IND vs AUS 1st Test: భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. తేదీ దగ్గర పడుతున్న కొద్దీ, రెండు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ గురించి రకరకాల ప్రకటనలు వస్తున్నాయి. దీనిపై పలువురు మాజీ క్రికెటర్లు కూడా తమ అభిప్రాయాలు, సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా ఓపెనింగ్ జోడీకి హర్భజన్ సింగ్ కీలకమైన సూచన చేశాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు ఓపెనర్‌గా ఉండాలని హర్భజన్ సింగ్ అభిప్రాయ పడ్డాడు.
హర్భజన్ సింగ్ యూట్యూబ్‌లో తన ఆలోచనలను పంచుకున్నారు. 'ఓపెనింగ్ భాగస్వామ్యం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఏ సిరీస్‌లో అయినా ప్రారంభ జంట మాత్రమే జట్టు టోన్‌ను సెట్ చేస్తుంది. నా అభిప్రాయం ప్రకారం ఆస్ట్రేలియాతో జరిగే భారత జట్టులో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఓపెనర్లుగా ఉండాలి. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కేఎల్ రాహుల్ కూడా టాప్ ప్లేయర్ అయినప్పటికీ అతని ఇటీవలి రికార్డు ప్రస్తుతం అంత బాగా లేదు. అదే సమయంలో శుభ్‌మన్ గిల్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. గత నెలలో కూడా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు.’ అన్నాడు.
భారత్ తరఫున అతను చాలా పరుగులు చేయగలడు
రోహిత్‌తో కలిసి శుభ్‌మన్ గిల్ ఒక మ్యాచ్‌కే పరిమితం కాకుండా మొత్తం సిరీస్‌లో ఓపెనింగ్ చేయాలని హర్భజన్ అన్నాడు. హర్భజన్ మాట్లాడుతూ, 'ఇన్ని పరుగులు చేసిన తర్వాత, అతను (శుభ్‌మన్ గిల్) భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటుకి అర్హుడని నేను భావిస్తున్నాను. ఒక్క టెస్టుకే కాదు మొత్తం సిరీస్‌లో టీమ్ ఇండియా అతడిని అట్టిపెట్టుకోవాల్సి ఉంది. అతని టచ్, కాన్ఫిడెన్స్ చూస్తుంటే టీమిండియా కోసం చాలా పరుగులు చేయగలడు.’ అని అభిప్రాయపడ్డాడు.
శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఫాంలో ఉన్నాడు
ప్రస్తుతం యువ భారత బ్యాటర్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అయితే కేఎల్ రాహుల్ తన రిథమ్‌లోకి తిరిగి రావడానికి ఇంకా ప్రయత్నిస్తునే ఉన్నాడు. ప్రస్తుతం శుభమన్ గిల్ బ్యాటింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. వన్డే క్రికెట్‌లో అతని బ్యాటింగ్ యావరేజ్ షాకింగ్‌గా ఉంది. అలాగే టీ20 క్రికెట్‌లో కూడా ఈ బ్యాట్స్‌మన్ ఇటీవల సెంచరీ సాధించాడు. గతేడాది ఆడిన టెస్టు మ్యాచ్‌ల్లో కూడా కేఎల్ రాహుల్ కంటే మెరుగ్గా రాణించాడు. అటువంటి పరిస్థితిలో అతను ఓపెనింగ్ పెయిర్ విషయంలో కేఎల్ రాహుల్‌ను దాటేసే పరిస్థితి కనిపిస్తుంది.
శుభ్‌మన్ గిల్ గత 12 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌ల (T20, ODI, టెస్ట్) గురించి చెప్పాలంటే, ఇక్కడ 76.90 బ్యాటింగ్ సగటుతో 769 పరుగులు చేశాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ, నాలుగు సెంచరీలు ఉన్నాయి. మరోవైపు కేఎల్ రాహుల్ ఈ విషయంలో కాస్త వెనుకబడినట్లు కనిపిస్తున్నాడు. అతను గత 12 ఇన్నింగ్స్‌లలో కేవలం 28.90 సగటుతో 318 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో ఒక్క సెంచరీ కూడా లేదు.