IND vs WI, ICC Womens World cup: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో మిథాలీ సేన రెండో విజయం అందుకుంది. బలమైన ప్రత్యర్థి వెస్టిండీస్‌పై సూపర్బ్ విక్టరీతో ఆకట్టుకుంది. కరీబియన్ జట్టును ఏకంగా 155 పరుగుల తేడాతో చిత్తు చేసింది. భారత అమ్మాయిల బౌలింగ్‌కు ప్రత్యర్థి బ్యాటర్లు వణికిపోయారు. 318 పరుగుల లక్ష్యఛేదనలో 40.3 ఓవర్లకే 162కి పరిమితం అయ్యారు. అంతకుముందు టీమ్‌ఇండియాలో స్మృతి మంధాన (123; 119 బంతుల్లో 13x4, 2x6), హర్మన్‌ప్రీత్ కౌర్ (109; 107 బంతుల్లో 10x4, 2x6) సెంచరీల మోత మోగించారు.
12 ఓవర్ల వరకు వికెట్టే లేదు
ప్రత్యర్థి ముంగిట భారీ టార్గెట్ పెట్టినా కాసేపటి వరకు టీమ్‌ఇండియా క్యాంపులో భయమే నెలకొంది! వెస్టిండీస్ ఓపెనర్లు డియాండ్రా డాటిన్ (62; 46 బంతుల్లో 10x4, 1x6), హేలీ మాథ్యూస్ (43; 36 బంతుల్లో 6x4) డిస్ట్రిక్టివ్ బ్యాటింగే ఇందుకు కారణం. ఎందుకంటే వారిద్దరూ 12 ఓవర్ల వరకు వికెట్టే ఇవ్వలేదు. ఏ బౌలర్ వచ్చినా బౌండరీలు దంచుతూనే ఉన్నారు. దాంతో 5 ఓవర్లకే స్కోరు 50 దాటింది. డాటిన్ 35 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టేసింది. 72 బంతుల్లోనే వీరిద్దరూ 100 పరుగుల పార్ట్‌నర్ షిప్ అందించారు.
నిజానికి డాటిన్, మాథ్యూస్ ఉంటే 40 ఓవర్లకే గెలిచేస్తారనిపించింది. కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న భారతీయులకు 12.2వ బంతికి స్నేహ్‌రానా వికెట్ అందించింది. డానిట్‌ను పెవిలియన్ పంపించింది. అక్కడ్నుంచి 14 పరుగుల వ్యవధిలోనే కైసియా నైట్ (5), స్టెఫానీ టేలర్ , హేలీ మాథ్యూస్‌ను ఔట్ చేయడంతో బ్రేక్ లభించింది. ఆ తర్వాత టీమ్‌ఇండియా విజయం వరకు ఆగనే లేదు. స్నేహ్‌రానా 3, మేఘనా సింగ్ 2 వికెట్లు తీశారు. పూజ, రాజేశ్వరీ, జులన్‌కు తలో వికెట్ దక్కింది.
టీమిండియాకు ఓపెనర్ల శుభారంభం..
వెస్టిండీస్‌తో జరుగుతున్న ఈ వరల్డ్ కప్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ మిథాలీ రాజ్ ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంది. సెడాన్ పార్కు వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత జట్టుకు ఓపెనర్లు స్మృతి మంధాన, యస్తికా భాటియా(31 పరుగులు) శుభారంభం అందించారు. 6.3 ఓవర్లలో 49 పరుగులు జోడించాక శస్తికాను సెల్మాన్ ఔట్ చేసింది. కెప్టెన్ మిథాలీ రాజ్ కేవలం 5 పరుగులకే పెవిలియన్ చేరింది. దీప్తి శర్మ(15)తో కలిసి మందాన ఇన్నింగ్స్‌ను నడిపించింది.
సెంచరీ సాధించి జోరు మీదున్న స్మృతి అద్భుత ఇన్నింగ్స్‌కు తెరపడింది. షమీలియా బౌలింగ్‌లో సెల్మాన్‌కు క్యాచ్ ఇచ్చి 123 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆమె నిష్క్రమించింది. రిచా ఘోష్ క్రీజులోకి వచ్చింది. 20 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు 100-3 తో మెరుగైన స్థితిలో ఉంది. ఆపై మందాన, హర్మన్ ప్రీత్ గేర్ మార్చారు. 25 ఓవర్లు ముగిసే సరికి స్మృతి మంధాన 44, హర్మన్‌ప్రీత్ కౌర్ 26 రన్స్‌తో ఉన్నారు. ఆపై మంధాన 67 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసుకోగా, వేగంగా ఆడేందుకు ప్రయత్నించిన మంధాన శతకం (119 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్స్) చేసిన తరువాత కాన్నెల్ బౌలింగ్‌లో సెల్మాన్ కు క్యాచిచ్చి ఔటైంది. అప్పటికి భారత్ 42.3 ఓవర్లోల 4 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది.