Indian Premier League 2024: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2024కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. త‌మ అభిమాన ఆట‌గాళ్లు, త‌మ అభిమాన టీంలు అంటూ ప్ర‌పంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు మొత్తం ఈ లీగ్ కోస‌మే ఎదురుచూస్తున్నారు. డిఫెండింగ్ ఛాంపియ‌న్ చెన్నై సూప‌ర్‌ కింగ్స్‌.... రాయ‌ల్‌ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మ‌ధ్య మార్చి 22న జ‌ర‌గ‌బోయే మ్యాచ్‌తో 2024 సీజ‌న్ ఆరంభం కానుంది. అయితే ప్ర‌తీ ఏడాది ఈ లీగ్‌లో రికార్డ్‌లు బ‌ద్ధ‌ల‌వుతూనే ఉన్నాయి. కొత్త రికార్డ్‌లు న‌మోద‌వుతూనే ఉన్నాయి. ఐపీఎల్ కి ఇంకా 10రోజులు మాత్ర‌మే స‌మ‌యం ఉంది. కాబ‌ట్టి ఐపీఎల్ లో 10 నంబ‌ర్ పేరుమీద ఉన్న‌ టాప్‌-10 రికార్డ్‌లు ఓ సారి ప‌రిశీలిద్దాం.


10.
---------
ఐపీఎల్ లో ఎన్ని రికార్డులు ఉన్నా చెన్నైసూప‌ర్‌కింగ్స్ సాధించిన ఈ రికార్డ్ మాత్రం స్పెష‌ల్‌గా చెప్పుకోవాలి. మ‌హేంద్ర‌సింగ్ ధోనీ నాయ‌క‌త్వం లోని చెన్నై జ‌ట్టు రికార్డ్‌స్థాయిలో 10 సార్లు ఫైన‌ల్ చేరింది.అంతేకాదు 5 సార్లు టైటిల్ సాధించింది. ధోనీ కెప్టెన్సీలో ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు అన్నిసార్లు అత్యుత్త‌మ ప్ర‌తిభ‌చూపిన సూప‌ర్‌కింగ్స్ ఆట‌గాళ్ల అంద‌రి స‌మ‌ష్టికృషితో ఏ టీమ్‌నైనా వ‌ణికించ‌గ‌ల‌రు. కెప్టెన్ ధోనీ వ్యూహాల‌ముందు ప్ర‌త్య‌ర్ధి టీమ్‌లు బిత్త‌ర‌పోవ‌డం ఖాయం.


10.
-----
య‌శ‌స్వి జైశ్వాల్‌..  భార‌త న‌యా సంచ‌ల‌నం త‌న‌దైన ఆట‌తీరుతో జ‌ట్టుకు ఎన్నోవిజ‌యాలు అందిస్తున్నాడు.రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ర‌ఫున ఆడే ఈ లెప్ట్‌హ్యాండ‌ర్  ఐపీఎల్ లో ఎక్కువ  స్ర్టైక్‌రేట్ క‌లిగిఉన్న ఆట‌గాళ్ల‌లో 10వ స్థానంలో ఉన్నాడు. దాదాపు ..148 స్ర్టైక్‌రేట్ తో 10 వ స్థానంలోనిలిచాడు. అయితే కేవ‌లం 37 ఇన్నింగ్స్‌ల్లో య‌శ‌స్వి ఎంద‌రో స్టార్‌ప్లేయ‌ర్ల‌ను దాటి ఈ ఘ‌న‌త సాధించాడు. 2020 లో లీగ్‌లో అడుగు పెట్టిన ఈ సంచ‌ల‌న ప్లేయ‌ర్... ఇప్పుడున్న ఫామ్‌ని బ‌ట్టి చూస్తే ఈ సీజ‌న్‌లో ఎన్ని స్థానాలు దాటేస్తాడో అని లెక్క‌లు క‌డుతున్నారు ఫ్యాన్స్.


10.
--------
ఐపీఎల్ లో అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోర్ విభాగంలో 10వ స్థానంలో ఉన్నాడు ముర‌ళీ విజ‌య్‌. టెస్ట్ బ్యాట్స్‌మెన్ గా ముద్ర ప‌డిన‌ప్ప‌టికీ ఐపీఎల్లో చెన్నై త‌ర‌ఫున ఆడిన విజ‌య్ 2010 సీజ‌న్‌లో అద‌రగొట్టాడు. 56 బంతుల్లో 127 ప‌రుగులు సాధించాడు. ఇందులో 11 సిక్స్‌లు, 8 ఫోర్లు ఉన్నాయి. రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో విజ‌య్ ధాటికి ఇత‌ర బ్యాట్స్‌మెన్ లు అంద‌రూ నాన్ స్ర్టైక‌ర్లగా మిగిలిపోయారు. త‌న ఈ ఇన్నింగ్స్ విజ‌య్‌ని 10వ స్థానం రికార్డ్ ని అందించింది.


10.
-------
  ఐపీఎల్‌లో ఎక్కువ మ్యాచ్ ల‌కు కెప్టెన్సీ చేసిన ఆట‌గాడి లిస్ట్ లో ప‌దో స్థానంలో ఉండి రికార్డ్ క్రియేట్ చేశాడు టీం ఇండియా ఆట‌గాడు కె.య‌ల్‌. రాహుల్‌. ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ కు నాయ‌క‌త్వం వ‌హించే రాహుల్ ఐపీఎల్‌లో 51 మ్యాచ్‌ల‌కు కెప్టెన్సీ
 చేసి 25 విజ‌యాలు అందించాడు. వికెట్ల వెనుక కీపింగ్ చేస్తూ వ్యూహాలు ర‌చించే రాహుల్ అంపైర్ నిర్ణ‌యాల‌ను పునః స‌మీక్షించే డీ.ఆర్‌.య‌స్ ప‌ట్ల ఖ‌చ్చితంగా ఉంటాడు. ఈ సారి త‌మ టీంకు టైటిల్ అందించ‌డ‌మే ప‌నిగా నెట్లో చెమ‌టోడుస్తున్నాడు.


10.
-----------


ఐపీఎల్ లోఎక్కువ వికెట్లుతీసిన వారిలో భార‌త మాజీ ఆఫ్‌స్పిన్న‌ర్ హ‌ర్బ‌జ‌న్‌సింగ్‌ ప‌ద‌వ‌ ఆట‌గాడిగా కొన‌సాగుతున్నాడు. ముంబై ఇండియ‌న్స్‌, చెన్నై సూప‌ర్‌కింగ్స్ త‌ర‌ఫున ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన బ‌జ్జీ... 150 వికెట్లు త‌న ఖాతాలో వేసుకొన్నాడు. 
2021లో ఐపీఎల్ నుంచి త‌ప్పుకొన్న హ‌ర్బ‌జ‌న్ 7.07 ఎకాన‌మీతో బౌలింగ్ చేసేవాడు. అంతేకాదు...18 ప‌రుగులిచ్చి 5 వికెట్లు తీసి త‌న అత్యుత్త‌మ గ‌ణాంకాలు న‌మోదుచేశాడు.


10.
-----
 ఐపీఎల్ లో అత్య‌ధిక సెంచ‌రీల విభాగంలో 10వ స్థానంలో ఉన్నాడు ద‌క్షిణాఫ్రికా మాజీ ఆట‌గాడు హ‌షీమ్ఆమ్లా. త‌న‌ ఐపీఎల్ కెరీర్‌లో ఆమ్లా 2 సెంచ‌రీలు సాధించాడు. కింగ్స్‌లెవ‌న్ పంజాబ్ త‌ర‌ఫున 2016-2017 లో ప్రాతినిధ్యం వ‌హించిన ఆమ్లా... ఈ ఘ‌న‌త  సొంతం చేసుకొన్నాడు. కేవ‌లం ఒకే సీజ‌న్ లో ఆడిన హ‌షీమ్ రెండు సెంచ‌రీల‌తో అల‌రించాడు. ప్ర‌స్తుతంఈ విభాగంలో ప‌దో స్థానంలో కొన‌సాగుతున్నాడు.



10.
------
ఐపీఎల్ లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ఆట‌గాడి జాబితాలో ప‌దో స్థానంలోఉన్నాడు ర‌విచంద్ర‌న్ అశ్విన్. 2009 నుంచి ఐపీఎల్ ఆడుతున్న అశ్విన్ 197 మ్యాచ్‌లు ఆడి ఈ రికార్డ్ సొంతం చేసుకొన్నాడు. 171 వికెట్లు తీసి జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. ప్ర‌స్తుతం రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తర‌ఫున ఆడుతున్న అశ్విన్... లోయ‌రార్డ‌ర్ లో బ్యాటింగ్ కూడా చేయ‌గ‌ల‌డు.



10.
------- 
స్కోర్‌బోర్డ్ మీద ప‌ది ప‌రుగులు ఎక్కువ ఉంటే మాదే మ్యాచ్ అని చాలామంది కెప్టెన్లు చెప్తుంటారు.  ఆ 10 ప‌రుగులు ఎంత కీల‌క‌మో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కి అర్ధ‌మ‌య్యింది. 2023 ఏప్రిల్ 19న రాజ‌స్థాన్‌ మీద 10 ప‌రుగుల తేడాతో గెలుపొందిన ల‌క్నోసూప‌ర్ జెయింట్స్ మ్యాచ్ గురించి ఇది. లక్నో విధించిన 154 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించ‌లేక 144 ప‌రుగుల వ‌ద్దే ఆగిపోయింది రాజ‌స్థాన్‌. య‌శ‌స్వి జైశ్వాల్‌, బ‌ట్ల‌ర్ లు రాణించినా ల‌క్నో 10 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.


10.
-------------
ఐపీఎల్ లో అత్య‌ధిక టీం స్కోర్ విభాగంలో ప‌దో స్థానంలో ఉంది... గుజ‌రాత్ టైటాన్స్‌. గ‌త సీజ‌న్‌2023లోనే ఈ ఘ‌న‌త 
సాధించింది గుజ‌రాత్. 2023 మే 26న ముంబై ఇండియ‌న్స్ తో జ‌రిగిన పోరులో గుజ‌రాత్ టైటాన్స్ ఈ రికార్డ్ స్కోరు సాధించింంది. అహ్మ‌దాబాద్ లో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో 20 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ 233 ప‌రుగులు సాధించింది. కేవ‌లం 3 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ఈ స్కోరు సాధించింది టైటాన్స్‌. మ‌రోసారి టైటిల్ ఎగ‌రేసుకుపోతుందా అనిపించింది గుజ‌రాత్ ఆట‌తీరు ఈ సీజ‌న్‌లో. ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌ని ఏమాత్రం లెక్క‌చేయ‌కుండా గుజ‌రాత్ ఆడిన తీరు ఈ సీజ‌న్ లో ఫైన‌ల్‌కి త‌సుకెళ్లింది. తుది పోరులో ఓడి ర‌న్న‌ర‌ప్‌తో స‌రిపెట్టుకొంది.


10.
-------
 అత్య‌ధిక వికెట్లు తీసిన వికెట్‌కీప‌ర్‌గా ప‌దో స్థానంలో కొన‌సాగుతున్నాడు ప్ర‌పంచం మెచ్చే వికెట్‌కీప‌ర్ ఆడం గిల్‌క్రిస్ట్‌. కింగ్స్ లెవ‌న్ పంజాబ్‌, డెక్క‌న్ ఛార్జ‌ర్స్ త‌ర‌ఫున బ‌రిలో దిగిన గిల్లీ 80 ఇన్నింగ్స్‌లో 67 మందిని ఔట్ చేశాడు. 2008 నుంచి 2013 వ‌ర‌కు ఐపీఎల్ ఆడిన గిల్‌క్రిస్ట్ 51 క్యాచ్‌లు, 16 స్టంపింగ్ లు చేశాడు. హైద్రాబాద్ కి  టైటిల్ అందించిన గిల్‌క్రిస్ట్ త‌న కీపింగ్ స్కిల్స్ తోనే టీంని ప్ర‌తి మ్యాచ్‌లో న‌డిపాడు. రిటైర‌న‌ప్ప‌టికీ ఇప్ప‌టికీ ఐపీఎల్ లో రికార్డ్ త‌న పేరుమీదే ఉంచుకోవ‌డం విశేషం.