్‌ రావాల్సిందే.