IND Vs NZ 2nd Test 3rd Day Highlights: న్యూజిలాండ్‌తో భారత్ ఆడుతున్న రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. మూడో రోజు ఆట ప్రారంభం అయ్యాక న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌట్ అయింది. 359 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా వేగంగా బ్యాటింగ్ చేసింది. లంచ్ సమయానికి 12 ఓవర్లలో వికెట్ నష్టానికి 81 పరుగులు చేసింది. దాదాపు ఏడు రన్ రేట్‌తో భారత్ పరుగులు చేస్తూ ఉండటం విశేషం. యశస్వి జైస్వాల్ (46 బ్యాటింగ్: 36 బంతుల్లో, మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (22 బ్యాటింగ్: 20 బంతుల్లో, నాలుగు ఫోర్లు) క్రీజులో ఉన్నారు.


24 పరుగుల తేడాలో ఐదు వికెట్లు...
198/5 ఓవర్‌నైట్ స్కోరుతో ఈరోజు ఆట ప్రారంభించిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్ కాసేపు బాగానే సాగింది. టామ్ బ్లండెల్, గ్లెన్ ఫిలిప్స్ 49 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టడానికి ప్రయత్నించారు. కానీ టామ్ బ్లండెల్‌ను రవీంద్ర జడేజా క్లీన్ బౌల్డ్ చేశాక న్యూజిలాండ్ ఇన్నింగ్స్ కుప్పకూలింది. 231/5 నుంచి 255కు న్యూజిలాండ్ ఆలౌట్ అయింది. అంటే దాదాపు 24 పరుగుల వ్యవధిలోనే న్యూజిలాండ్ ఐదు వికెట్లు కోల్పోయిందన్న మాట. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లు పడగొట్టగా, రవిచంద్రన్ అశ్విన్ మూడు, రవీంద్ర జడేజా రెండు వికెట్లు పడగొట్టారు. మొదటి ఇన్నింగ్స్‌లో 103 పరుగుల ఆధిక్యం కలుపుకుని భారత్ ముందు 359 పరుగుల లక్ష్యం నిలిచింది.


ఇవాళే లేపేద్దాం...
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా బ్యాటర్ల మైండ్ సెట్ చూస్తే ఈరోజు టార్గెట్ ఫినిష్ చేసేలా కనిపిస్తున్నారు. మొదటి సెషన్‌లో దొరికిన 12 ఓవర్లలో వికెట్ నష్టానికి 81 పరుగులు చేశారు. దాదాపు ఏడు రన్‌రేట్‌తో టీమిండియా పరుగులు చేయడం విశేషం. ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ (8: 16 బంతుల్లో, ఒక ఫోర్) రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఫెయిలయ్యాడు. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ 110కి పైగా స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేయడం విశేషం.



భారత్ తుది జట్టు
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాష్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా


న్యూజిలాండ్ తుది జట్టు
టామ్ లాథమ్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, అజాజ్ పటేల్, విలియం ఓరౌర్కీ