టోక్యో ఒలింపిక్స్‌లో ఆదివారం ఊహించని ఘటన చోటుచేసుకుంది. హెవీవెయిట్ బాక్సింగ్ విభాగంలో ఫ్రాన్స్ బాక్సర్ మౌరాద్ అలీవ్ బాక్సింగ్ రింగ్‌పై నిరసన వ్యక్తం చేశాడు. ఈ రోజు ఉదయం బ్రిటిష్ బాక్సర్ ఫ్రేజర్ క్లర్క్‌తో క్వార్టర్ ఫైనల్స్‌లో తలపడిన సందర్భంగా మౌరాద్‌పై రిఫరీ అండీ ముస్టాచియో రెండో రౌండ్‌లో అనర్హత వేటు వేశాడు. పలుమార్లు ప్రత్యర్థిని ఉద్దేశపూర్వకంగా తలతో కొట్టి గాయపర్చాడని రిఫరీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో న్యాయనిర్ణేతలు ఈ మ్యాచ్‌లో ఫ్రేజర్ క్లర్క్‌ను విజేతగా ప్రకటించారు. ఈ ఘటనపై ఫ్రాన్స్ బాక్సర్ బాక్సింగ్ రింగ్ వద్ద కూర్చొని నిరసన తెలిపాడు. తర్వాత ఆ దేశ అధికారులొచ్చి అతడితో మాట్లాడి అక్కడి నుంచి తీసుకెళ్లారు. కానీ 15 నిమిషాల తర్వాత అతడు మళ్లీ తిరిగొచ్చి అక్కడే కూర్చొని తన అసహనం తెలియజేశాడు.
అంతకుముందు జరిగిన మ్యాచ్ తొలిరౌండ్‌లో క్లర్క్‌పై మౌరాదే ఆధిపత్యం చెలాయించాడు. ఐదుగురు న్యాయనిర్ణేతల స్కోర్లలో అతడికే ఎక్కువ పాయింట్లు వచ్చాయి. కానీ రెండో రౌండ్‌లో మరింత దూకుడుగా ఆడిన ఇద్దరూ హోరాహోరీగా పోటీపడ్డారు. ఈ క్రమంలోనే మౌరాద్ ప్రత్యర్థిపై పలుమార్లు తలతో దాడి చేశాడు. రిఫరీ అతడిని ఆపేందుకు ప్రయత్నించినప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాడు. దీంతో కాసేట్లో మ్యాచ్ ముగుస్తుందనుకునే సమయంలో మౌరాద్ అనర్హతకు గురయ్యాడు. ఈ విషయంపై మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన బ్రిటిష్ బాక్సర్.. ఆ సమయంలో తాను మౌరాద్‌ను స్థిమితంగా ఉండమని చెప్పినట్లు తెలిపాడు. అతడు తనపై దాడి చేశాడని, అది ఉద్దేశపూర్వకమో లేకా అలా జరిగిపోయిందో తనకు తెలియదన్నాడు. క్రీడల్లో ఇలాంటి ప్రవర్తన సరికాదని అభిప్రాయపడ్డాడు.
1988 సియోల్ ఒలింపిక్స్‌లోనూ ఇలాంటి ఆసక్తికరమైన నిరసన చోటుచేసుకుంది. అప్పుడు దక్షిణా కొరియా బాక్సర్ బైయున్ జంగ్ ఇల్‌పై రెండు పెనాల్టీ పాయింట్లు విధించడంతో అతడు నిరసన వ్యక్తం చేశాడు. అతడు సుమారు గంటపైనే రింగ్‌లో అలాగే ఉండిపోయి అభ్యంతరం తెలిపాడు. అది అప్పట్లో సంచలనం రేకెత్తించింది. అదే బాక్సింగ్ ఈవెంట్‌లో మరోసారి ఓ బాక్సర్ నిరసన తెలపడం గమనార్హం.
టోక్యో ఒలింపిక్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ నుంచి అనర్హుడుగా నిష్క్రమించిన తర్వాత ఫ్రెంచ్ సూపర్ హెవీవెయిట్ బాక్సర్ మొరాద్ అలీవ్ ప్రముఖంగా వార్తల్లో నిలిచాడు. ఒలింపిక్స్‌లో హెవీవెయిట్ బాక్సింగ్ విభాగంలో ఫ్రాన్స్ బాక్సర్ మొరాద్ అలీవ్ బ్రిటిష్ బాక్సర్ ఫ్రేజర్ క్లర్క్‌తో క్వార్టర్ ఫైనల్స్‌లో తలపడగా, రెండవ రౌండ్‌లో మొరాద్‌పై రిఫరీ అండీ ముస్టాచియో అనర్హత వేటు వేశాడు. పలుమార్లు ప్రత్యర్థిపై ఉద్దేశపూర్వకంగా తలతో దాడి చేయడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని రిఫరీ తెలిపారు.