కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది IPL-2021 మధ్యలోనే అర్థంతరంగా ఆగిపోయింది. మిగిలిన మ్యాచ్‌లను నిర్వహించేందుకు ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి. యూఏఈ(UAE)వేదికగా లీగ్‌లో మిగిలిపోయిన 31 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇప్పటికే రెండో దశ లీగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) ప్రకటించింది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 వరకు ఈ మెగా టోర్నీ సెకెండ్‌ హాఫ్‌ జరగనుంది. అయితే IPLతొలి దశలో ఎదురైన సమస్యలకు చెక్‌ పెట్టేందుకు బీసీసీఐ తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టింది. 



ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని రెండో దశ ఐపీఎల్‌ కోసం సరికొత్త రూల్స్‌(NEW RULES)ని తీసుకొచ్చింది. ఎవరైనా బ్యాట్స్‌మెన్ బంతిని స్టాండ్స్‌లోకి బాదితే... ఆ బంతిని తిరిగి ఉపయోగించవద్దనే నిబంధనను తెరపైకి  తెచ్చింది. ఎందుకంటే... బంతి స్టాండ్స్‌లోకి వెళ్లినప్పుడు ఇతరులు తాకే అవకాశం ఉంది. దీంతో ఆటగాళ్లకు కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఆ బంతి స్థానంలో కొత్త బంతిని వినియోగించాలని బీసీసీఐ ప్రతిపాదించింది. ఐపీఎల్‌ సెకెండ్‌ ఫేస్‌ మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతిస్తున్నందున ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చినట్లు బీసీసీఐ స్పష్టం చేసింది.




కాగా, బీసీసీఐ ప్రతిపాదించిన ఈ కొత్త రూల్‌ బ్యాట్స్‌మెన్లకు లాభం చేకూరుతుంది. కానీ, బౌలర్లు మాత్రం టెన్షన్‌. ఎందుకంటే కొత్త బంతి హార్డ్‌గా ఉంటూ సులువుగా బ్యాట్‌ పైకి వస్తుంది. పైగా యూఏఈ పిచ్‌లు స్పిన్నర్లకు సహకరిస్తాయి. అయితే ఈ నిబంధన కారణంగా కొత్త బంతి వచ్చిన ప్రతీసారి బౌలర్లు దానికి అనుగుణంగా బౌల్‌ చేయాల్సి ఉంటుంది. దీంతో బౌలర్లకు బంతిపై పట్టుచిక్కలంటే కష్టమే. ఇది బ్యాట్స్‌మెన్‌కు అడ్వాంటేజ్‌గా మారుతుంది. అందుకే ఈ నిబంధన బౌలర్ల‌కు పెద్ద శిక్షేనని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. స్టాండ్‌కు వెళ్లే బంతిని పూర్తిగా శుభ్రపరిచిన తర్వాత బాల్ లైబ్రరీలో దాచనున్నారు. ఈ ఒక్క నిబంధనే కాదు... చాలా కొత్త నిబంధనలు తీసుకువచ్చింది BCCI.ఇదంతా ఆటగాళ్ల భద్రత కోసమే అని స్పష్టం చేస్తోంది బీసీసీఐ. 


* బంతి షైన్ కోసం ఆటగాళ్లు ఉమ్మి రాస్తారు. కరోనా కారణంగా ఉమ్మి రాయడాన్ని నిలిపివేశారు. ఒకవేళ ఏ ఆటగాడైనా మర్చిపోయి ఉమ్మి రాస్తే అంపైర్ ముందుగా వార్నింగ్ ఇస్తారు. అయినప్పటికీ అలాగే చేస్తే ప్రత్యర్థి జట్టుకు 5 పరుగులు ఇస్తారు. 



* ఎవరైనా ఫ్రాంఛైజీ సభ్యులు, కుటుంబసభ్యులు బయో బబుల్ నిబంధనలను ఉల్లంఘిస్తే మాత్రం ఊరుకునేది లేదని BCCI మరోమారు స్పష్టం చేసింది. 



రెండో విడత ఐపీఎల్‌ మ్యాచులు వచ్చే నెల 19 నుంచి అక్టోబర్‌ 15 వరకు జరుగనున్నాయి. తొలి మ్యాచ్ ముంబయి ఇండియన్స్ x చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది.