ఐపీఎల్‌లో నేటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో కోహ్లి సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరే హాట్ ఫేవరెట్‌గా కనపడుతుంది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో బెంగళూరు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఇక కోల్‌కతా పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఏడు మ్యాచ్‌ల్లో ఏకంగా ఐదు ఓటములను కోల్‌కతా ఎదుర్కొని ఏడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే కోల్‌కతాకు ప్లేఆఫ్ అవకాశాలు కష్టమే.
ఈ మ్యాచ్ గెలిచి ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే.. ఆండ్రీ రసెల్ కచ్చితంగా ఫాంలోకి రావాల్సిందే. ఈ జట్టులో మరో కీలక ఆటగాడు సునీల్ నరైన్. ఐపీఎల్ 2021 సీజన్‌లో స్పిన్నర్లపై డివిలియర్స్ రికార్డు పేలవంగా ఉంది. 53 బంతుల్లో 64 పరుగులు మాత్రమే చేసి మూడు సార్లు అవుటయ్యాడు. డివిలియర్స్‌పై నరైన్ రికార్డు కూడా కాస్త బానే ఉంది. కోహ్లీని కూడా నరైన్ రెండు సార్లు అవుట్ చేయడం విశేషం. దీంతోపాటు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠిలు బ్యాట్‌తో రాణించాల్సిన అవసరం కూడా ఉంది. కోల్‌కతా కీలక బౌలర్ ప్యాట్ కమిన్స్ ఈ ఐపీఎల్‌కు దూరం అయ్యాడు. అతని స్థానంలో న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌతీ జట్టులోకి వచ్చాడు.
ఇక ఆర్సీబీ మాత్రం పటిష్టంగా ఉంది. విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్ వంటి విధ్వంసక బ్యాట్స్‌మన్ జట్టులో ఉండగా, దేవ్‌దత్ పడిక్కల్ కూడా ఈ సీజన్‌లో మంచి ఫాంలో ఉన్నాడు. అయితే డెత్ ఓవర్లలో బౌలింగ్ విషయంలో బెంగళూరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా 16 నుంచి 20 ఓవర్ల మధ్యలో బెంగళూరు బౌలర్లు విపరీతంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. గత మూడు మ్యాచ్‌లో కలిపితే మొత్తం 15 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసి 193 పరుగులు సమర్పించుకున్నారు. దీనిపై కైల్ జేమీసన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్‌లు దృష్టి పెట్టాలి.
కోల్‌కతా నైట్‌రైడర్స్ తుదిజట్టు(అంచనా)
శుభ్‌మన్ గిల్, నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి, సునీల్ నరైన్, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), ఆండ్రీ రసెల్, దినేశ్ కార్తీక్(వికెట్ కీపర్), లోకి ఫెర్గూసన్, శివం మావి/కమలేష్ నాగర్‌కోటి, ప్రసీద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(అంచనా)
విరాట్ కోహ్లి(కెప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, రజత్ పాటీదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్(వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్/మహ్మద్ అజారుద్దీన్, వనిందు హసరంగ, కైల్ జేమీసన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యజ్వేంద్ర చాహల్