IPL 2025 Final Tickets: IPL 2025 ప్లేఆఫ్ మ్యాచ్‌లు మే 29 నుంచి ప్రారంభమవుతాయి.  భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) శనివారం, మే 24 నుంచి ప్లేఆఫ్ మ్యాచ్‌ల టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభించింది. మొదటి క్వాలిఫైయర్ మే 29 జరగనుంది. 30న ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ జూన్ 1న జరుగుతుంది. అయితే ఫైనల్ మ్యాచ్ (IPL 2025 ఫైనల్) జూన్ 3న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగనుంది. ఫైనల్ మ్యాచ్‌కు టిక్కెట్లు ఎలా బుక్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం?

ప్లేఆఫ్ మ్యాచ్‌లకు జొమాటో ద్వారా టిక్కెట్స్‌ బుక్ చేసుకోవచ్చు. మీరు ఫైనల్, ప్లేఆఫ్‌లోని ఇతర మ్యాచ్‌లకు టిక్కెట్లు బుక్ చేయాలనుకుంటే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ అధికారిక వెబ్‌సైట్‌కి కూడా వెళ్లవచ్చు. ఇంకా జొమాటో ద్వారా డిస్ట్రిక్ట్ వెబ్‌సైట్ ద్వారా కూడా టిక్కెట్లు బుక్ చేయవచ్చు.

టిక్కెట్లు ఇలా బుక్ చేయండి: 

ముందుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ అధికారిక వెబ్‌సైట్ లేదా జొమాటో ద్వారా డిస్ట్రిక్ట్ వెబ్‌సైట్ లేదా యాప్‌ను డౌన్‌ లోడ్ చేసుకొని అందులో కూడా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత క్వాలిఫైయర్ 1 లేదా 2, ఎలిమినేటర్ లేదా మీరు ఫైనల్ మ్యాచ్ టిక్కెట్ కొనుగోలు చేయాల్సి ఉందో ఎంచుకోండి. ఆ తర్వాత మీరు మైదానంలో ఎక్కడ, ఎన్ని టిక్కెట్లు కొనుగోలు చేయాలనుకుంటున్నారో ఎంచుకోవాలి. ఆ తర్వాత మీరు వివరాలను పూరించి చెల్లింపు చేయాలి. మీరు టిక్కెట్లు బుక్ చేసిన ప్లాట్‌ఫామ్ నుంచి మీరు టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. టిక్కెట్లు బుక్ అయిన తర్వాత మీకు ఇమెయిల్ ద్వారా కన్ఫర్మేషన్ వస్తుంది.

ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది?

మొదటి క్వాలిఫైయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌లు ముల్లన్పూర్ మైదానంలో జరుగుతాయి. రెండో క్వాలిఫైయర్, ఫైనల్ మ్యాచ్‌లకు నరేంద్ర మోడీ స్టేడియంను ఎంచుకున్నారు. ఇప్పటివరకు పంజాబ్ కింగ్స్ క్వాలిఫైయర్ 1లో తమ స్థానాన్ని ఖరారు చేసుకుంది, మరోవైపు ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్ మ్యాచ్ సవాలును అధిగమించాల్సి ఉంటుంది.

  • మే 29 - మొదటి క్వాలిఫైయర్
  • మే 30 - ఎలిమినేటర్
  • జూన్ 1 - రెండో క్వాలిఫైయర్
  • జూన్ 3 - ఫైనల్

మరోవైపు ఈ ఫైనల్ మ్యాచ్ తర్వాత జరిగే వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ప్రతి భారతీయుడు గర్వించేలా BCCI ఈ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అసలు విషయం ఏంటంటే BCCI IPL 2025 ఫైనల్‌కు ఆపరేషన్ సిందూర్ హీరోలను ఆహ్వానించింది. ఆపరేషన్ సిందూర్‌లో వారి 'వీరోచిత పోరాటానికి' IPL 2025 ముగింపు వేడుకలో సెల్యూట్ చేయనుంది. BCCI కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా ఒక మీడియా ప్రకటనలో దీనిని ప్రకటించారు.

దేవ్‌జిత్ సైకియా మంగళవారం వార్తా సంస్థ PTIతో మాట్లాడుతూ, "ఆపరేషన్ సిందూర్ విజయాన్ని జరుపుకోవడానికి మేము అన్ని భారత సాయుధ దళాల అధిపతులు, ఉన్నతాధికారులు, సైనికులను అహ్మదాబాద్‌లో జరిగే IPL ఫైనల్‌కు ఆహ్వానించాము" అని అన్నారు. దేశ సాయుధ దళాల 'శౌర్యం, ధైర్యం, నిస్వార్థ సేవ'కు BCCI సెల్యూట్ చేస్తుందని సైకియా అన్నారు. దేశాన్ని రక్షించి, ప్రేరేపించిన 'ఆపరేషన్ సిందూర్' కింద వీరోచిత పోరాటాన్ని ఆయన ప్రశంసించారు.

వారి పట్ల కృతజ్ఞతకు చిహ్నంగా, ముగింపు వేడుకను సాయుధ దళాలకు అంకితం చేయాలని, మన హీరోలను గౌరవించాలని నిర్ణయించుకున్నామని సాకియా అన్నారు, క్రికెట్ జాతీయ అభిరుచిగా ఉన్నా దేశం సార్వభౌమత్వం, సమగ్రత, భద్రత కంటే ఏదీ పెద్దది కాదు. జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆర్మీ చీఫ్‌గా ఉండగా, అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి నేవీ చీఫ్‌గా ఉన్నారు. ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ వైమానిక దళ చీఫ్‌గా ఉన్నారు.