Gujarat Titans 89 all out: బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఢిల్లీ(DC) బౌలర్లు విజృంభించారు. గుజరాత్(GT)ను 89 పరుగులకే కట్టడి చేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ నిర్ణయం సరైందేనని కాసేపటికే అర్థమైంది. గుజరాత్ బ్యాటర్లను ఢిల్లీ బౌలర్లు అసలు క్రీజులో కుదురుకోనివ్వలేదు. బౌలింగ్‌కుతోడు మంచి ఫీల్డింగ్ కూడా ఢిల్లీకి కలిసి వచ్చింది. వికెట్ల వెనక కెప్టెన్ పంత్ చురుగ్గా కదిలి ఆకట్టుకున్నాడు. ఢిల్లీ జట్టు దెబ్బకి గుజరాత్ కనీసం 20 ఓవర్లు పూర్తిచేయలేకపోయింది. 17.3 ఓవర్లకే ఆలౌట్ అయ్యింది.
పరుగుల రాకే గగనమైన వేళ...
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ ఇన్నింగ్స్‌ను... శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా ప్రారంభించారు. ఎదుర్కొన్న తొలి బంతికే బౌండరీ బాదిన శుభ్‌మన్ గిల్.. తన ఉద్దేశాన్ని చాటాడు. కానీ ఇషాంత్ శర్మ వేసిన రెండో ఓవర్‌లో ఐదో బంతికి పృథ్వీ షాకు క్యాచ్ ఇచ్చి గిల్ అవుటయ్యాడు. ఎనిమిది పరుగులు చేసి శుభ్‌మన్ గిల్ పెవిలియన్ చేరాడు. కాసేపటికే గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. రెండు పరుగులు చేసి వృద్ధిమాన్ సాహా ఔటయ్యాడు.ముకేశ్ కుమార్ వేసిన నాలుగో ఓవర్‌లో ఐదో బంతిని వికెట్ల మీదికి ఆడుకుని సాహా వెనుదిరిగాడు. దీంతో 4 ఓవర్లకు 28 పరుగులు చేసి గుజరాత్ రెండు వికెట్లు కోల్పోయింది. కాసేపటికే గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన సాయి సుదర్శన్ రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో 28 పరుగుల వద్దే గుజరాత్ మరో వికెట్‌ను కోల్పోయింది. అనంతరం కూడా గుజరాత్ వికెట్ల పతనం కొనసాగింది. పంత్ పట్టిన సూపర్ క్యాచ్‌కు డేవిడ్ మిల్లర్ అవుటయ్యాడు. ఇషాంత్ శర్మ వేసిన బౌలింగ్‌లో డేవిడ్ మిల్లర్ ఇచ్చిన క్యాచ్‌ను పంత్ అద్భుతంగా అందుకున్నాడు. దీంతో గుజరాత్ 30 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. రిషభ్ పంత్ అద్భుతంగా డైవ్ చేస్తూ క్యాచ్ అందుకోవడంతో మిల్లర్ వెనుదిరిగాడు. ఖలీల్ అహ్మద్ ఆరో ఓవర్‌ను మెయిడిన్ చేశాడు. పవర్ ప్లే ముగిసేసరికి గుజరాత్ స్కోరు 30/4. ఈ సీజన్‌లో పవర్ ప్లే ముగిసే సరికి ఇదే రెండో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. అనంతరం పంత్ మెరుపు స్టంపింగ్‌తో గుజరాత్ ఐదో వికెట్ కోల్పోయింది. ట్రిస్టన్ స్టబ్స్ వేసిన తొమ్మిదో ఓవర్‌లో రిషభ్ పంత్ మెరుపు వేగంతో కీపింగ్ చేసి స్టంప్స్‌ను పడగొట్టడంతో అభినవ్ వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో పంత్ వికెట్ కీపింగ్‌లో అదరగొట్టాడు. స్టబ్స్ వేసిన తొమ్మిదో ఓవర్‌లో ఐదో బంతికి షారూఖ్ ఖాన్‌ను మెరుపు వేగంతో పంత్ స్టంప్ ఔట్ చేశాడు. గుజరాత్ 48 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఢిల్లీ బౌలర్ల ధాటికి గుజరాత్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. అక్షర్ పటేల్ వేసిన 12 ఓవర్‌లో రెండో బంతికి రాహుల్ తెవాటియా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. బౌలర్ల ధాటికి గుజరాత్ ప్రధాన బ్యాటర్లంతా పెవిలియన్ చేరారు. రషీద్ ఖాన్ ఒక్కడే కాస్త క్రీజ్ లో నిలబడ్డాడు అనేలోపు ఖలీల్ అహ్మద్ వేసిన 15 ఓవర్‌లో చివరి బంతికి మోహిత్ శర్మ సుమిత్‌కు క్యాచ్ ఇచ్చాడు. కుల్‌దీప్ యాదవ్ వేసిన 17 ఓవర్‌లో రెండో బంతిని రషీద్‌ఖాన్ స్టాండ్స్‌లోకి పంపించాడు. తరువాత 3 బంతులకే 31 పరుగులతో ఒంటరి పోరాటం చేస్తున్న రషీద్ ఖాన్ ఔటయ్యాడు.
దీంతో గుజరాత్ 17.3 ఓవర్లలో 89 పరుగులకే ఆలౌటైంది. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ 3, ఇషాంత్ శర్మ 2, ట్రిస్టన్ స్టబ్స్ 2, ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ తీశారు. ఐపీఎల్ చరిత్రలో గుజరాత్‌కిదే అత్యల్ప స్కోరు. ఈ సీజన్‌లో ఒక జట్టు చేసిన అత్యల్ప స్కోరు కూడా ఇదే.