Marnus Labuschagne: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ అడ్వెంచర్ గురువారం (ఫిబ్రవరి 9వ తేదీ) నుంచి ప్రారంభం కానుంది. ఎప్పటిలాగే భారతదేశం, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య జరిగే ఈ టెస్ట్ సిరీస్‌కు ఈసారి కూడా చాలా హైప్ వచ్చింది.


సోషల్ మీడియా నుంచి న్యూస్ ఛానెల్‌లు, ఇతర మీడియా ప్లాట్‌ఫారమ్‌ల వరకు గత నెల రోజులుగా ఈ సిరీస్ గురించే చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఈ సిరీస్ ప్రారంభానికి ముందు ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ ఒక ప్రత్యేక ట్వీట్ చేసింది. దీనికి ప్రతిస్పందనగా ఆస్ట్రేలియా ఓపెనర్ కూడా అద్భుతమైన సమాధానం ఇచ్చాడు.


ఇటీవల ఆస్ట్రేలియన్ ఓపెనర్ మార్నస్ లబుషాగ్నే మాట్లాడుతూ రాబోయే భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ చాలా లవ్లీ చెస్ సిరీస్ అని చెప్పాడు. లబుషగ్నే మాటలను ఉటంకిస్తూ రాజస్థాన్‌ రాయల్స్‌ ఓ ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్‌లో, భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, మార్నస్ లబుషగ్నేల ఫొటో, ఒక చదరంగం మైదానం కూడా కనిపించింది.


గత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మార్నస్ లబుషగ్నేను రవిచంద్రన్ అశ్విన్ రెండుసార్లు పెవిలియన్‌కు పంపాడు. అందుకే రవిచంద్రన్ అశ్విన్‌తో మార్నస్ లబుషగ్నే ఉన్న ఫొటోను షేర్ చేశాడు. ఈ ట్వీట్ చూసిన లబుషగ్నే వెంటనే రిప్లై ఇచ్చాడు. ‘Can't Wait' అని అందులో పేర్కొన్నాడు.


ఆస్ట్రేలియా బ్యాటింగ్ vs భారత స్పిన్నర్లు
నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫిబ్రవరి 9వ తేదీ నుంచి నాగ్‌పూర్‌లో తొలి మ్యాచ్ జరగనుంది. గత 18 ఏళ్లుగా భారత్‌లో సిరీస్‌ గెలవలేకపోయిన ఆస్ట్రేలియా జట్టు ఈసారి గట్టిగానే సన్నద్ధమైంది. ఇక్కడ భారత జట్టు కూడా ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఆస్ట్రేలియన్ ఛాలెంజ్‌కు సిద్ధమవుతుంది. ఈసారి సిరీస్‌లో భారత స్పిన్నర్లకు, ఆస్ట్రేలియా పటిష్ట బ్యాటింగ్ లైనప్‌కు మధ్య హోరాహోరీ పోరు తప్పదని భావిస్తున్నారు.


2023 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 13వ తేదీ మధ్య నాగ్‌పూర్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. దీని తర్వాత ఫిబ్రవరి 17వ తేదీ నుంచి ఫిబ్రవరి 21వ తేదీ మధ్య ఢిల్లీలో రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇక మూడో టెస్టు మార్చి ఒకటో తేదీ నుంచి మార్చి 5వ తేదీ దాకా ధర్మశాలలో జరగనుంది. మార్చి 9వ తేదీ నుంచి 13వ తేదీ దాకా అహ్మదాబాద్‌ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది.


ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి రెండు టెస్టులకు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, సూర్యకుమార్ యాదవ్.


భారత పర్యటనకు ఆస్ట్రేలియా టెస్టు జట్టు
పాట్ కమిన్స్ (కెప్టెన్), ఆష్టన్ అగర్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, పీటర్ హ్యాండ్‌స్కాంబ్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషగ్నే, నాథన్ లియోన్, లాన్స్ మోరిస్, టాడ్ మర్ఫీ, మాథ్యూ రెన్‌షా, స్టీవ్ స్మిత్ , మిచెల్ స్టార్క్, మిచెల్ స్వెప్సన్, డేవిడ్ వార్నర్.