భారత్-శ్రీలంక మధ్య చివరిదైన మూడో T20 ఈ రోజు జరగనుంది. రాత్రి 8 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇప్పటి వరకు జరిగిన రెండు T20ల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి సమజ్జీవులుగా నిలిచాయి. దీంతో ఈ రోజు మ్యాచ్ ఎవరు గెలిస్తే వారికే సిరీస్ సొంతమౌతోంది. ఇప్పటికే సొంతగడ్డపై వన్డే సిరీస్‌ను కోల్పోయిన లంక... ఎలాగైనా T20 సిరీస్‌ను సొంతం చేసుకోవాలని చూస్తోంది.
కృనాల్ పాండ్యకు కరోనా పాజిటివ్ రావడంతో అతడితో సన్నిహితంగా మెలిగిన పలువురు ఆటగాళ్లు చివరి రెండు T20లకు దూరమయ్యారు. దీంతో బుధవారం జరిగిన రెండో టీ20లో నలుగురు ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు నిన్నటి మ్యాచ్లో పర్వాలేదనిపించింది.
సైనీ అనుమానమే
భారత్-శ్రీలంక మధ్య రెండో టీ20లో భారత బౌలర్ నవదీప్ సైనీ గాయపడ్డాడు. దీంతో అతడు ఈ రోజు జరిగే చివరి మ్యాచ్‌కి అందుబాటులో ఉండడనే తెలుస్తోంది. ‘సైనీని మెడికల్ టీం చూసుకుంటోంది. మేము ఫాలో అప్ చేస్తున్నాం. అతని గాయం గురించి పూర్తిగా తెలియాలంటే కొద్ది సమయం వేచి చూడాలి. మెడికల్ టీం ఇచ్చిన రిపోర్టును సెలక్టర్లు, కోచ్‌కు పంపిస్తాం. అప్పుడే అతడు ఆడతాడా లేదా అన్న దానిపై స్పష్టత వస్తోంది’ అని బౌలింగ్ కోచ్ తెలిపారు.
ద్రావిడ్ ఏం రాసి పంపాడు
శ్రీలంక బ్యాటింగ్ చేసే సమయంలో వర్షం రావడంతో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. ఈ సమయంలో భారత జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ 12వ ఆటగాడి ద్వారా కాగితంలో ఏదో రాసి ఆటగాళ్లకు పంపాడు. ఇందుకు సంబంధించిన చిత్రాలు ప్రస్తతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఒక వేళ మ్యాచ్‌లో ఓవర్లు తగ్గిస్తే టార్గెల్ ఎంత వస్తుందో అన్న దాన్ని ద్రవిడ్ రాసి మైదానంలో ఆటగాళ్లకి సమాచారం ఇచ్చాడని అభిమానులు భావిస్తున్నారు.
చాహర్‌ను అభినందించిన లంక క్రికెటర్
15వ ఓవర్లో రాహుల్ చాహర్ వేసిన చివరి బంతికి లంక క్రికెటర్ హసరంగ ఔటయ్యాడు. చాహర్ బంతిని ఎదుర్కొన్న హసరంగ... భువనేశ్వర్ కుమార్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు చాహర్ వికెట్ తీసిన ఆనందంలో సంబరాలు చేసుకుంటుండగా... హసరంగ అతడ్ని అభినందిస్తూ మైదానాన్ని వీడాడు. లంక క్రికెటర్ క్రీడా స్ఫూర్తిని చాటాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
పడిక్కల్ unique record
యువ ఆటగాడు దేవదత్ పడిక్కల్ unique record నెలకొల్పాడు. అంతర్జాతీయ భారత జట్టులో అరంగేట్రం చేసిన 21వ శతాబ్దపు తొలి ఆటగాడిగా పడిక్కల్ రికార్డు సాధించాడు. 2000 జులై 7న పడిక్కల్ జన్మించాడు. ఈ మధ్యే అతడు 21వ పుట్టిన రోజు చేసుకున్నాడు.