CSK Vs MI: ఎల్ క్లాసికో అంటూ బోలెడంత హైప్ క్రియేట్ అయిన ముంబయి-చెన్నై మ్యాచ్ దాదాపుగా వన్ సైడెడ్ గా ముగిసింది. చెన్నై సూపర్ కింగ్స్.... తమ హోం గ్రౌండ్ లో ముంబయిపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాప్-5 మూమెంట్స్ ఏంటో చూద్దాం.
సీఎస్కే పవర్ ప్లే బౌలింగ్
ఈ మ్యాచ్ సగానికి సగం.... ముంబయి ఇండియన్స్ పవర్ ప్లేలోనే అయిపోయింది. 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ మొత్తం మీద ముగ్గురు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోర్లు సాధించారు. అతి కష్టం మీద 139 స్కోర్ చేశారు.
సీఎస్కే పేసర్లు అదరగొట్టారు
పూర్తిగా యువరక్తంతో నిండిన చెన్నై పేస్ బౌలింగ్... ధోనీని అస్సలు డిజప్పాయింట్ చేయలేదు. జూనియర్ మలింగ పతిరాన 4 ఓవర్లలో కేవలం 15 పరుగులు ఇచ్చి 3వికెట్లు తీశాడు. చాహర్, తుషార్ రెండేసి వికెట్లు తీశారు.
నేహాల్ వాదేరా హాఫ్ సెంచరీ
ముంబయి బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోషన్ సాధించి నంబర్ 4 లో వచ్చిన యువ ఆటగాడు నేహాల్ వాదేరా 64 పరుగుల మంచి ఇన్నింగ్స్ ఆడాడు. తన తొలి ఫిఫ్టీ స్కోర్ చేయడమే కాక ముంబయికి ఓ గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.
సీఎస్కే పవర్ ప్లే అటాకింగ్ బ్యాటింగ్
140 లక్ష్యంతో ఛేజింగ్ కు దిగిన చెన్నై... దాదాపుగా పవర్ ప్లేలోనే మ్యాచ్ తనవైపు తిప్పేసుకుంది. రుతురాజ్ 16 బాల్స్ లోనే 30 కొట్టి ఇంటెంట్ చూపించాడు. ఆ తర్వాత కాన్వే చివరిదాకా ఉండగా... రహానే, శివమ్ దూబే తలో చేయి వేశారు.
రోహిత్ శర్మ ఖాతాలో చెత్త రికార్డు
ముంబయి కెప్టెన్ తన పూర్ ఫాం కొనసాగిస్తున్నాడు. వరుసగా 2వ మ్యాచ్ లోనూ డకౌట్ అయ్యాడు. మొత్తం మీద ఓవరాల్ గా ఐపీఎల్ హిస్టరీలోనే ఎక్కువసార్లు డకౌట్ అయిన చెత్త రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. 16 సార్లు సున్నాకే ఔట్ అయ్యాడు.... ఇప్పటిదాకా ఐపీఎల్ లో.
ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో విజయం సాధించింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వికెట్లతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 17.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లలో డెవాన్ కాన్వే (44: 42 బంతుల్లో, నాలుగు ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో పీయూష్ చావ్లా రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక ముంబై విషయానికి వస్తే నెహాల్ వధేరా (64: 51 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్) అత్యధిక స్కోరు సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో మతీష పతిరాణా నాలుగు ఓవర్లలో కేవలం 15 పరుగులకు మూడు వికెట్లు తీసుకున్నాడు. ఈ మ్యాచ్ విజయంతో చెన్నై 13 పాయింట్లతో రెండో స్థానానికి దూసుకెళ్లింది. ముంబై ఇండియన్స్ పది మ్యాచుల్లో 5 విజయాలు, 5 ఓటములతో 10 పాయింట్లు సాధించి ఆరో స్థానంలోనే ఉంది.