CSK vs SRH IPL 2024 Preview and Prediction : ఈ ఐపీఎల్‌లో సీజన్‌లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(srh)పై ప్రతీకారం తీర్చుకునేందుకు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(csk) సిద్ధమైంది. లక్నో చేతిలో వరుసగా రెండు మ్యాచుల్లో పరాజయం పాలైన చెన్నై.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి మళ్లీ గెలుపు బాట పట్టాలని చూస్తోంది. కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలో ఈ సీజన్‌ను చెన్నై ఘనంగా ఆరంభించింది. కానీ లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో వరుసగా రెండు మ్యాచుల్లో పరాజయం పాలై... ప్లే ఆఫ్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. లక్నో బ్యాటర్‌ మార్కస్ స్టోయినిస్ అద్భుతమైన సెంచరీతో చెన్నైపై లక్నో ఘన విజయం సాధించింది. ఈ ఓటముల నుంచి తేరుకుని మళ్లీ విజయాల వైపు పయనించాలని చెన్నై పట్టుదలగా ఉంది.


రెండు జట్లకు కీలకమే...
ఈ సీజన్‌లో మొత్తం ఎనిమిది మ్యాచులు ఆడిన చెన్నై... నాలుగు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో ఉంది. చెన్నై, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్‌కు ఎనిమిది పాయింట్లే ఉన్నా చెన్నై రన్‌రేట్‌ మెరుగ్గా ఉండడంతో ప్రస్తుతం అయిదో స్థానంలో ఉంది. ఈ స్థానాన్ని పదిలం చేసుకోవాలంటే చెన్నైకు ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి. ఈ సీజన్‌లో రెండుసార్లు అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడి గెలవాలంటే చెన్నై అన్ని విభాగాల్లోనూ రాణించాల్సి ఉంది. చెన్నై బ్యాటింగ్ మొత్తం కెప్టెన్ గైక్వాడ్ చుట్టూ తిరుగుతోంది. రుతురాజ్‌ బ్యాట్‌తో రాణిస్తున్నాడు. రవీంద్ర జడేజా కూడా బ్యాట్‌తో చెలరేగుతున్నా చెన్నై టాప్ ఆర్డర్ ఇంకా గాడిన పడలేదు. రచిన్ రవీంద్ర, డారిల్‌ మిచెల్ ఇద్దరూ పరుగులు చేయకపోవడం చెన్నైను ఆందోళన పరుస్తోంది. చెన్నై బౌలింగ్ మాత్రం చాలా బలంగా ఉంది. పతిరాణ మెరుగ్గా రాణిస్తున్నాడు. 


హైదరాబాద్‌ మరో ఊచకోతేనా..?
బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో ఓడిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఈ మ్యాచ్‌లో గెలిచి మళ్లీ విజయాల బాట పట్టాలని చూస్తోంది. బెంగళూరుపై హైదరాబాద్‌ టాపార్డర్‌, మిడిల్‌ ఆర్డర్‌ సమిష్టిగా విఫలమైంది. ఛేజింగ్‌లో ఈ వైఫల్యాన్ని అధిగమించాలని హైదరాబాద్‌ చూస్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉందని ప్రధాన కోచ్ డేనియల్ వెట్టోరి కూడా అంగీకరించాడు. ఐడెన్ మాక్రమ్‌ మెరుగ్గా రాణించాల్సి ఉంది. బౌలింగ్‌లో కూడా హైదరాబాద్‌ విఫలమవుతోంది. భువనేశ్వర్ కుమార్ మాత్రమే చివరి మూడు మ్యాచ్‌లలో కేవలం ఒక వికెట్ మాత్రమే తీశాడు. ఉమ్రాన్ మాలిక్, ఫజల్‌హాక్ ఫరూఖీ, ఆకాష్ సింగ్ విఫలమవుతున్నారు. వీరు రాణించాల్సిన అవసరం ఉంది. 



చెన్నై సూపర్ కింగ్స్: ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రాజవర్ధన్ హంగర్గేకర్, మిచెల్ సాంట్నర్, తుషార్ దేశ్‌పాండే, మతీషా పతిరానా, సిమర్‌జీత్ సింగ్, ప్రశాంత్ సోలన్‌కి, ప్రశాంత్ సోలన్‌కి తీక్షణ, షేక్ రషీద్, నిషాంత్ సింధు, అజయ్ మండల్, ముఖేష్ చౌదరి, రచిన్ రవీంద్ర, శార్దూల్ ఠాకూర్, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, ముస్తాఫిజుర్ రెహమాన్, అవినాష్ రావు అరవెల్లి



సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, ఐడెన్ మార్క్‌రామ్, అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్‌), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్‌, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, అన్మోల్‌ప్రీత్ సింగ్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, ఉపేంద్ర యాదవ్, ఝటవేద్ సుబ్రమణ్యన్, సన్వీర్ సింగ్, విజయకాంత్ వియాస్కాంత్, ఫజల్హాక్ ఫరూకీ, మార్కో జాన్సెన్, ఆకాష్ మహరాజ్ సింగ్, మయాంక్ అగర్వాల్