వచ్చే నెలలో UAE వేదికగా జరిగే IPL - 2021 సీజన్ కి పలు ఫ్రాంఛైజీలకు చెందిన కీలక ఆటగాళ్లు దూరమవుతున్నారు. దీంతో ఆయా ఫ్రాంఛైజీలు ఖాళీ అయిన స్థానాలను భర్తీ చేసుకునే పనిలో బిజీగా గడుపుతున్నాయి. మరో పక్క అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో జట్లు యూఏఈ బయల్దేరుతున్నాయి. అక్కడ క్వారంటైన్ ముగించుకుని ప్రాక్టీస్ సెషన్లో ఆటగాళ్లు పాల్గొంటున్నారు.
ఎప్పటికప్పుడు యూఏఈ చేరుకున్న ఆటగాళ్లు ఏం చేస్తున్నారన్నది ఆయా ఫ్రాంఛైజీలు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలుపుతున్నారు. ఇప్పటి వరకు వచ్చే నెల సెప్టెంబరు 19 నుంచి ప్రారంభమయ్యే IPL - 2021 సీజన్‌కి దూరమైన ఆటగాళ్లు ఎవరు? ఎందుకు దూరమయ్యారో తెలుసుకుందాం.
కమిన్స్:
కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు పాట్ కమిన్స్ వ్యక్తిగత కారణాల వల్ల ఈ సీజన్‌కి దూరమయ్యాడు. కమిన్స్ లేకపోవడం KKRకి గట్టి ఎదురుదెబ్బే అని చెప్పాలి.
బట్లర్:
రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ కూడా UAEలో జరిగే IPL సీజన్‌కి దూరమయ్యాడు. త్వరలో బట్లర్ దంపతులు బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ కారణంగానే అతడు దూరమయ్యాడు. అతని స్థానంలో RR ఫిలిప్స్‌ను తీసుకుంది.
అడమ్ జంపా
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లెగ్ స్పిన్నర్ అడమ్ జంపా IPL- 2021 ఆడట్లేదు. ఐపీఎల్ ముగియగానే టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగా టోర్నీ కోసం ప్రకటించిన ఆస్ట్రేలియా జట్టులో జంపా సభ్యుడు. ఆ టోర్నీ కోసం సిద్ధమయ్యేందుకు, తగినంత విశ్రాంతి కోసం జంపా దూరమయ్యాడు.
కేన్ రిచర్డ్‌సన్
జంపాతో మరో ఆసీస్ ఆటగాడు కేన్ రిచర్డ్‌సన్ కూడా RCB ఆటగాడే. ఇతగాడు కూడా టీ20 ప్రపంచకప్ కోసమే IPLకి దూరమయ్యాడు.
మెరిడిత్
గాయం కారణంగా మెరిడిత్ IPLకి దూరమయ్యాడు. పంజాబ్ కింగ్స్‌కి మెరిడిత్ ప్రాతినిథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే.
జే రిచర్డ్‌సన్
ఆసీస్ ఆటగాడు జే రిచర్డ్ సన్ IPL - 2021కి దూరమయ్యాడు. ఇతడు కూడా పంజాబ్ కింగ్స్ ఆటగాడే.
డానియల్ సామ్స్
మెంటర్ హెల్త్ కారణాల వల్ల డానియల్ సామ్స్ ఆడటం లేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు సామ్స్.
ఫిన్ అలెన్
న్యూజిలాండ్‌కి చెందిన ఫిన్ అలెన్ ఆ జట్టు కోసం IPLకి దూరమయ్యాడు. ఇతగాడు కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడే.
జోఫ్రా ఆర్చర్
గాయం కారణంగా ఇంగ్లాండ్ ఆటగాడు జోఫ్రా ఆర్చర్ చాలా రోజుల నుంచి క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే అతడు మిగిలిన IPL సీజన్‌కి దూరమయ్యాడు.