Indian flag missing from Karachi stadium: చాంపియన్స్ ట్రోపీలో పాల్గొనే జట్ల జాతీయ జెండాలను ఆతిధ్యం ఇస్తున్న స్టేడియాల మీద ఎగురవేయడం సంప్రదాయం. అయితే పాకిస్తాన్ మాత్రం ఈ సంప్రదాయాన్ని తప్పించింది. కరాచీ స్టేడియంలో భారత జెండాను పక్కన పెట్టి మిగతా జట్లకు చెందిన జాతీయ జెండాలను ఎగురవేసింది. ఈ అంశంపై పాకిస్థానీలు ట్విట్టర్‌లో కామెంట్లు పెట్టి .. లేకి కామెంట్లు చేస్తున్నారు.
పాకిస్తాన్ లో ఘోరమైన భద్రతా పరిస్థితులు ఉన్నాయి. ఈ కారణంగా భారత్ చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనాలని అనుకోలేదు. పాకిస్తాన్ లో ఆడేందుకు బీసీసీఐ రెడీగా లేకపోవడంతో.. భారత్ మ్యాచుల్ని దుబాయ్ కు మార్చారు. ఇతర దేశాల జట్లు పాకిస్తాన్ కు వెళ్లడం వేరు.. బారత జట్టు పాకిస్తాన్ వెళ్లడం వేరు. శ్రీలంక ఆటగాళ్లపై ఓ సారి ఉగ్రవాది జరిగింది.స్టేడియంలో ఆడుతున్న సమయంలోనే వారిపై దాడి జరగడంతో తృటిలో తప్పించుకున్నారు. ఆ తర్వాత ఆ దేశంలో చాలా కాలం క్రికెట్ మ్యాచులు జరగలేదు. ఆ తర్వాతా కొన్ని టీములు పాకిస్తాన్ లో పర్యటించాయి కానీ భారత్ మాత్రం ఎప్పుడూ పాకిస్తాన్ వెళ్లాలని అనుకోలేదు.
చాంపియన్స్ ట్రోఫిని బహిష్కరించాలని ఇండియా అనుకుంది. కానీ భారత్ పాల్గొనకపోతే చాంపియన్స్ ట్రోఫీ ద్వారా అంతో ఇంతో సంపాదించుకోవాలనుకుంటున్న పాకిస్తాన్ ఆదాయానికి గండి పడుతుంది. అందుకే పాకిస్తాన్ చివరికి దుబాయ్ లో భారత్ మ్యాచ్‌లను నిర్వహించేందుకు నిర్ణయించిది. పాకిస్తాన్ విషయంలో సానుకూలంగా వ్యవహరించినా భారత్ ను అవమానించేలా చేస్తున్నారని భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాకిస్తాన్ తీరుపై భారత్ అభిమానులు రగిలిపోతున్నారు. వారు చేసిన పనికి.. ఖచ్చితంగా స్టేడియంలో బుద్ది చెప్పాలంటున్నారు. ఇప్పటి వరూక పెద్ద పెద్ద టోర్నీల్లో పాకిస్తాన్ .. భారత్ పై దాదాపుగా గెలవలేదు. ప్రపంచకప్, చాంపియన్స్ ట్రోఫీ వంటి టోర్నీల్లో అయితే భారత్ దే పైచేయి. భారత్ , పాకిస్తాన్ లు దాయాదులు కావడంతో మ్యాచులు కూడా అాలాగే ప్రచారంలోకి వస్తాయి. దీంతో సహజంగానే క్యూరియాసిటీ పెరుగుతుంది. ఇాలంటి వివాదాల వల్ల మ్యాచులపై మరింత హైప్ వస్తుంది.