Shane Warne, Rock star Ravindra Jadeja: విధి ఆడే నాటకాలు వింతగానే ఉంటాయి! అరగంట ముందే మరో క్రికెటర్‌ మరణం గురించి Shane Warne సంతాపం ప్రకటించడమేంటి? అంతలోనే ఆయనే మరణించడమేంటి? ఆ మరుసటి రోజే ఆయన 'రాక్‌ స్టార్‌'గా వర్ణించిన కుర్రాడు శ్రీలంకపై సెంచరీ కొట్టడమేంటి? తలచుకుంటే అంతా విచిత్రంగా అనిపిస్తోంది!


టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అంటే షేన్‌వార్న్‌ (Shane Warne)కు ఎంతో ఇష్టం! 2008లో రాజస్థాన్‌ రాయల్స్‌కు షేన్‌వార్న్‌ Shane Warne సారథ్యం వహించాడు. అరంగేట్రం ఐపీఎల్‌ను అందించాడు. అదే జట్టుకు రవీంద్ర జడేజా ఆడాడు. విరాట్‌ కోహ్లీ సారథ్యంలో అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో అతడూ సభ్యుడే. అప్పుడే లీగ్‌ క్రికెట్లోకి ఎంటర్‌ అయ్యాడు. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. తన బౌలింగ్‌, బ్యాటింగ్‌ను ఇంఫ్రూవ్‌ చేసుకొనేందుకు కష్టపడేవాడు.


రవీంద్ర జడేజాను చూసిన షేన్‌వార్న్‌  'ఈ కుర్రాడు ఇండియన్‌ క్రికెట్లో రాక్‌స్టార్‌' అవుతాడని ప్రశంసించాడు. క్రికెట్‌ కామెంటేటర్‌ హర్షబోగ్లేతో చాలాసార్లు ఈ విషయం చెప్పాడు. మీడియా సమక్షంలోనూ అనేవాడు. తానేమీ పాడటం లేదు, డ్యాన్సులు చేయడం, కనీసం స్టైలిష్‌గానూ లేను. కానీ షేన్‌వార్న్‌ ఎందుకలా అనేవాడో అర్థమయ్యేది కాదని జడ్డూ చెప్పేవాడు. అతడిలోని కష్టపడే తత్వం చూసి ఆ లెజెండ్‌ అలా అనేవాడని తర్వాత తెలిసింది.


Shane Warne షేన్‌వార్న్‌ అన్నట్టుగానే రవీంద్ర జడేజా ఇప్పుడో రాక్‌స్టార్‌గా మారిపోయాడు. మణికట్టు స్పిన్నర్ల రాకతో జట్టులో చోటు దొరక్క ఇబ్బంది పడ్డ అతడే ఇప్పుడు టీమ్‌ఇండియాకు ఇంపార్టెంట్‌ అయిపోయాడు. తన బౌలింగ్‌, బ్యాటింగ్‌ను మరింత ఇంఫ్రూవ్‌ చేసుకున్నాడు. టీ20, వన్డేల్లో దూకుడుగా, టెస్టుల్లో నిలకడగా పరుగులు చేస్తున్నాడు. తాజాగా మొహాలి వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన సెంచరీ చేశాడు.


శ్రీలంక బౌలర్లపై పూర్తిగా అథారిటీ చూపించిన రవీంద్ర జడేజా 166 బంతుల్లో 10 బౌండరీలతో 102 పరుగులు చేసింది. అతడి ఇన్నింగ్స్‌లో బ్యూటిఫుల్‌ కవర్‌డ్రైవ్‌లు ఎన్నో ఉన్నాయి. అతడి సహచరుడు రవిచంద్రన్‌ అశ్విన్‌ (61) హాఫ్‌ సెంచరీ చేశాడు. రెండో రోజు లంచ్‌ టైమ్‌కు టీమ్‌ఇండియా 112 ఓవర్లకు 468/7తో నిలిచింది. జడ్డూ, జయంత్‌ యాదవ్‌ (2) బ్యాటింగ్‌ కొనసాగిస్తున్నారు.