German Open 2022: జర్మనీ ఓపెన్లో పీవీ సింధు శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్‌లో జరిగిన తొలిపోరులో విజయం సాధించింది. థాయ్‌లాండ్ అమ్మాయి బుసానన్ ఆగ్‌బమ్‌రుగ్ఫన్‌ను వరుస గేముల్లో ఓడించింది. 32 నిమిషాలు జరిగిన మ్యాచులో వరుసగా 21-8, 21-7తో చిత్తు చేసింది. రెండో రౌండ్‌కు అర్హత సాధించింది.
ఇక మెన్స్ సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ విజయం అందుకున్నాడు. ఫ్రాన్స్ షట్లర్ బ్రిస్ లెవర్డెజ్‌ను 21-10, 13-21, 21-7 తేడాతో చిత్తు చేశాడు. 48 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచులో శ్రీకాంత్ అద్భుతమైన షాట్లు ఆడాడు. ప్రత్యర్థిపై దూకుడు కనబరిచాడు.
సైనా నెహ్వాల్, హెచ్‌ఎస్ ప్రణయ్ మ్యాచులు ఇంకా మొదలవ్వలేదు. స్పెయిన్ అమ్మాయి క్లారా అజుర్మెండితో సైనా తలపడనుంది. హాంగ్‌కాంగ్ షట్లర్ ఆంగుస్ కా లాంగ్‌తో ప్రణయ్ పోటీపడనున్నాడు. కొన్నాళ్లుగా వీరిద్దరికీ సరైన విజయాలు దక్కని సంగతి తెలిసిందే.