Virat Kolhi News: గ‌తేడాది భార‌త జ‌ట్టు ఆశించిన స్థాయిలో రాణించ‌క‌పోవ‌డంతో బీసీసీఐ కఠిన నిబంధ‌ల‌ను ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా, విదేశీ టూర్ల‌కు భార్య‌లు, గ‌ర్ల్ ఫ్రెండ్స్ ని అనుమ‌తించ‌క‌పోవ‌డం, అంద‌రూ క‌లిసి ఒకే బ‌స్సులో ప్ర‌యాణించ‌డం లాంటివి ఉన్నాయి. ప్లేయ‌ర్ ఎవ‌రైనా అంద‌రికీ వ‌ర్తించేలా ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. తాజాగా భార‌త మాజీ కెప్టెన్, విరాట్ కోహ్లీ.. బీసీసీఐ నియ‌మ నిబంధ‌ల‌ను బై పాస్ చేసినట్లు తెలుస్తోంది.

శ‌నివారం దుబాయ్ లో చాంపియ‌న్ ట్రోఫీ కోసం అడుగుపెట్టిన టీమిండియా.. ఆదివారం నుంచే ప్రాక్టీస్ సెష‌న్ మొద‌లు పెట్టింది. సెష‌న్ పూర్త‌య్యాక‌, టీమ్ మేనేజ‌ర్ నుంచి త‌న‌కు కావాల్సిన వంట‌కాల‌ను తెప్పించుకున్న‌ట్లు తెలుస్తోంది. వ్య‌క్తిగ‌త సిబ్బంది అంటే స్టైలిస్టులు, భ‌ద్ర‌తా సిబ్బంది, చెఫ్ ల‌ను బోర్డు అనుమంతించ‌డం లేదు. దీంతో కోహ్లీ.. టీమ్ మేనేజ‌ర్ తో మాట్లాడి త‌న‌కు కావాల్సిన వంట‌కాల‌ను తెప్పించుకున్న‌ట్లు స‌మాచారం. సెషన్ ముగిశాక కొన్ని ప్యాకెట్ల‌తో త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన మేనేజ‌ర్ తో మాట్లాడిన కోహ్లీ, ఆ ప్యాకెట్ల‌ను త‌న కిట్ బ్యాగులో పెట్టుకున్నాడు. కోహ్లీ తెలివి తేట‌ల‌ను చూసి నెటిజ‌న్లు వివిధ ర‌కాలుగా కామెంట్లు చేస్తున్నారు. 

గ్రూపు-ఏలో భార‌త్..ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీలో కాస్త క‌ఠిన‌మైన గ్రూపులోనే భారత్ ఆడుతోంది. ఈనెల 19న దుబాయ్ లో బంగ్లాదేశ్ తో తొలి లీగ్ మ్యాచ్ ఆడుతుంది. ఆ త‌ర్వాత 23న చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్థాన్ తో త‌ల‌ప‌డ‌నుంది. మార్చి 2 న్యూజిలాండ్ తో ఆఖ‌రి లీగ్ మ్యాచ్ లో అమీతుమీ తేల్చుకోనుంది. ఇక ఈ టోర్నీని భార‌త్ రెండుసార్లు గెలుపొందింది. 2002లో సంయుక్తంగా శ్రీలంక‌తో క‌లిసి నెగ్గ‌గా, 2013లో ఆతిథ్య ఇంగ్లాండ్ ను ఓడించి క‌ప్పును కైవ‌సం చేసుకుంది. అయితే 2017లో ఇంగ్లాండ్ లోనే జ‌రిగిన ఈ టోర్నీలో ఫైన‌ల్లో అనూహ్యంగా పాక్ చేతిలో ఓడి ర‌న్న‌ర‌ప్ తో స‌రిపెట్టుకుంది. ఈ సారి ఎలాగైనా పాక్ తో లెక్క స‌రిచేయ‌డంతోపాటు, ముచ్చట‌గా మూడోసారి టైటిల్ నెగ్గి, రికార్డుల‌కెక్కాల‌ని భావిస్తోంది. 

అర్ష‌దీప్ కే చాన్స్..భార‌త పేస్ బౌలింగ్ లో ఈసారి స్పెష‌లిస్టు పేస‌ర్లు ముగ్గురే బ‌రిలోకి దిగుతున్నారు. మ‌హ్మ‌ద్ షమీ తోపాటు కొత్త బంతిని పంచుకోబోయేది అర్ష‌దీప్ సింగేన‌ని మాజీల‌తోపాటు ప‌లువురు విశ్లేష‌కులు భావిస్తున్నారు. అనుభవం, బంతిని రెండు వైపులా స్వింగ్ చేయ‌గ‌ల నైపుణ్యం అత‌ని సొంత‌మని పేర్కొంటున్నారు. మ‌రో పేస‌ర్ హ‌ర్షిత్ రానాతో పోలిస్తే అర్ష‌దీప్ కు అనుభ‌వం ఎక్కువ‌. దీంతో అత‌డినే టోర్నీలో ఆడించాల‌ని సూచిస్తున్నారు. హైబ్రీడ్ మోడ‌ల్లో జ‌రుగుతున్న ఈ టోర్నీలో మిగ‌తా జ‌ట్ల మ్యాచ్ లు పాక్ లోని మూడు వేదిక‌లు రావాల్పిండి, క‌రాచీ, లాహోర్ లో జ‌రుగుతుండ‌గా, భార‌త్ ఆడే మ్యాచ్ లు మాత్రం దుబాయ్ లో జ‌రుగుతున్నాయి. ఈనెల 20న తొలి లీగ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది. 

Read Also: Viral Video: పీసీబీ దుష్ట బుద్ధి..! భార‌త్ ను అవమానించింద‌ని ఫైర‌వుతున్న నెటిజ‌న్లు.. అస‌లేమైందంటే..?