IPL RCB: ఐపీఎల్ ఫైనల్ కు చాన్నాళ్ల తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేరింది. ఎప్పుడూ లేని విధంగా ఈ జట్టు కప్పు గెలవాలా లేదా అన్నదానిపై విస్తృత చర్చలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో భిన్నమైన మీమ్స్ వస్తున్నాయి.
ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చాలా సార్లు బ్యాడ్ లక్ పరిస్థితిని ఎదుర్కొొంది. బెంగళూరు మొదటి నుంచి ఫేవరేట్ టీమే కానీ లక్ కలసి రాలేదు. కోహ్లీ లాంటి వజ్రం ఆ టీములో ఉన్నా .. స్టార్ ఆటగాళ్లు ఉన్నా.. ఎప్పటికప్పుడు ఆశలు రేపడం.. తర్వాత ఓడిపోవడం కామన్ అయిపోయింది. చివరిగా 9 ఏళ్ల కిందట ఫైనల్ చేరారు. ఇప్పుడు మరోసారి అలాంటి అవకాశం ఉంది. క్వాలిఫయర్ లో ఏకపక్షంగా గెలిచి ఫైనల్ చేరుకున్నారు. ఇంకొక్క అడుగు వేస్తే టైటిల్ అందుకుంటారు.
ఇప్పుడు ఐపీఎల్ ఫ్యాన్స్ మొత్తం రాయల్ చాలెంజర్స్ బెంగళూరే కప్ అందుకోవాలని అనుకుంటున్నారు. కనీసం కోహ్లీ కోసమైనా కప్ ఆ జట్టు గెలవాలని సగటు క్రికెట్ ప్రేమికుడు కోరుకుంటున్నాడు. అందుకే ఈ సారి ఫైనల్ రికార్డు స్థాయిలో వ్యూయర్ షిప్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. అన్ని జట్లపై ఈ టోర్నీలో బెంగళూరు మంచి ఆటతీరు కనబరిచిందని అంటున్నారు. అయితే హ్యూమనిటీ పేరుతో బెంగళూరును ట్రోల్ చేయడం మాత్రం నెటిజన్లు కొనసాగిస్తున్నారు.
కాని ఐపీఎల్ లో ఆర్సీబీకి ఇప్పటి వరకూ ఎదురవుతున్న దురదృష్టాన్ని చూసి.. చాలా మంది భయపడుతున్నారు. ఆర్సీబీపై వ్యతిరేక ప్రచారాన్నీ ఖండిస్తున్నారు.
అయితే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం ఈ సాలా కప్ నమదే అనే కన్నడ నినాదాన్ని మాత్రం గట్టిగానే వినిపిస్తున్నారు.