IND vs SA 4th T20: రాజ్‌కోట్‌లో రన్స్‌ ఫెస్ట్‌! పంత్‌ సేన సిరీస్‌ సమం చేసేనా?

IND vs SA 4th T20: ఐదు టీ20ల సిరీసులో టీమ్‌ఇండియా మరో అగ్ని పరీక్షకు సిద్ధమైంది! నేడు రాజ్‌కోట్‌ (RajKot) వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడనుంది.మరి పిచ్‌ పరిస్థితి ఏంటి? తుది జట్లలో ఎవరుంటారు?

Continues below advertisement

IND vs SA 4th T20: ఐదు టీ20ల సిరీసులో టీమ్‌ఇండియా మరో అగ్ని పరీక్షకు సిద్ధమైంది! నేడు రాజ్‌కోట్‌ (RajKot) వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచులో గెలిస్తేనే పంత్‌ సేనకు సిరీస్ ఆశలు ఉంటాయి. లేదంటే సఫారీలు ట్రోఫీ ఎగరేసుకుపోతారు. మరి పిచ్‌ పరిస్థితి ఏంటి? తుది జట్లలో ఎవరుంటారు?

Continues below advertisement

పరుగుల వరద

రాజ్‌ కోట్‌ అంటేనే పరుగుల వరదకు మారుపేరు! ఇదే వేదికలో 2013లో టీమ్‌ఇండియా 202 టార్గెట్‌ను ఛేదించింది. 2017లో న్యూజిలాండ్‌ 196 టార్గెట్‌ను రక్షించుకుంది. 2019లో బంగ్లాదేశ్‌పై భారత్‌ మరో నాలుగు ఓవర్లు ఉండగానే 154 రన్స్‌ను విజయవంతం ఛేజ్‌ చేసింది. కాగా స్టేడియంలో నేడు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. తొలుత బ్యాటింగ్‌ చేస్తే మాత్రం టీమ్‌ఇండియా భారీ పరుగులు చేయక తప్పదు.

పంత్‌పై ఒత్తిడి

తొలి రెండు మ్యాచులు ఓడిన టీమ్‌ఇండియా విశాఖలో తిరిగి పుంజుకుంది. 48 పరుగుల తేడాతో గెలుపు తలుపు తట్టింది. రాజ్‌కోట్‌లోనూ ఇదే ప్రదర్శన పునరావృతం చేస్తే తిరుగుండదు. ఓపెనర్లు రుతురాజ్‌, ఇషాన్‌ ఫామ్‌లో ఉండటం శుభసూచకం. స్పిన్‌లో దూకుడుగా ఆడుతున్న శ్రేయస్‌ పేస్‌ బౌలింగ్‌లో ఇబ్బంది పడుతున్నాడు. దీన్నుంచి బయటపడాలి. ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచాలి. హార్దిక్‌ పాండ్య పరిణతితో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ఆఫ్‌ స్టంప్‌ ఆవల వేసిన బంతులను రిషభ్ పంత్‌ ఆడలేకపోతున్నాడు. ఈ టోర్నీలో రన్సేమీ చేయలేదు. ఫినిషర్‌గా డీకేకు ఎక్కువ అవకాశాలేమీ రాలేదు. యూజీ, అక్షర్‌ పుంజుకోవడం గుడ్‌న్యూస్‌. భువీ తన స్వింగ్‌తో మాయ చేస్తున్నాడు. హర్షల్‌, అవేశ్‌ ఫామ్‌ అందుకోవడంతో ఉమ్రాన్‌, అర్షదీప్‌కు ఎదురు చూపులు తప్పవు.

ఆదమరిస్తే సిరీస్‌ గాయబ్‌!

పర్యాటక దక్షిణాఫ్రికాకు ఒత్తిడేమీ లేదు. ఆ జట్టు ఓపెనర్లలో ఎవరో ఒకరు క్లిక్‌ అవుతున్నారు. మిడిలార్డర్‌ బలంగా ఉండటం ప్లస్‌ పాయింట్‌. వాండర్‌ డుసెన్‌, డేవిడ్‌ మిల్లర్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌ దూకుడుగా ఆడుతున్నారు. క్వింటన్‌ డికాక్‌ వస్తే వారి బ్యాటింగ్‌ మరింత బలపడుతుంది. డ్వేన్‌ ప్రిటోరియస్‌ అటు బ్యాటింగ్‌, బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. భారత పిచ్‌లపై అనుభవం ఉన్న కాగిసో రబాడా పరుగుల్ని నియంత్రిస్తున్నాడు. వేన్‌ పర్నెల్‌ వికెట్లు తీస్తున్నాడు. ఆన్రిచ్‌ నోకియా గాయం తర్వాత లయ అందుకోలేదు. టీమ్‌ఇండియా జాగ్రత్తగా బౌలింగ్‌ చేయకపోతే సఫారీలు అడ్డుకోవడం కష్టం.

IND vs SA T20 Probable XI

భారత్‌: ఇషాన్‌ కిషన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్ పంత్‌, హార్దిక్‌ పాండ్య, దినేశ్‌ కార్తీక్‌, అక్షర్ పటేల్‌, హర్షల్‌ పటేల్‌, అవేశ్‌ ఖాన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, యుజ్వేంద్ర చాహల్‌

దక్షిణాఫ్రికా: రెజా హెండ్రిక్స్‌ తెంబా బవుమా, వాండర్‌ డుసెన్‌, డేవిడ్‌ మిల్లర్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, డ్వేన్‌ ప్రిటోరియస్‌, వేన్‌ పర్నెల్‌, రబాడా, కేశవ్‌ మహరాజ్‌, ఆన్రిచ్‌ నోకియా, తబ్రైజ్‌ శంషి

Continues below advertisement
Sponsored Links by Taboola