IND Vs WI, T20 Result: వెస్డిండీస్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ 17 పరుగుల తేడాతో విజయం సాధించంది. దీంతో సిరీస్‌ను కూడా 3-0తో వైట్ వాష్ చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 184 పరుగులు సాధించింది. సూర్యకుమార్ యాదవ్ (65: 31 బంతుల్లో, ఒక ఫోర్, ఏడు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం వెస్టిండీస్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేయగలిగింది. నికోలస్ పూరన్ (61: 47 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్) రాణించినా... అది విజయానికి సరిపోలేదు.
పూరన్ దమ్ము సరిపోలేదు
185 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. 2.4 ఓవర్లలో 26 పరుగులకే ఓపెనర్లు కైల్ మేయర్స్ (6: 5 బంతుల్లో), షాయ్ హోప్‌లను (8: 4 బంతుల్లో, రెండు ఫోర్లు) అవుట్ చేసి దీపక్ చాహర్ వెస్టిండీస్‌ను కష్టాల్లో పడేశాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన నికోలస్ పూరన్ (61: 47 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్), రొవ్‌మన్ పావెల్ (25: 14 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) కలిసి వెస్టిండీస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 25 బంతుల్లోనే 47 పరుగులు జోడించారు.
ఆ తర్వాత వెస్టిండీస్ ఇన్నింగ్స్ మళ్లీ ఒడిదుడుకులకు లోనైంది. కేవలం 15 పరుగులు వ్యవధిలోనే రొవ్‌మన్ పావెల్, కీరన్ పొలార్డ్ (5: 7 బంతుల్లో), జేసన్ హోల్డర్ (2: 6 బంతుల్లో) అవుటయ్యారు. ఆ తర్వాత కాసేపటికే రోస్టన్ చేజ్ కూడా అవుట్ కావడంతో విండీస్ 100 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది.
ఈ దశలో ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్ (29: 21 బంతుల్లో, ఒక ఫోర్, మూడు సిక్సర్లు), నికోలస్ పూరన్ వేగంగా ఆడారు. కేవలం 5.2 ఓవర్లలోనే వీరు ఏడో వికెట్‌కు 48 పరుగులు జోడించారు.అయితే విజయానికి 35 పరుగుల దూరంలో పూరన్ అవుటయ్యాడు. ఆ తర్వాత బ్యాట్స్‌మెన్ కూడా వెంట వెంటనే వికెట్లు కోల్పోవడంతో వెస్టిండీస్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 167 పరుగులకు పరిమితం అయింది. భారత బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీయగా... రవి బిష్ణోయ్, వెంకటేష్ అయ్యర్, దీపక్ చాహర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.
అదరగొట్టిన స్కై, వెంకటేష్ అయ్యర్
అంతకు ముందు టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకోవడంతో భారత్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (34: 31 బంతుల్లో, ఐదు ఫోర్లు), రుతురాజ్ గైక్వాడ్ (4: 8 బంతుల్లో, ఒక ఫోర్) భారత్‌కు శుభారంభం ఇవ్వలేకపోయారు. 10 పరుగుల వద్ద రుతురాజ్ అవుటయ్యాడు. ఆ తర్వాత వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ (25: 16 బంతుల్లో, నాలుగు ఫోర్లు), ఇషాన్ కిషన్ రెండో వికెట్‌కు 53 పరుగులు జోడించారు. అయితే వీరిద్దరూ వరుస ఓవర్లలో అవుటయ్యారు.
తొమ్మిదో ఓవర్లో అయ్యర్‌ను వాల్ష్... పదో ఓవర్లో ఇషాన్ కిషన్‌ను రోస్టన్ చేజ్ అవుట్ చేశారు. రెండు వికెట్లు పడ్డాక బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ (7: 15 బంతుల్లో) కూడా విఫలం అయ్యాడు. అనంతరం సూర్యకుమార్ యాదవ్ (65: 31 బంతుల్లో, ఒక ఫోర్, ఏడు సిక్సర్లు), వెంకటేష్ అయ్యర్ (35 నాటౌట్: 19 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) భారత్‌ను ఆదుకున్నారు.
వీరిద్దరూ ఐదో వికెట్‌కు కేవలం 37 బంతుల్లోనే 91 పరుగులు జోడించారు. చివరి ఐదు ఓవర్లలోనే వీరు 86 పరుగులు సాధించడం విశేషం. వెస్టిండీస్ బౌలర్లలో జేసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, రోస్టన్ చేజ్, హేడెన్ వాల్ష్, డొమినిక్ డ్రేక్‌లకు తలో వికెట్ దక్కింది. దీంతో భారత్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.