Jofra Archer in Indian Premier League: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 కోసం ఫ్రాంచైజీలు ఇప్పటికే తమ సన్నాహాలను ప్రారంభించారు. ఈ గ్రాండ్ లీగ్ షెడ్యూల్‌ను బీసీసీఐ ఇది వరకే ప్రకటించింది. ఈ నెల చివరి రోజైన మార్చి 31వ తేదీ నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. దీనికి ముందు ఛాంపియన్ ఫ్రాంచైజ్ ముంబై ఇండియన్స్‌కు మంచి గుడ్ న్యూస్ వినిపించింది. ఇంగ్లండ్ జట్టు స్టార్ ప్లేయర్, ముంబై ఇండియన్స్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ మొత్తం సీజన్‌కు అందుబాటులో ఉండనున్నారు.


ముంబై ఇండియన్స్‌కు పెద్ద రిలీఫ్
ఐపీఎల్ 2023కి ముందు, ముంబై ఇండియన్స్ ఇది పెద్ద రిలీఫ్ అని చెప్పవచ్చు. జోఫ్రా ఆర్చన్ ఐపీఎల్ మొత్తం సీజన్‌కు జోఫ్రా ఆర్చర్ అందుబాటులో ఉంటాడని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది. స్టార్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా లేకపోవడం కారణంగా ముంబై ఇండియన్స్ ఇటీవల పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.


అదే సమయంలో జోఫ్రా ఆర్చర్ ఫిట్‌నెస్ కూడా ముంబై ఇండియన్స్‌పై ఒత్తిడిని పెంచింది. మొత్తం సీజన్‌కు ఆర్చర్ అందుబాటులో ఉంటాడన్న సమాచారం తెరపైకి వచ్చిన తర్వాత ఇప్పుడు ముంబైకి పెద్ద ఉపశమనం లభించింది. ఏదేమైనా, జోఫ్రా ఆర్చర్ వర్క్ లోడ్ బాధ్యతలు అన్నీ ఈసీబీ చేతిలో ఉంటాయి.


ముంబై ఇండియన్స్‌లో జస్‌ప్రీత్ బుమ్రా చాలా ముఖ్యమైన ఆటగాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీగా నిలవడం వెనుక జస్‌ప్రీత్ బుమ్రాదే కీలక పాత్ర. అతని నిష్క్రమణ  ప్రభావాన్ని జట్టు బౌలింగ్ ఆర్డర్‌లో స్పష్టంగా చూడవచ్చు. అటువంటి పరిస్థితిలో ఫ్రాంచైజీకి అతని స్థానంలో ప్రత్యామ్నాయాన్ని కనుగొనడం అంత తేలికైన పని కాదు.


ఏదేమైనా ముంబైకి ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ మొత్తం సీజన్‌కు అందుబాటులో ఉంటాడు. బుమ్రా లేనప్పుడు ముంబై బౌలింగ్ నాయకత్వం అతని చేతుల్లో ఉంటుంది. గత సీజన్‌లో జోఫ్రా ఆర్చర్‌ను ముంబై కొనుగోలు చేసినట్లు గుర్తుంచుకోండి. అయితే గాయం కారణంగా అతను గత సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. కానీ ఇప్పుడు ముంబై తన ఫిట్‌నెస్ నుండి ఎంతో ప్రయోజనం పొందనుంది.