ICC Rankings, Jasprit Bumrah: టీమ్‌ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) అదరగొట్టాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో (ICC Rankings) టాప్‌-5లోకి ఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) ఐదో స్థానం నుంచి తొమ్మిదికి పడిపోయాడు. లంక ఆటగాడు దిముతు కరుణరత్నె మెరుగయ్యాడు.


శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీసులో (IND vs SL Test Series) జస్ప్రీత్‌ బుమ్రా దుమ్మురేపాడు. గులాబి టెస్టు (Pink ball test) తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు. మొత్తంగా ఈ టెస్టులో ఎనిమిది వికెట్లు తీసి అదరగొట్టాడు. దాంతో ఆరు స్థానాలు ఎగబాకిన బుమ్రా టాప్‌-4లో నిలిచాడు. షాహిన్‌ అఫ్రిది, కైల్‌ జేమీసన్‌, టిమ్‌ సౌథీ, జేమ్స్‌ అండర్సన్‌, నీల్‌ వాగ్నర్‌, జోష్‌  హేజిల్‌వుడ్‌ను దాటేశాడు.


బుమ్రా సహచరుడు మహ్మద్‌ షమి (Mohammad Shami) ఒక ర్యాంకు మెరుగై 17వ స్థానానికి చేరుకున్నాడు. అదే ర్యాంకులో ఉన్న రవీంద్ర జడేజాను (Ravindra Jadeja) 18కి నెట్టేశాడు. ఇక రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin) 850 రేటింగ్‌ పాయింట్లతో రెండో ర్యాంకులో కొనసాగుతున్నాడు. శ్రీలంక బ్యాటర్‌ దిముతు కరుణరత్నె కెరీర్‌ బెస్ట్‌ నంబర్‌ 5 ర్యాంకు అందుకున్నాడు. గులాబి టెస్టులో అతడు సెంచరీ చేయడం గమనార్హం. ఇక విరాట్‌ కోహ్లీ తొమ్మిదో ర్యాంకుకు పరిమితం అయ్యాడు. ఇక శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) ఏకంగా 40 స్థానాలు ఎగబాకి 37వ ర్యాంకు అందుకున్నాడు. రిషభ్ పంత్ (Rishabh Pant) పదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో వెస్టిండీస్‌ ఆటగాడు జేసన్‌ హోల్డర్‌ తిరిగి నంబర్‌ వన్‌ ర్యాంకు అందుకున్నాడు. రవీంద్ర జడేజాను రెండో స్థానానికి పంపించేశాడు.