IPL 2025 Dushmantha Chameera Catch: ఐపీఎల్ 2025 సీజ‌న్ ప్రారంభ‌మై దాదాపు 40 రోజులు దాటింది. ఇప్ప‌టివ‌ర‌కు ఎన్నో క్యాచ్ ల‌ను మ‌నం చూసి ఉంటాం. కానీ, మంగ‌ళ‌వారం కోల్ క‌తా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ లో న‌మోదైన ఒక క్యాచ్ ఈ టోర్నీకి హైలెట్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఢిల్లీ ప్లేయ‌ర్ దుష్మంత చ‌మీరా ఈ క్యాచ్ ను తీసుకుని ఒక్కసారిగా క్రికెట్ అభిమానుల‌ను పుల‌క‌రింప చేశాడు. కోల్ క‌తా ఇన్నింగ్స్ 20వ ఓవ‌ర్లో ఈ వింత న‌మోదైంది. ఆ ఓవ‌ర్ ను మిషెల్ స్టార్క్ వేయ‌గా, నాలుగో బంతిని కేకేఆర్ ప్లేయ‌ర్ అనుకుల్ రాయ్ బౌండ‌రీ వైపు త‌ర‌లించాడు . అంతా ఆ బంతిని చూసి సిక్స‌రో, ఫోరో అనుకున్నారు. అయితే బౌండ‌రీ వ‌ద్ద కాపుకాసిన చ‌మీరా మెరుపు వేగంతో క‌దిలి, గాల్లో ఉండ‌గానే ప‌క్షిలాగా అందుకున్నాడు. దీంతో మ్యాచ్ చూస్తున్న ప్రేక్ష‌కుల‌కే కాదు, ఆట‌గాళ్లు కూడా ఒక్క నిమిషం అలా షాకై చూస్తూ ఉండి పోయారు. తాజాగా ఈ క్యాచ్ ఇప్పటివ‌ర‌కు న‌మోదైన క్యాచ్ ల్లో అత్యుత్త‌మ‌మైన‌దని నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో చ‌ర్చ చేస్తున్నారు. 

కేకేఆర్ విజ‌య‌పు బాట‌లోకి..ఇక క‌చ్చితంగా గెల‌వాల్సిన మ్యాచ్ లో కేకేఆర్ జూలు విదిల్చింది. డిఫెండింగ్ చాంపియ‌న్ గా బ‌రిలోకి దిగిన కేకేఆర్ ఇప్ప‌టివ‌ర‌కు స్థాయికి తగ్గ ఆట‌తీరు క‌న‌బ‌ర్చ‌లేదు. ఓవ‌రాల్ గా 9 మ్యాచ్ లు ఆడి, 5 ప‌రాజ‌యాలు, మూడు విజ‌యాల‌తో ప‌ట్టిక‌లో దిగువ‌నే ఉంది. ఇక  ఈ మ్యాచ్ లో 14 ప‌రుగులతో విజ‌యం సాధించి, నాలుగో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. అలాగే నాకౌట్ ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది. అన్ని రంగాల్లో రాణించి ఢిల్లీపై అద్భుత విజ‌యం సాధించింది. ఒక ద‌శ‌లో ఓట‌మి ఖాయ‌మ‌నుకున్న త‌రుణంలో వ‌రుస వికెట్లు తీసి, గేమ్ పై ప‌ట్టు సాధించింది. 

నాలుగో విజ‌యం..టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ దిగిన కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 204 పరుగులు చేసింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అంగ్ క్రిష్ రఘువంశి (32 బంతుల్లో 44, 3 ఫోర్లు, 2 సిక్సర్లు)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు.బౌలర్లలో మిషెల్ స్టార్ట్ కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓవర్లన్నీ ఆడి 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. ఓపెనర్ బ్యాటర్ ఫాఫ్ డు ప్లెసెస్ స్టన్నింగ్ ఫిఫ్టీ (45 బంతుల్లో 62, 7 ఫోర్లు,2 సిక్సర్లు) తో రాణించాడు. బౌలర్లలో నరైన్ కి మూడు వికెట్లు తీసుకున్నాడు. ఈ విజయంతో కేకేఆర్ ఏడో స్థానంలో తన స్థానాన్ని మరింతగా పటిష్టం చేసుకుంది.