CSK vs SRH IPL 2024 Head to Head records : వరుస పరాజయాలతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB).. సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) తో కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. బౌలింగ్ వైఫల్యంతో వరుసగా విఫలమవుతున్న బెంగళూరు.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించి భీకరంగా ఉన్న హైదరాబాద్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఈ సీజన్ ఐపీఎల్‌లో విజయాల బాట పట్టాలని బెంగళూరు పట్టుదలగా ఉండగా.. బెంగళూరుపైనా విజయం సాధించి ప్లే ఆఫ్‌కు అవకాశాలు మరింత పెంచుకోవాలని హైదరాబాద్ భావిస్తోంది. వరుస పరాజయాలతో బెంగళూరు ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో గెలిచి రెండు కీలకమైన పాయింట్లను సంపాదించాలని హైదరాబాద్ చూస్తోంది.
హెడ్ టు హెడ్ రికార్డులు ఇలా..
ఐపీఎల్‌లో ఇప్పటివరకూ బెంగళూరు, హైదరాబాద్ 24 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో సన్‌రైజర్స్ 13 విజయాలు సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ 10 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఒక మ్యాచులో ఫలితం రాలేదు. హైదరాబాద్‌లో ఇరు జట్లు 8 మ్యాచుల్లో తలపడగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరు గెలవగా... బెంగళూరు రెండు గెలిచింది.
హైదరాబాద్ పిచ్ రిపోర్ట్
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పిచ్ బ్యాటర్లకు అత్యంత అనుకూలమైనది. ఇదే పిచ్‌పై హైదరాబాద్, ముంబై ఇండియన్స్‌పై హైదరాబాద్ 277 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఇప్పటివరకు మొత్తం 72 ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. ఈ మ్యాచ్‌లలో, మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 32 సార్లు విజయం సాధించగా, ఛేజింగ్ జట్టు 40 సార్లు విజయం సాధించింది.
ఈ ఐపీఎల్‌లో హైదరాబాద్ ఇప్పటివరకూ ఏడు మ్యాచ్‌లు ఆడి అయిదు మ్యాచుల్లో గెలిచి రెండింట్లో ఓడిపోయి 10 పాయింట్లతో పట్టికలో మూడవ స్థానంలో ఉంది. బెంగళూరు ఎనిమిది మ్యాచుల్లో ఒకే విజయంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది.
జట్లు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేసాయి, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, విజయ్‌కుమార్ వైషాక్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కర్రాన్, లాకీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్.
సన్‌రైజర్స్ హైదరాబాద్: పాట్ కమిన్స్ (కెప్టెన్), అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్‌రామ్, మార్కో జాన్సెన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, టి. నటరాజన్, అన్మోల్‌ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, ఉపేంద్ర సింగ్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, నితీష్ కుమార్ రెడ్డి, ఫజల్హాక్ ఫరూకీ, షాబాజ్ అహ్మద్, ట్రావిస్ హెడ్, జయదేవ్ ఉనద్కత్, ఆకాష్ సింగ్, ఝాతవేద్ సుబ్రమణ్యన్.