Hardik Pandya said no one will forget promise for IPL 2024: మరికొన్ని రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ipl) ప్రారంభంకానుంది. ఈసారి ఎలాగైన కప్పు కొట్టాలని అన్ని జట్లు వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. ఇటీవలే ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya)... జట్టుతో కలిశాడు. మరో ఆరు రోజుల్లోనే ఐపీఎల్ ప్రారంభంకానున్న వేళ... ముంబై జట్టుతో నూతన సారధి హార్దిక్ కలిశాడు. వచ్చి రావడంతోనే పూజ కార్యక్రమంలో కూడా పాల్గొన్నాడు. సొంత ఫ్రాంచైజీకి తిరిగి వచ్చిన పాండ్య మొదట దేవుళ్ల చిత్ర పటం వద్ద, ముంబై కోచ్ మార్క్‌బౌచర్‌తో కలిసి దీపం వెలిగించాడు. పాండ్యకు అందరూ ఘన స్వాగతం పలికారు. ముంబై కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాండ్యా తొలిసారి స్పందించాడు. ముంబైకి తిరిగిరావడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఓ ప్రత్యేక అనుభూతి
ఈ ఐపీఎల్ సీజన్‌లో ఎవరూ మరచిపోలేని ప్రదర్శన ఇస్తామని పాండ్యా ధీమా వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ముంబై సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ముంబై జెర్సీ ధరించడం ఎప్పుడూ ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుందని అన్నాడు. సొంత గూటికి తిరిగి రావడం ఎప్పుడూ ప్రత్యేకమే అని పాండ్యా అన్నాడు. మలింగ సోదరుడిలా ఉన్నాడని... మార్క్ బౌచర్ ఓ అద్భుతమని కొనియాడాడు. ఎవరూ మరచిపోలేని ఆటతీరు ప్రదర్శిమన్న పాండ్యా... ముంబై ప్రధాన కోచ్ మార్క్ బౌచర్ ప్రశంసలు కురిపించాడు. బౌచర్ సారథ్యంలో విజయాలకు ఎదురుచూస్తున్నాం. టీమ్‌లో కొంతమంది కొత్తవాళ్లు ఉన్నారు.
వెనక ఇంత జరిగిందా..?
ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ (Rohit Sharma)ను తప్పించిన తరువాత తెరవెనుక పెద్ద వివాదమే జరిగింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను నియమించిన తరువాత జట్టులో అంతర్గతంగా సైతం ఈ నిర్ణయం ఎవరికీ రుచించలేదు. పైగా ఫ్యాన్స్ అయితే భారీ స్థాయిలో సోషల్ మీడియా ఖాతాల్లో ముంబై ఇండియన్స్ ను అన్ ఫాలో చేశారు. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ ముంబై మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయంతో అభిమానుల హృదయం ముక్కలైంది. ముంబై టీమ్‌కు ఎన్నో టైటిళ్లు అందించిన రోహిత్‌ను పక్కన పెట్టిన ముంబై టీమ్ హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా చేసింది. దీంతో వివాదం చెలరేగింది.
హాగ్ ఏమన్నాడంటే..
హార్దిక్‌పాండ్యా గుజరాత్‌ను వీడడడం ఆ జట్టుకు పెద్ద నష్టం కాదని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ అన్నాడు. హార్దిక్ లేకున్నా గుజరాత్ టైటాన్స్ బలంగానే ఉందని పేర్కొన్నాడు. పాండ్య లేకపోవడం గుజరాత్ టైటాన్స్‌కు పెద్దగా నష్టం కలిగించదని బ్రాడ్ హాగ్ వెల్లడించాడు. హార్దిక్ లేని లోటును గుజరాత్ పూడ్చుకోగలదని... ఆ జట్టుకు బలమైన బౌలింగ్ దళం ఉందని బ్రాడ్ హాగ్ అన్నాడు. హార్దిక్ లేకున్నా గుజరాత్ పటిష్టంగానే ఉందన్నాడు. ముంబై తరఫున తన అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాడని భావిస్తున్నానని బ్రాడ్ హాగ్ వివరించాడు.