DC vs RR IPL 2024 Rajasthan Royals opt to bowl: ఐపీఎల్‌ ప్లే ఆఫ్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే నెగ్గి తీరాల్సిన మ్యాచ్‌లో పటిష్టమైన రాజస్థాన్‌ రాయల్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడనుంది. టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజు బౌలింగ్‌ ఎంచుకొని ఢిల్లీని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో ప్లే ఆఫ్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ లో  ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ కు దిగింది. రిషబ్ పంత్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ మరోసారి  విధ్వంసం సృష్టించాలని ఢిల్లీ కోరుకుంటోంది. ఈ  పిచ్‌  బ్యాటింగ్‌కు అనుకూలంగా  ఉన్నాదని భావిస్తున్నామన్న రిషబ్  జట్టులో కొన్ని సమస్యలున్నా.. ఆటపైనే దృష్టి సారించామన్నాడు.  ఇక పు రాజస్థాన్‌  ఇప్పటికే దాదాపుగా ప్లే ఆఫ్‌లో అడుగుపెట్టేసింది. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే అధికారికంగా ఐపీఎల్లో అడుగుపెట్టిన తొలి జట్టుగా రాజస్థాన్‌ నిలుస్తుంది. ఈ మ్యాచ్‌తో  ఇద్దరు విదేశీ ఆటగాళ్లు అరంగేట్రం చేస్తున్నారు


పోటా పోటీ మ్యాచ్ 


ఢిల్లీ క్యాపిటల్స్‌  ఇప్పటివరకూ 11 మ్యాచ్‌లు ఆడి అయిదు మ్యాచుల్లో గెలిచి ఆరు మ్యాచుల్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్‌ చేరాలంటే మిగిలిన మూడు మ్యాచుల్లో గెలవడం ఢిల్లీకి తప్పనిసరి. అప్పడే పదహారు పాయింట్లతో ఢిల్లీ ప్లే ఆఫ్‌కు చేరుతుంది. ఒక్క మ్యాచ్‌ ఓడినా ప్లే ఆఫ్ ఆశలు సంక్లిష్టంగా మారుతాయి. కోల్‌కత్తా 11 మ్యాచుల్లో 16 పాయింట్లు, రాజస్థాన్‌ రాయల్స్‌ 10 మ్యాచుల్లో 16 పాయింట్లతో దాదాపుగా ప్లే ఆఫ్‌కు చేరుకున్నాయి. ఇంకో రెండు బెర్తులు మాత్రమే మిగిలి ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ , సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడు జట్లు కూడా 11 మ్యాచుల్లో  12 పాయింట్లు సాధించి టాప్‌ 5లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ జట్లను అధిగమించాలంటే పంత్‌కు మూడు మ్యాచుల్లోనూ విజయం అవసరం. ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగే ‌ప్లాట్‌ పిచ్‌పై పంత్‌, మెక్‌గుర్క్‌ రాణిస్తే ఢిల్లీకి తిరుగుండదు. 


తిరుగు లేని రాజస్థాన్‌

రాజస్థాన్‌ జట్టు అన్ని విభాగాల్లో చాలా పటిష్టంగా ఉంది. రియాన్, కెప్టెన్ సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్‌, రోవ్‌మన్ పావెల్, షిమ్రాన్ హెట్‌మెయర్, ధృవ్ జురెల్‌లతో రాజస్తాన్‌ బ్యాటింగ్‌ బలంగా ఉంది.   ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ , అవేష్ ఖాన్,  రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్‌లతో బౌలింగ్‌ కూడా చాలా బలంగా ఉంది.  అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న రాయల్స్‌ను ఆపడం కష్టమే కావచ్చు.  అయితే ఈ మ్యాచ్ లో కొన్ని కారణాలతో ధ్రువ్‌, హెట్‌మేయర్‌ లు జట్టులో లేరు. వారి స్థానంలో శుభమ్ దూబె, డోనోవాన్‌ ఫెరెరా  దిగారు. 

 


రాజస్థాన్‌  జట్టు : యశస్వి జైస్వాల్‌, సంజూ శాంసన్‌(కెప్టెన్‌), రియాన్‌ పరాగ్‌, డోనోవాన్‌ ఫెరెరా, రోవ్‌మాన్‌ పావెల్‌, శుభమ్‌ దూబె, రవిచంద్రన్‌ అశ్విన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, అవేశ్‌ ఖాన్‌, సందీప్‌ శర్మ, యుజ్వేంద్ర చాహల్‌


 ఢిల్లీ జట్టు : జేక్‌ ఫ్రెసర్‌ మెక్‌గర్క్‌, అభిషేక్‌ పోరెల్‌, షై హోప్‌, రిషభ్‌ పంత్(కెప్టెన్‌), ట్రిస్టన్‌ స్టబ్స్‌, గుల్బాదిన్‌ నైబ్‌, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, ముకేశ్‌కుమార్‌, ఇషాంత్‌ శర్మ, ఖలీల్ అహ్మద్‌