Team India News: తెలుగు రాష్ట్రాల క్రికెట్ ప్రేమికులకు శుభవార్త. అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే టీమిండియా హోం సీజన్ లో ఒక టీ20 విశాఖపట్నంలో జరుగుతుంది. ఇండియా, సౌతాఫ్రికాల మధ్య మూడో టీ20 మ్యాచ్ కు సాగర నగరం వేదికైంది. ఇక అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు జరిగే హోం సీజన్ ను బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. వచ్చే జూన్ లో ఇంగ్లాండ్ పర్యటన తర్వాత వెస్టిండీస్, సౌతాఫ్రికాలతో సొంతగడ్డపై టీమిండియా మ్యాచ్ లను ఆడనుంది. తాజాగా దీనికి సంబంధించిన షెడ్యూల్ ను వెలువరించింది. అక్టోబర్ నెలలో ఇండియాలో హోం మ్యాచ్ లు జరుగుతాయి. అహ్మదాబాద్ లో వెస్టిండీస్ తో జరిగే తొలి టెస్టుతో హోం మ్యాచ్ లు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 2-6 వరకు తొలి టెస్టు, అదేనెల 10-14 వరకు కోల్ కతాలో రెండో టెస్టు జరుగుతుంది. ఆ తర్వాత కాస్త విరామం తర్వాత ఇండియాలో సౌతాఫ్రికా టూర్ మొదలు కాబోతోంది. ఈ సిరీస్ లో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లను భారత్, సౌతాఫ్రికాలు ఆడనున్నాయి.
గువాహటిలో తొలి టెస్టు..ఇక అసోంలోని గువాహటి తొలిసారిగా టెస్టు మ్యాచ్ కు ఆతిథ్యమివ్వబోతోంది. సౌతాఫ్రికా, ఇండియా జట్ల మధ్య జరిగే రెండు టెస్టుల సిరీస్ లో ఆఖరిదైన రెండో టెస్టుకు గువాహటి ఆతిథ్యమిస్తోంది. తొలుత ఫస్ట్ టెస్టు ఈ రెండు జట్ల మధ్య నవంబర్ 14-18 మధ్య న్యూఢిల్లీ లో జరగుతుంది. ఆ తర్వాత రెండో టెస్టు గువాహటి వేదికగా నవంబర్ 22-26 మధ్య జరుగుతుంది. ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్ జరుగుతుంది. నవంబర్ 30న రాంచీలో తొలి వన్డే, డిసెంబర్ 3న రాయ్ పూర్ లో రెండో మ్యాచ్ జరుగుతాయి.
విశాఖలో వన్డే మ్యాచ్.
ఈ సారి హో సీజన్ లో విశాఖ పట్నంలోనూ ఒక మ్యాచ్ నిర్వహించనున్నారు. ఇండియా, సౌతాఫ్రికా మధ్య డిసెంబర్లో 6న విశాఖ పట్నంలో మూడో వన్డే జరుగుతుంది. భారత్ ఆడబోయే మొత్తం నాలుగు సిరీస్ లకి కలిపి తెలుగు గడ్డపై జరిగే ఏకైక మ్యాచ్ ఇదే కావడం విశేషం. పై మూడు సిరీస్ లకు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఆడతారు. ఆ తర్వాత టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది. వన్డే సిరీస్ తర్వాత ఇండియా, ప్రొటీస్ మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభవుతుంది. ఇక సిరీస్ లో తొలి టీ20 కటక్ లో డిసెంబర్ 9న జరుగుతుంది. ఆ తర్వాత డిసెంబర్ 11న న్యూ చండీగఢ్ లో రెండో టీ20, 14న ధర్మశాలలో మూడో టీ20, అదేనెల 17న లక్నోలో నాలుగో టీ20, ఆఖరిదైన ఐదో టీ20 డిసెంబర్ 19న అహ్మదాబాద్ లో జరుగుతుంది. దీంతో ఇండియాలో ఈ ఏడాదికి సంబంధించి హోం సీజన్ ముగుస్తుంది.