Womens World Cup 2022: ఐపీఎల్‌-2022 సీజన్‌కు ముందే భారత అభిమానులను మరో క్రికెట్‌ టోర్నీ అలరించనుంది. మార్చి 4 నుంచి న్యూజిలాండ్‌ వేదికగా ఐసీసీ మహిళల క్రికెట్‌ వన్డే ప్రపంచకప్‌ మొదలవుతోంది. మొత్తం ఎనిమిది జట్లు 29 రోజులు ట్రోఫీ కోసం పోటీ పడనున్నాయి.


With three days left for the tournament, here's all you need to know about the ICC Women's Cricket ODI World Cup 2022


ఇప్పటి వరకు భారత మహిళల క్రికెట్‌ జట్టు ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ను గెలవలేదు. కానీ రెండు సార్లు ట్రోఫీని ముద్దాడే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయింది. రన్నరప్‌గా నిలిచింది. చివరి ప్రపంచకప్‌ ఫైనల్లో టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌ చేతిలో స్వల్ప తేడాతో ఓటమిపాలై కన్నీరు కార్చింది. ఈ సారి ఎలాగైనా ట్రోఫీ అందుకోవాలని పట్టుదలతో ఉంది. మార్చి 6, ఆదివారం నుంచి మిథాలీ సేన తమ క్యాంపెయిన్‌ ఆరంభించనుంది. తొలి మ్యాచులోనే దాయాది పాకిస్థాన్‌తో తలపడుతోంది.


India Schedule - టీమ్‌ఇండియా షెడ్యూలు


భారత్‌ vs పాకిస్థాన్‌ (IND vs PAK) - మార్చి 6 2022 - 6:30 AM IST - బే ఓవల్‌, టౌరంగ (Tauranga)
న్యూజిలాండ్‌ vs భారత్‌ - మార్చి 10 2022 - 6:30 AM IST - సెడాన్‌ పార్క్‌ (Seddon Park), హామిల్టన్‌
భారత్‌ vs వెస్టిండీస్‌ - మార్చి 12 2022 - 6:30 AM IST - సెడాన్‌ పార్క్‌, హామిల్టన్‌
ఇంగ్లాండ్‌ vs భారత్‌ - మార్చి 16 2022 - 6:30 AM IST  - బే ఓవల్‌ (Bay Oval), టౌరంగ
ఆస్ట్రేలియా vs భారత్‌ - మార్చి 19 2022 - 6:30 AM IST 
బంగ్లాదేశ్‌ vs భారత్‌ - మార్చి 22 2022 - 6:30 AM IST 
భారత్‌ vs దక్షిణాఫ్రికా - మార్చి 27 2022 - 6:30 AM IST


Where to Watch Team India matches। ప్రత్యక్ష ప్రసారం


ఐసీసీ మహిళల క్రికెట్‌ ప్రపంచకప్‌ 2022 ప్రసార హక్కులను స్టార్‌ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ దక్కించుకుంది. భారత్‌, శ్రీలంక, మాల్దీవులు, నేపాల్‌, భూటాన్‌లో స్టార్‌ మాత్రమే క్రికెట్‌ ప్రపంచకప్‌ను ప్రసారం చేయనుంది. స్టార్‌స్పోర్ట్స్‌ 2/హెచ్‌డీ, స్టార్‌స్పోర్ట్స్‌ 3, స్టార్‌ స్పోర్ట్స్‌ 1 హిందీలో మ్యాచులు వస్తాయి. ICC Women's Cricket World Cup 2022 Live streaming లైవ్‌ స్ట్రీమింగ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో వస్తుంది. శ్రీలంక, నేపాల్‌, మాల్దీవులు, భూటాన్‌లో యుప్‌టీవీ ద్వారా స్ట్రీమింగ్‌ చూడొచ్చు.


India Squad - టీమ్‌ఇండియా జట్టు


మిథాలీ రాజ్‌ (Mithali Raj captain), హర్మన్‌ప్రీత్‌ కౌర్ (Harmanpreet Kaur), స్మృతి మంధాన (Smriti Mandhana), షెఫాలీ వర్మ, యస్తికా భాటియా, దీప్తి శర్మ, రిచా ఘోష్‌, స్నేహ్‌ రానా, జులన్‌ గోస్వామి, పూజా వస్త్రాకర్‌, మేఘనా సింగ్‌, రేణుకా సింగ్ ఠాకూర్‌, తానియా భాటియా, రాజేశ్వరీ గైక్వాడ్‌, పూనమ్‌ యాదవ్‌


World Cup Venues - ప్రపంచకప్‌ వేదికలు


క్రైస్ట్‌చర్చ్‌లోని హెగ్లే ఓవల్‌, ఆక్లాండ్‌లోని ఈడెన్‌ పార్క్‌, మౌంట్‌ మాంగనూయి్‌లోని ఏ ఓవల్‌, హామిల్టన్‌లోని సెడాన్‌ పార్క్‌, వెల్లింగ్టన్‌లోని బేసిన్‌ రిజర్వు, డ్యునెడిన్‌లోని యూనివర్సిటీ ఓవల్‌లో ప్రపంచకప్‌ మ్యాచులు జరుగుతాయి.


World Cup Format - ప్రపంచకప్‌ ఫార్మాట్‌


The ICC Women's World Cup 2022ను రౌండ్‌రాబిన్‌ ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు. ఒక జట్టు మిగతా అన్ని జట్లతో తలపడాల్సి ఉంటుంది. పాయింట్ల పట్టికలో టాప్‌-4 జట్టు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. ఆ రెండు సెమీసుల్లో గెలిచిన జట్లు క్రైస్ట్‌చర్చ్‌లోని హెగ్లే ఓవల్‌ వేదికగా ఏప్రిల్‌ 3న ఫైనల్‌ ఆడతాయి.