Chennai Super Kings Back Stephen Fleming Despite Fan Fury:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజీ అయిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఒక బిగ్ డెసిషన్ తీసుకుంది. ఐపీఎల్ 2026 సీజన్ లో ఘోరంగా ఫెయిల్ అయ్యాక కోచింగ్ స్టాఫ్ లో మార్పులు వస్తాయనే రూమర్స్ కు సీఎస్కే మేనేజ్‌మెంట్ ఎండ్ కార్డ్ వేసింది. తాజా రిపోర్ట్ ప్రకారం హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ను పదవి నుంచి తొలగించే ఆలోచన సీఎస్కేకు లేదు. 2008 నుంచి ఈ ఫ్రాంచైజీతో ప్లేయర్‌గా అసోసియేట్ అయిన ఫ్లెమింగ్, 2009 నుంచి హెడ్ కోచ్‌గా సేవలు అందిస్తున్నాడు. ఐపీఎల్ 2025 లో లాస్ట్ ప్లేస్ లో నిలిచిన చెన్నై, ఐపీఎల్ 2026 లో ఎయిత్ ప్లేస్ కే పరిమితమైంది. దీంతో సోషల్ మీడియాలో "శాక్ ఫ్లెమింగ్" క్యాంపెయిన్స్ నడిచినా మేనేజ్‌మెంట్ మాత్రం అతనిపైనే నమ్మకం ఉంచింది. అతని కాంట్రాక్ట్ ను మరో సీజన్ కోసం ఎక్స్‌టెండ్ చేయనున్నారు.  

Continues below advertisement

Read Also: FIFA World Cup Record: గోల్స్ సునామీతో 68 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఫిఫా వరల్డ్ కప్ 2026వ ఎడిష‌న్.. డచ్ టీమ్ హిస్టారికల్ ఫీట్

ఎమ్మెల్సీ ముగిశాక రివ్యూ.. ధోనీ ఇన్ఫ్లుయెన్స్ ఇంకా స్ట్రాంగ్ప్రస్తుతం స్టీఫెన్ ఫ్లెమింగ్ అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ (MLC) లో చెన్నై సబ్సిడరీ టీమ్ అయిన టెక్సాస్ సూపర్ కింగ్స్ కు హెడ్ కోచ్‌గా వర్క్ చేస్తున్నాడు. ఈ టోర్నీ ముగిసిన వెంటనే సీఎస్కే మేనేజ్‌మెంట్ ఐపీఎల్ 2026 పర్ఫార్మెన్స్ పై ఒక అఫీషియల్ రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయనుంది. అక్కడే ఫ్లెమింగ్ కాంట్రాక్ట్ ఎక్స్‌టెన్షన్ పై అఫీషియల్ స్టాంప్ పడనుంది. సీఎస్కే తీసుకున్న ఈ డెసిషన్ వెనుక లెజెండ్ ఎమ్మెస్ ధోనీ ఇన్ఫ్లుయెన్స్ ఇంకా స్ట్రాంగ్ గా ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. ధోనీ, ఫ్లెమింగ్ కాంబినేషన్ ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్-కోచ్ పెయిర్ కావడంతో పాత స్ట్రక్చర్‌నే బ్యాక్ చేయాలని చెన్నై ఫిక్స్ అయింది. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఖలీల్ అహ్మద్, డేవిడ్ మిల్లర్ ల మార్పిడి (స్వాప్) పై కొన్ని ఎంక్వైరీలు వచ్చినా చెన్నై దాన్ని తిరస్కరించింది. అలాగే హార్దిక్ పాండ్యా కోసం ఎలాంటి అప్రోచ్ జరగలేదని మేనేజ్‌మెంట్ స్పష్టం చేశాడు.  

Continues below advertisement

Read Also: Team India Chances: సౌతాఫ్రికా చేతిలో దెబ్బతిన్న హర్మన్‌ప్రీత్ సేన.. సెమీస్ రేసు కాస్త సంక్లిష్టం..  క్వాలిఫై లెక్క‌లు ఇవే!

ఐపీఎల్ 2027 ఫస్ట్ మెగా ట్రేడ్.. లక్నోను వీడనున్న పంత్మరోవైపు ఐపీఎల్ 2027 సీజన్ కు ముందే ఒక సంచలన ప్లేయర్ ట్రేడింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. లక్నో సూపర్ జాయింట్స్ (LSG) నుంచి వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మళ్లీ తన పాత ఫ్రాంచైజీ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ (DC) లోకి వెళ్లడం దాదాపు ఖాయమైంది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో లక్నో టీమ్ పంత్‌ను ఏకంగా రూ. 27 కోట్ల రికార్డ్ ప్రైస్ పెట్టి కొనుగోలు చేసింది. ఐపీఎల్ హిస్టరీలోనే ఇది అత్యంత ఖరీదైన బిడ్. కానీ లక్నో మేనేజ్‌మెంట్‌తో లీడర్‌షిప్ రోల్ పై వచ్చిన కొన్ని ఇష్యూస్ వల్ల పంత్ ఇప్పుడు లక్నోను వీడాలని డిసైడ్ అయ్యాడు. ఐపీఎల్ ట్రేడ్ విండో రూల్స్ ప్రకారం సీజన్ ముగిసిన ఒక నెల నుంచి నెక్స్ట్ వేలానికి ఒక వారం ముందు వరకు ఈ ప్లేయర్ల మార్పిడికి ఛాన్స్ ఉంటుంది.  

కుల్దీప్-పంత్ స్వాప్ డీల్.. బీసీసీఐ అప్రూవల్ కోసం వెయిటింగ్ఈ మెగా ట్రేడ్ లో భాగంగా రిషభ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ లోకి వస్తుండగా, అతని ప్లేస్ లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లక్నో సూపర్ జాయింట్స్ లోకి వెళ్లనున్నాడు. ఈ స్వాప్ డీల్ కోసం రెండు ఫ్రాంచైజీలు తీవ్రంగా డిస్కస్ చేస్తున్నాయని ఇన్సైడ్ సోర్స్ స‌మాచారం. అయితే పంత్ తీసుకునే అమౌంట్, కుల్దీప్ కోసం లక్నో చెల్లించే ప్రైస్ మనీకి సంబంధించిన ఫార్మాలిటీస్ ఇంకా పూర్తి కాలేదు. "రిషభ్-కుల్దీప్ స్వాప్ ట్రేడ్ జరుగుతున్న మాట నిజమే. రెండు ఫ్రాంచైజీలు ఇందులో బిజీగా ఉన్నాయి. కానీ ఫైనల్ అమౌంట్, మిగిలిన ఫార్మాలిటీస్ ప్రెజెంట్ బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అప్రూవల్ కోసం పెండింగ్ లో ఉన్నాయి" అని ఈ డెవలప్‌మెంట్‌తో క్లోజ్ గా ఉన్న ఒక అఫీషియల్ సోర్స్ స్పష్టం చేశాడు. ఈ డీల్ కి గ్రీన్ సిగ్నల్ వస్తే ఐపీఎల్ 2027 లో ఇదే బిగ్గెస్ట్ ట్రేడ్ అవుతుంది.