వచ్చే నెలలో జరగబోయే ప్రతిష్టాత్మక ICC T20 ప్రపంచకప్ కోసం BCCI భారత జట్టును ప్రకటించింది. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. ఈ నేపథ్యంలో 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ ట్విటర్ వేదికగా ప్రకటించింది. వీరితో పాటు ముగ్గురు స్టాండ్ బై ఆటగాళ్లను ఎంచుకుంది. విరాట్ కోహ్లీ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. రోహిత్ శర్మకి వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది. టోర్నీలో భాగంగా అక్టోబరు 24న భారత్... తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను మొదట ఢీకొట్టనుంది.
మెంటార్‌గా ధోనీ
భారత క్రికెట్ జట్టు మాజీ సారథి, ప్రపంచకప్‌ల హీరో మహేంద్ర సింగ్ ధోనీ... భారత జట్టుతో కలిశాడు. T20 ప్రపంచకప్ కోసం ప్రకటించిన కోహ్లీ సేనకు ధోనీ మెంటార్‌గా వ్యవహరించనున్నట్లు BCCI సెక్రటరీ జై షా ప్రకటించారు.
గబ్బర్‌కి దక్కని చోటు
ప్రపంచకప్ కోసం BCCI ప్రకటించిన జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్‌కి చోటు దక్కలేదు. జట్టుని ప్రకటించక ముందు భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ మాట్లాడుతూ... ఒక వేళ శిఖర్ ధావన్‌కి టీ20 ప్రపంచకప్‌లో చోట దక్కకపోతే ఇక అతడి కెరీర్ ముగిసినట్లే అని వ్యాఖ్యానించాడు.
IPLలో నిలకడగా రాణిస్తోన్న హార్దిక్ పాండ్య సోదరుడు క్రునాల్ పాండ్యకి చోటు దక్కలేదు. అలాగే యుజువేంద్ర చాహల్‌కి కూడా చోటు దక్కకపోవడం గమనార్హం.
అశ్విన్‌కి దక్కిన చోటు
ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న టెస్టు సిరీస్‌లో ఇప్పటి వరకు ఒక్క టెస్టులోనూ తుది జట్టులో స్థానం దక్కించుకోని అశ్విన్ ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. కోహ్లీ - అశ్విన్ మధ్య విభేదాల కారణంగా ఇప్పటి వరకు అతడికి చోటు దక్కలేదన్న వార్తలు చక్కెర్లు కొట్టాయి. అలాగే ప్రపంచకప్ జట్టులో అతడికి స్థానం దక్కదని ఊహించారంతా. కానీ, అందర్నీ ఆశ్చర్యపరుస్తూ అశ్విన్ 15 మందితో కూడిన జట్టులో చోటు దక్కించుకున్నాడు.
ప్రపంచకప్‌లో తలపడే భారత జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమి.
స్టాండ్ బై ఆటగాళ్లు: శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్.
T20 World Cup Schedule For India
Match Date Time Venue
IND vs PAK Oct-24 7:30 PM IST DubaiIND vs NZ Oct-31 7:30 PM IST DubaiIND vs AFG Nov-03 7:30 PM IST Abu DhabiIndia vs B1 Nov-05 7:30 PM IST DubaiIndia vs A2 Nov-08 7:30 PM IST DubaiSemifinal 1 Nov-10 7:30 PM IST Abu DhabiSemifinal 2 Nov-10 7:30 PM IST DubaiFinal Nov-14 7:30 PM IST Dubai