లీడ్స్ వేదికగా ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరుగుతోన్న మూడో టెస్టులో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే కుప్పకూలింది. తొలి సెషన్‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసిన టీమ్‌ఇండియా..రెండో సెషన్‌లో 22 పరుగులు చేసి కూప్పకూలింది. రోహిత్ శర్మ(19) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత రహానె (18) ఉన్నాడు. కేఎల్ రాహుల్(0), పుజారా (1), కోహ్లీ(7), పంత్(2), జడేజా(4) సింగిల్ డిజిట్ పరుగులే చేసి తీవ్ర నిరాశ పరిచారు. ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్ 3, ఓవర్టన్ 3, రాబిన్సన్ 2, సామ్ కరన్ 2 వికెట్లు పడగొట్టారు.
అండర్సన్ అదరహో
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ జట్టు అండర్సన్ తన బౌలింగ్తో బెంబేలెత్తించాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను పెవిలియన్ పంపించిన అండర్సన్ ఆ తర్వాత అదే జోరుతో టాప్ ఆర్డర్‌ను కుప్ప కూల్చాడు.