IND vs AUS 2nd Test, Virat Kohli's Out: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ వికెట్ పడ్డ విధానం గురించి చర్చలు జరుగుతున్నాయి. ఆస్ట్రేలియన్ స్పిన్నర్ మాథ్యూ కునెమన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ తన వికెట్ కోల్పోయాడు. ఎల్బీడబ్ల్యూ అయిన తర్వాత విరాట్ కోహ్లి రివ్యూ తీసుకున్నాడు. అయితే బంతి విరాట్ కోహ్లీ బ్యాట్, ప్యాడ్ రెండింటినీ ఒకేసారి తాకినట్లు అల్ట్రా ఎడ్జ్‌లో కనిపించింది. దీని తర్వాత కూడా విరాట్‌ను అవుట్ అని థర్డ్ అంపైర్ ప్రకటించారు. అవుటైన తర్వాత కోహ్లీ చాలా అసంతృప్తిగా ఉన్నాడు.
ఇంతకు ముందు కూడా ఇలాగే
కోహ్లీ ఇలా ఎల్‌బీడబ్ల్యూ అవడం ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు కూడా అతనికి రెండు సార్లు ఇలాగే జరిగింది. వీటిలో మొదటి సంఘటన 2021లో జరిగింది. న్యూజిలాండ్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు కూడా విరాట్ కోహ్లి ఇలాగే ఎల్‌బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అప్పుడు కూడా విరాట్ కోహ్లీ అవుట్ అయినట్లు అంపైర్ ప్రకటించాడు.
దీని తరువాత 2022లో ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌తో ఆడుతున్నప్పుడు, విరాట్ కోహ్లిని ఇదే పద్ధతిలో అవుట్ చేశారు. అప్పుడు కూడా బంతి అతని బ్యాట్, ప్యాడ్‌కు తగిలింది. విరాట్ కోహ్లిని మూడు సార్లూ అంపైర్ అవుట్ అయినట్లు ప్రకటించాడు.
ఈ టెస్టు మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ నాలుగు ఫోర్ల సాయంతో 44 పరుగులు చేశాడు. టెస్టు మ్యాచ్‌ల చివరి 10 ఇన్నింగ్స్‌ల తర్వాత విరాట్ 30 పరుగుల మార్కును దాటాడు. అంతకుముందు 2022 మార్చిలో శ్రీలంకతో ఆడిన టెస్టులో 45 పరుగులు చేశాడు.
టెస్టు క్రికెట్‌లో విరాట్ కోహ్లీ చాలా కాలంగా పేలవ ఫామ్‌లో కనిపిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్ దిశగా సాగుతుండగా అలాంటి పరిస్థితుల్లో వికెట్‌ను కోల్పోవాల్సి వచ్చింది. అంతకుముందు నాగ్‌పూర్ టెస్టులో కూడా విరాట్ కోహ్లీ 12 పరుగులు మాత్రమే చేశాడు.