IPL Revealed Final List Of Players For Mega Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మెగా వేలం కోసం ఆటగాళ్ల తుది జాబితాను నిర్వాహకులు వెల్లడించారు. మొదట 1,574 మంది ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేశారు. కానీ తర్వాత జాబితాను 574 మందికి కుదించారు. IPL 2025 వేలం తుది జాబితాలో 574 మంది ఆటగాళ్లు ఉన్నారు. 366 మంది ఇండియన్ ప్లేయర్ల కాగా 208 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు, వీరిలో ముగ్గురు అసోసియేట్ దేశాల నుంచి ఆడేవాళ్లు ఉన్నారు. వీరిలో 318 మంది అన్‌క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్, 12 అన్‌క్యాప్డ్ ఓవర్సీస్ ప్లేయర్స్, 48 క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్, 193 క్యాప్డ్ ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు.


నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో మెగా వేలం జరగనుంది. రెండు రోజుల ఈవెంట్ కోసం అత్యధిక రిజర్వ్ ధర ₹2 కోట్లుగా నిర్ణయించారు. ప్రముఖ భారతీయ ప్లేయర్స్‌ సహా మొత్తం 81 మంది ఆటగాళ్లు బేస్ ధరను ₹2 కోట్లుగా నిర్ణయించారు.


IPL 2025 వేలం కోసం ₹2 కోట్ల బేస్ ప్రైస్ తో ఉన్న ఆటగాళ్లు వీళ్లే:


ఇండియన్ ప్లేయర్స్‌ -26



  1. శ్రేయస్ అయ్యర్ (టీమిండియా, బ్యాటర్)

  2. రిషబ్ పంత్ (టీమిండియా, బ్యాటర్)

  3. అర్ష్‌దీప్ సింగ్ (టీమిండియా, బౌలర్)

  4. యుజ్వేంద్ర చాహల్ (టీమిండియా, బౌలర్)

  5. KL రాహుల్ (టీమిండియా, వికెట్ కీపర్)

  6. మహ్మద్ షమీ (టీమిండియా, బౌలర్)

  7. మహ్మద్ సిరాజ్ (టీమిండియా, బౌలర్)

  8. దేవదత్ పడిక్కల్ (టీమిండియా, బ్యాటర్)ర

  9. విచంద్రన్ అశ్విన్ (టీమిండియా, ఆల్ రౌండర్)

  10. వెంకటేష్ అయ్యర్ (టీమిండియా, ఆల్ రౌండర్)

  11. హర్షల్ పటేల్ (టీమిండియా, ఆల్ రౌండర్)

  12. కృనాల్ పాండ్యా (టీమిండియా, ఆల్ రౌండర్)

  13. వాషింగ్టన్ సుందర్ (టీమిండియా,  ఆల్ రౌండర్)

  14. శార్దూల్ ఠాకూర్ (టీమిండియా, ఆల్ రౌండర్)

  15. అర్ష్‌దీప్ సింగ్ (టీమిండియా, బౌలర్)

  16. ఉమేష్ యాదవ్ (టీమిండియా, బౌలర్)

  17. యుజ్వేంద్ర చాహల్ (టీమిండియా, బౌలర్)

  18. మహ్మద్ షమీ (టీమిండియా, బౌలర్)

  19. మహ్మద్ సిరాజ్ (టీమిండియా, బౌలర్)

  20. సయ్యద్ ఖలీల్ అహ్మద్ (టీమిండియా, బౌలర్)

  21. అవేష్ ఖాన్ (టీమిండియా, బౌలర్)

  22. ప్రసిద్ధ్ కృష్ణ (టీమిండియా, బౌలర్)

  23. టి. నటరాజన్ (టీమిండియా, బౌలర్)

  24. దీపక్ చాహర్ (టీమిండియా, బౌలర్)

  25. భువనేశ్వర్ కుమార్ (టీమిండియా, బౌలర్)

  26. ముఖేష్ కుమార్ (టీమిండియా, బౌలర్)


విదేశీ ఆటగాళ్లు


ఇంగ్లండ్ ఆటగాళ్లు -14



  1. జోస్ బట్లర్ (ఇంగ్లండ్, వికెట్ కీపర్)

  2. లియామ్ లివింగ్‌స్టోన్ (ఇంగ్లండ్, ఆల్ రౌండర్)

  3. హ్యారీ బ్రూక్ (ఇంగ్లండ్, బ్యాటర్)

  4. బెన్ డకెట్ (ఇంగ్లండ్, బ్యాటర్)

  5. జేమ్స్ విన్స్ (ఇంగ్లండ్, బ్యాటర్)

  6. సామ్ కుర్రాన్ (ఇంగ్లండ్, ఆల్ రౌండర్)

  7. లియామ్ లివింగ్‌స్టోన్ (ఇంగ్లాండ్, ఆల్ రౌండర్)

  8. మొయిన్ అలీ (ఇంగ్లండ్, ఆల్ రౌండర్)

  9. విల్ జాక్స్ (ఇంగ్లండ్, ఆల్ రౌండర్)

  10. గుస్ అట్కిన్సన్ (ఇంగ్లండ్, ఆల్ రౌండర్)

  11. టామ్ కుర్రాన్ (ఇంగ్లండ్, ఆల్ రౌండర్)

  12. ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్, బౌలర్)

  13. క్రిస్ జోర్డాన్ (ఇంగ్లండ్, బౌలర్)

  14. టైమల్ మిల్స్ (ఇంగ్లండ్, బౌలర్)


ఆస్ట్రేలియా ఆటగాళ్లు-13



  1. మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా, బౌలర్)

  2. జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ (ఆస్ట్రేలియా, బ్యాటర్)

  3. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా, బ్యాటర్)

  4. స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా, బ్యాటర్)

  5. మిచెల్ మార్ష్ (ఆస్ట్రేలియా, ఆల్ రౌండర్)

  6. గ్లెన్ మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా, ఆల్ రౌండర్)

  7. మార్కస్ స్టోయినిస్ (ఆస్ట్రేలియా, ఆల్ రౌండర్)

  8. టిమ్ డేవిడ్ (ఆస్ట్రేలియా, ఆల్ రౌండర్)

  9. సీన్ అబాట్ (ఆస్ట్రేలియా, ఆల్ రౌండర్)

  10. మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా, బౌలర్)

  11. జోష్ హేజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా, బౌలర్)

  12. ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా, బౌలర్)

  13. స్పెన్సర్ జాన్సన్ (ఆస్ట్రేలియా, బౌలర్)


న్యూజిలాండ్ ఆటగాళ్లు-10



  1. డెవాన్ కాన్వే (న్యూజిలాండ్, బ్యాటర్)

  2. గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్, బ్యాటర్)

  3. కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్, బ్యాటర్)

  4. ఫిన్ అలెన్ (న్యూజిలాండ్, బ్యాటర్)

  5. డారిల్ మిచెల్ (న్యూజిలాండ్, ఆల్ రౌండర్)

  6. మిచెల్ సాంట్నర్ (న్యూజిలాండ్, ఆల్ రౌండర్)

  7. ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్, బౌలర్)

  8. లాకీ ఫెర్గూసన్ (న్యూజిలాండ్, బౌలర్)

  9. మాట్ హెన్రీ (న్యూజిలాండ్, బౌలర్)

  10. ఆడమ్ మిల్నే (న్యూజిలాండ్, బౌలర్)


దక్షిణాఫ్రికా ఆటగాళ్లు-8



  1. కగిసో రబడ (దక్షిణాఫ్రికా, బౌలర్)

  2. ఐడెన్ మార్క్రామ్ (దక్షిణాఫ్రికా, బ్యాటర్)

  3. ఫాఫ్ డు ప్లెసిస్ (దక్షిణాఫ్రికా, బ్యాటర్)

  4. రిలీ రోసౌ (దక్షిణాఫ్రికా, బ్యాటర్)

  5. రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (దక్షిణాఫ్రికా, బ్యాటర్)

  6. కగిసో రబడ (దక్షిణాఫ్రికా, బౌలర్)

  7. అన్రిచ్ నార్ట్జే (దక్షిణాఫ్రికా, బౌలర్)

  8. తబ్రైజ్ షమ్సీ (దక్షిణాఫ్రికా, బౌలర్)


వెస్టిండీస్ ఆటగాళ్లు-3



  1. ఎవిన్ లూయిస్ (వెస్టిండీస్, బ్యాటర్)

  2. జాసన్ హోల్డర్ (వెస్టిండీస్, ఆల్ రౌండర్)

  3. అల్జారీ జోసెఫ్ (వెస్టిండీస్, బౌలర్)


ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు-4



  1. నూర్ అహ్మద్ (ఆఫ్ఘనిస్తాన్, బౌలర్)

  2. ముజీబ్ ఉర్ రెహమాన్ (ఆఫ్ఘనిస్తాన్, బౌలర్)

  3. నవీన్ ఉల్ హక్ (ఆఫ్ఘనిస్తాన్, బౌలర్)

  4. ఫజల్హాక్ ఫరూకీ (ఆఫ్ఘనిస్తాన్, బౌలర్)


శ్రీలంక ఆటగాళ్లు-2



  1. వనిందు హసరంగా (శ్రీలంక, బౌలర్)

  2. మహేశ్ తీక్షణ (శ్రీలంక, బౌలర్)


బంగ్లాదేశ్ ఆటగాళ్లు-1



  1. ముస్తాఫిజుర్ రెహమాన్ (బంగ్లాదేశ్, బౌలర్)