IND VS AUS Test Series: భారతదేశం, ఆస్ట్రేలియా మధ్య ఆడుతున్న టెస్ట్ సిరీస్ యొక్క మూడో మ్యాచ్ మార్చి 1వ తేదీ నుంచి ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో ప్రారంభం అయింది. ఈ మ్యాచ్‌లో, టీమ్ ఇండియా తన మొదటి ఇన్నింగ్స్‌లో చాలా బలహీనంగా కనిపించింది.


టాస్ గెలిచిన తరువాత భారత జట్టు మొదట బ్యాటింగ్ చేయడానికి వచ్చింది. కానీ 109 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ అందరి కంటే అత్యధికంగా 22 పరుగులు చేశాడు. టాడ్ మర్ఫీ ఈ సిరీస్‌లో మరోసారి కోహ్లీని తన బౌలింగ్‌లో పడగొట్టాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు కోహ్లీని టాడ్ మర్ఫీ మొత్తంగా మూడు సార్లు అవుట్ చేశాడు.


టాడ్ మర్ఫీ ఈ సిరీస్‌లోనే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు, నాగ్‌పూర్‌లో ఆడిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో టాడ్ మర్పీ తన అరంగేట్ర మ్యాచ్‌లోనే కింగ్ కోహ్లీ వికెట్ తీసుకున్నాడు. మర్ఫీ ఇప్పటివరకు కింగ్ కోహ్లీని మూడు మ్యాచ్‌లలో మూడు సార్లు అవుట్ చేశాడు. ఒకసారి మాథ్యూ కుహ్నేమాన్ కోహ్లీకి పెవిలియన్‌ దారి చూపించాడు. ఇండోర్‌లో ఆడిన మూడో టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో, విరాట్ కోహ్లీని మర్ఫీ ఎల్‌బీడబ్ల్యూ ద్వారా అవుట్ చేశాడు.


కోహ్లీకి సమస్యగా మారుతున్న మర్ఫీ 
టాడ్ మర్ఫీ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీకి సమస్యగా కనిపిస్తున్నారు. విరాట్ కోహ్లీ చాలా కాలంగా టెస్టుల్లో కష్టపడుతున్నాడు. మర్ఫీ ఈ సిరీస్‌లో ఎంతో పోరాడుతున్నాడు. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు ఈ సిరీస్‌లో జరిగిన మూడు మ్యాచ్‌లలో నాలుగు ఇన్నింగ్స్‌లలో 98 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో అతని అత్యధిక స్కోరు 44 పరుగులు మాత్రమే.


ఇండోర్‌లో ఆడిన మూడో టెస్ట్ మ్యాచ్ మొదటి రోజున, పిచ్‌లో చాలా టర్న్ ఉంది. పిచ్ మీద ఉన్న ఈ టర్న్ ఆతిథ్య జట్టు భారతదేశాన్నే దెబ్బ కొట్టింది. మొదటి ఇన్నింగ్స్‌లో, భారత జట్టు 109 పరుగులకు ఆలౌట్ అయింది. దీనికి ప్రతిస్పందనగా మొదటి రోజు చివరి నాటికి ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల నష్టానికి 156 పరుగులు సాధించింది. ఇప్పటికే 47 పరుగుల ఆధిక్యంలో ఉంది.


ఇండోర్‌ టెస్టులో మనోళ్లు వెనుకంజ వేశారు. తొలిరోజు ప్రత్యర్థికి లొంగిపోయారు. బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమయ్యారు. ఒక్కరంటే ఒక్కరూ 25 పరుగులు చేయలేదు. మరోవైపు ఆస్ట్రేలియా పట్టు బిగించింది. మొదటి రోజు ఆట ముగిసే సరికి 47 పరుగుల ఆధిక్యం సాధించింది. 54 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 156 స్కోర్‌ చేసింది. కామెరాన్‌ గ్రీన్‌ (6 బ్యాటింగ్‌), పీటర్ హ్యాండ్స్‌కాంబ్‌ (7 బ్యాటింగ్‌) అజేయంగా నిలిచారు. ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా (60; 147 బంతుల్లో 4x4) అద్భుత అర్ధశతకం ఆదుకున్నాడు. అంతకు ముందు హిట్‌మ్యాన్‌ సేన 33.2 ఓవర్లకు 109కి ఆలౌటైంది.


టీమ్‌ఇండియాకు ఆస్ట్రేలియాకు తేడా ఉస్మాన్‌ ఖవాజా! స్పిన్‌ ఆడటంలో తిరుగులేదనుకున్న భారత ఆటగాళ్లు అదే స్పిన్‌ దెబ్బకు కుదేలయ్యారు. ఆతిథ్య జట్టులోనూ భయం ఉన్నా ఖవాజా ఆదుకున్నాడు. తిరుగులేని హాఫ్‌ సెంచరీ బాదేశాడు. మొదట్లోనే జడేజా బౌలింగ్‌ ఔటై నోబాల్‌తో బతికిపోయిన అతడు ఆ తర్వాత చెలరేగాడు. ఆసీస్‌కు అవసరమైన స్కోరు అందించాడు. జట్టు స్కోరు 12 వద్దే ట్రావిస్‌ హెడ్‌ (9) ఔటైనా మార్నస్‌ లబుషేన్‌ (31; 91 బంతుల్లో 4x4)తో కలిసి ఇన్నింగ్స్‌ నడిపించాడు. 108 వద్ద లబుషేన్‌ను జడ్డూ ఔట్‌ చేశాడు. మరికాసేపటికే ఖవాజానూ అతడే పెవిలియన్‌ పంపించాడు. ఈ క్రమంలో పీటర్‌ హ్యాండ్స్‌కాంబ్‌ అండతో స్టీవ్‌స్మిత్‌ (26; 38 బంతుల్లో 4x4) సమయోచిత స్కోరు చేశాడు. జట్టు స్కోరు 146 వద్ద అతడిని జడ్డూ ఔట్‌ చేసి నాలుగో వికెట్‌ అందుకున్నాడు.