టీమ్‌ఇండియా మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ అద్భుతం చేసింది. అంతర్జాతీయ క్రికెట్లో 20వేల పరుగుల మైలురాయిని అధిగమించింది.  ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచులో ఆమె అర్ధశతకం చేసి ఈ ఘనత అందుకుంది. ఇంగ్లాండ్‌ పర్యటనలోనే ఆమె అత్యధిక పరుగుల రారాణిగా అవతరించిన సంగతి తెలిసిందే.


Also Read: PBKS vs RR Match Preview: దంచుడే దంచుడు.. ఐపీఎల్‌ సిక్సర్ల మ్యాచుకు మీరు సిద్ధమేనా!


మిథాలీ ఒంటరి పోరాటం
ఆస్ట్రేలియాతో టీమ్‌ఇండియా మంగళవారం తొలి వన్డే ఆడింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 8  వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఓపెనర్లు షెపాలీ వర్మ (8), స్మృతి మంధాన (16) విఫలమవ్వడంతో భారమంతా మిథాలీ రాజ్‌ (63; 107 బంతుల్లో 3x4)పై  పడింది. తన అనుభవాన్ని ఉపయోగించి అర్ధశతకం చేసింది. ఆసీస్‌ పేస్‌ బౌలింగ్‌ దాడిని ఎదుర్కొని స్కోరును 225కు తీసుకెళ్లింది. 


Also Read: ENG vs PAK Series: మొన్న న్యూజిలాండ్, ఇప్పుడు ఇంగ్లండ్.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మరో షాక్!


సులభంగా ఛేదన
బౌలింగ్‌లో టీమ్‌ఇండియా విఫలమవ్వడంతో ఆసీస్‌ సునాయాసంగా లక్ష్యం ఛేదించింది. ఓపెనర్లు రేచల్‌ హెయిన్స్‌ (93*; 100 బంతుల్లో 7x4), అలీసా హేలీ (77; 77 బంతుల్లో 8x4, 2x6) తొలి వికెట్‌కు 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ (53*; 69 బంతుల్లో 7x4)తో కలిసి హెయిన్స్‌ 9 ఓవర్లు మిగిలుండగానే విజయం అందించింది.


Also Read: Virat Kohli IPL Record: ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ అరుదైన ఘనత.. ఒకే ఒక్కడుగా నిలవనున్న రన్ మేషీన్!


మిథాలీపై అభినందనలు
అంతర్జాతీయ క్రికెట్లో 20వేల పరుగులు పూర్తి  చేసిన మిథాలీకి ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు తెలియజేస్తున్నారు. ఆమె అర్ధశతకం సాధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. మిథాలీ బయోపిక్‌లో నటిస్తున్న నటి తాప్సీ సైతం ఆమెను ప్రశంసించింది.


 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి