సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే కొన్ని రికార్డులు పడగొట్టారు. రికార్డులతో పాటు ఈ మ్యాచ్‌లో విజయం కూడా చెన్నైకి దక్కింది.
చెన్నై తరఫున అత్యధిక భాగస్వామ్యం
ఐపీఎల్‌లో చెన్నై తరఫున ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు ఐపీఎల్‌లో నెలకొల్పిన టాప్-5 భాగస్వామ్యాలు ఇవే.
1. రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే - 182 (మొదటి వికెట్‌కు, సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై, 2022లో)
2. షేన్ వాట్సన్, ఫాఫ్ డుఫ్లెసిస్ - 181 నాటౌట్ (మొదటి వికెట్‌కు, పంజాబ్ కింగ్స్‌పై, 2020లో)
3. రాబిన్ ఊతప్ప, శివం దూబే - 165 (మూడో వికెట్‌కు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై, 2022లో)
4. మైక్ హస్సీ, మురళీ విజయ్ - 159 (మొదటి వికెట్‌కు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై, 2011లో)
5. మురళీ విజయ్, ఆల్బీ మోర్కెల్ - 152 (మూడో వికెట్‌కు, రాజస్తాన్ రాయల్స్‌పై, 2010లో)
ఐపీఎల్ చరిత్రలో నాలుగో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం
మొత్తంగా ఐపీఎల్ చరిత్రలోనే మొదటి వికెట్‌కు ఇది నాలుగో అత్యధిక ఓపెనింగ్ పార్ట్‌నర్‌షిప్. టాప్-4 లిస్ట్ ఇదే. మరో నాలుగు పరుగులు చేసి ఉంటే లిస్ట్‌లో పైన ఉండేవాళ్లు.
1. డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో - 185 (రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై, 2019లో)
2. గౌతం గంభీర్, క్రిస్ లిన్ - 184 నాటౌట్ (గుజరాత్ లయన్స్‌పై, 2017లో)
3. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ - 183 (రాజస్తాన్ రాయల్స్‌పై, 2020లో)
4. రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే - 182 (సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై, 2022లో)
రుతురాజ్ అరుదైన రికార్డు... కానీ దీన్ని ఎవరూ కోరుకోరు...
ఐపీఎల్‌లో 99 పరుగులకు అవుటైన ఐదో బ్యాటర్‌గా రుతురాజ్ గైక్వాడ్ నిలిచాడు. ఇంతకు ముందు 99 పరుగులకు అవుటైన నలుగురు వీళ్లే.
1. విరాట్ కోహ్లీ
2. పృథ్వీ షా
3. ఇషాన్ కిషన్
4. క్రిస్ గేల్
5. రుతురాజ్ గైక్వాడ్