ఆసియా ఒలింపిక్ క్వాలిఫ‌య‌ర్స్‌(Asian Olympic Qualifiers) లో భార‌త షూట‌ర్లు  అద‌ర‌గొట్టారు. తెలంగాణకు చెందిన స్టార్‌ షూటర్‌ ఈషా సింగ్ (Esha Singh)పారిస్ ఒలింపిక్స్(Paris Olympics) బెర్త్‌ను ఖరారు చేసుకుంది. జ‌కార్తా వేదిక‌గా జ‌రిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫ‌య‌ర్ టోర్నమెంట్‌లో మ‌హిళ‌ల 10 మీట‌ర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణప‌తకాన్ని గెల‌వ‌డం ద్వారా ఈషా ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. 10 మీట‌ర్ల ఎయిర్ పిస్టల్(Women’s 10-meter air pistol category) విభాగంలో ఈషా సింగ్ 243.1 స్కోరు చేసి స్వర్ణం కైవ‌సం చేసుకుంది. పాకిస్తాన్ కు చెందిన కిష్మలా త‌ల‌బ్ ర‌జ‌కాన్ని అందుకోగా, భార‌త్‌కు చెందిన రిథ‌మ్ సాంగ్వాన్క్యాంస ప‌త‌కాన్ని ముద్దాడింది. ఒలింపిక్ బెర్తును ఖాయం చేసుకున్న ఈషా సింగ్ పై ప్రశంస‌ల జ‌ల్లు కురుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వకుంట్ల క‌విత(Kavitha) సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈషాకు అభినంద‌న‌లు తెలిపారు. పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌ను సొంతం చేసుకున్న తెలంగాణ ముద్దు బిడ్డ ఈషాసింగ్ కు శుభాకాంక్షలంటూ ట్వీట్‌ చేశారు. ఒలింపిక్ వేదిక‌పై స‌త్తా చాటాల‌ని కోరుకుంటున్నట్లు క‌విత ట్వీట్ చేశారు. 

 

మరోవైపు  పురుషుల 10 మీట‌ర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగంలో వ‌రుణ్ తోమ‌ర్, అర్జున్ సింగ్ చీమా, ఉజ్వల్ మాలిక్బృందం ప‌సిడి ప‌త‌కం కొల్లగొట్టింది.ఇరాన్  రెండు, కొరియా మూడో స్థానంలో నిలిచారు. వ్యక్తిగ‌త విభాగంలో వ‌రుణ్, అర్జున్‌లు ఫైన‌ల్ చేరుకొని ప‌త‌కం ఖాయం చేశారు. ఈ ఏడాది ప్యారిస్ వేదిక‌గా ప్రతిష్ఠాత్మ‌క ఒలింపిక్స్ పోటీలు జ‌రుగ‌నున్నాయి. ఇప్పటివ‌ర‌కూ భార‌త షూట‌ర్లు ఈ విశ్వ క్రీడ‌ల్లో13 బెర్తులు ద‌క్కించుకున్నారు. ఆసియా షూట‌ర్లకు ఇంకా 16 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. 

 

ఆసియా గేమ్స్‌లోనూ సత్తాచాటిన ఈషా

చైనాలో జరిగిన ఆసియా గేమ్స్-2023 పోటీల్లో తెలంగాణ బిడ్డ ఈషా సింగ్ మెరిసింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ టీం ఈవెంట్‌లో బృందం స్వర్ణ పతకం సాధించింది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు హర్షం వ్యక్తం చేశారు. ఈషా సింగ్ బృందం 1,759 పాయింట్లతో భారత్‌కు గోల్డ్ మెడల్ సాధించి, టీమ్ స్పిరిట్‌ను చాటిందని కేసీఆర్‌ పొగడ్తున్నారు.

 

ఇప్పటికే ధీరజ్‌ అర్హత

ఆంధ్రప్రదేశ్‌ ఆర్చర్‌ బొమ్మదేవర ధీరజ్‌ ఆర్చరీలో భారత్‌కు తొలి ఒలింపిక్‌ బెర్త్‌ను ఖాయం చేశాడు. బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆసియా కాంటినెంటల్‌ క్వాలిఫికేషన్‌ టోర్నమెంట్‌లో ధీరజ్‌ డబుల్‌ ధమాకా సృష్టించాడు. రజత పతకం నెగ్గడంతో పాటు ఆర్చరీ రికర్వ్‌ కేటగిరీలో భారత్‌కు ఒలింపిక్‌ బెర్త్‌ అందించాడు. వచ్చే ఏడాది జరిగే పారిస్‌ ఒలింపిక్స్‌కు ఆర్చరీలో భారత్‌కు లభించిన తొలి స్థానం ఇదే కావడం విశేషం. ఆసియన్‌ కాంటినెంటల్‌ అర్హత టోర్నీ ఫైనల్లో ధీరజ్‌ 5-6 తేడాతో చైనీస్‌ తైపీ ఆర్చర్‌ జిహ్‌ సియాంగ్‌ లింగ్‌ చేతిలో ఓడి రజతంతో సంతృప్తి చెందాడు. అంతకుముందు ధీరజ్‌ క్వార్టర్‌ఫైనల్లో ఇరాన్‌కు చెందిన సదేగ్‌ అష్రఫ్‌ బావిలిపై 6-0తో, సెమీస్‌లో మరో ఇరానియన్‌ ఆర్చర్‌ మొహ్మదొసీన్‌ గోల్షానిపై 6-0తో గెలుపొందాడు. క్వార్టర్‌ ఫైనల్లో ధీరజ్‌ 6–0తో ఇరాన్‌కు చెందిన సాదిగ్‌ అష్రాఫి బవిలి, సెమీ ఫైనల్లో 6–0తో ఇరాన్‌కే చెందిన మొహమ్మద్‌ హొస్సేన్‌ గొల్షానిపై విజయం సాధించాడు. ఈ ఈవెంట్‌లో ఫైనల్‌ చేరిన ఇద్దరికి మాత్రమే ఒలింపిక్స్‌ కోటా బెర్తు లభిస్తుంది. మహిళల విభాగంలో అంకిత భకత్‌ క్వార్టర్‌ ఫైనల్లోనే ఓడిపోవడంతో బెర్తు దక్కలేదు.