IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మిడిల్ ఆర్డర్‌లో నిలకడగా పరుగులు చేసే బ్యాట్స్‌మెన్ లేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శుభారంభం లభించినప్పటికీ ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 21 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మిడిల్ ఆర్డర్ క్లిక్ అవ్వకపోవడానికి అతిపెద్ద కారణం స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ ఘోరమైన ఫాం. గత సీజన్‌లో హీరోగా నిలిచిన దినేష్ కార్తీక్ ఇప్పటివరకు ఐపీఎల్ 16లో జీరో అని నిరూపించుకున్నాడు. జట్టులో అతని స్థానంపై ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
వాస్తవానికి దినేష్ కార్తీక్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2022 మెగా వేలంలో రూ. 5.5 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. వయస్సు పరంగా చూసుకుంటే దినేష్ కార్తీక్‌పై ఇంత డబ్బు పెట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కానీ దినేష్ కార్తీక్ గొప్పగా బ్యాటింగ్ చేసి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. అయితే దినేష్ కార్తీక్ ఈ సీజన్‌లో గత సీజన్ ప్రదర్శనను రిపీట్ చేయలేకపోయాడు.
డెత్ ఓవర్లలో పరుగులు చేయాలని దినేష్ కార్తీక్ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంచనా వేసింది. ఈ విషయంలో దినేష్ కార్తీక్ బిగ్గెస్ట్ ఫ్లాప్ అని నిరూపించుకుంటున్నాడు. డెత్ ఓవర్లలో కార్తీక్ IPL 16లో కేవలం 10.60 సగటుతో, 136 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించాడు. అయితే 2022లో మాత్రం కార్తీక్ డెత్ ఓవర్‌లలో 83 సగటు, 207 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు.
జట్టులో కార్తీక్ స్థానం ప్రమాదంలో
ఓవరాల్‌గా దినేష్ కార్తీక్ ఈ సీజన్‌లో ఫెయిల్యూర్ అని నిరూపించుకుంటున్నాడు. 8 మ్యాచ్‌లు ఆడిన దినేష్ కార్తీక్ 12 సగటు, 131 స్ట్రైక్ రేట్‌తో 86 పరుగులు మాత్రమే చేశాడు. ఈ కాలంలో దినేష్ కార్తీక్ అత్యుత్తమ స్కోరు 28 పరుగులు మాత్రమే. ఈ సీజన్‌లో డీకే రెండు సిక్సర్లు మాత్రమే బాదాడు.
2022 సీజన్‌లో దినేష్ కార్తీక్ 16 మ్యాచ్‌లలో 16 ఇన్నింగ్స్‌లు ఆడి 330 పరుగులు చేశాడు. అందులో 10 సార్లు నాటౌట్‌గా మిగిలిపోయాడు. 2022లో కార్తీక్ సగటు 55 కాగా, స్ట్రైక్ రేట్ 184గా ఉంది. గత సీజన్‌లో కార్తీక్ 22 సిక్సర్లు కొట్టగలిగాడు. ఒకవేళ దినేష్ కార్తీక్ మిగిలిన మ్యాచ్‌ల్లో పరుగులు చేయకపోతే వచ్చే సీజన్‌లో జట్టులో కొనసాగడం చాలా కష్టం.
2021లో భారత జట్టు ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా జరిగిన మ్యాచ్‌లలో దినేష్ కార్తీక్ కామెంటరీ విషయంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అతని కొత్త టాలెంట్ కూడా అభిమానులకు బాగా నచ్చింది. ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న హోమ్ సిరీస్‌లో మరోసారి అతను కామెంటరీ బాక్స్‌లో కూర్చోవడం కనిపిస్తుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోడ్‌కాస్ట్ షోలో దినేష్ కార్తీక్ తన వ్యాఖ్యానం గురించి మాట్లాడుతూ ‘నేను దీన్ని చాలా ఆస్వాదించాను. ఈ గేమ్‌ను విశ్లేషకుడి కోణం నుంచి చూడటం, ఆ సమయంలో ప్రజలను గేమ్‌తో కనెక్ట్ చేసేలా ఏదైనా చెప్పడం నా ప్రయత్నం. అభిమానులకు సులభంగా అర్థమయ్యేలా కామెంటరీ సమయంలో మ్యాచ్ గురించి మాట్లాడేందుకు నేను ఎప్పుడూ ప్రయత్నిస్తాను.’ అన్నాడు.