డోపింగ్‌ టెస్ట్‌.. క్రీడలపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పదం తెలుసు. స్పోర్ట్స్‌లో ప్లేయర్లు డోపింగ్‌కు పాల్పడితే.. వాళ్లకు డోపింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారని మనకు తెలుసు. కానీ అసలు డోపింగ్‌ టెస్ట్ అంటే ఏమిటి..? ఎందుకు చేస్తారు.? డోపింగ్‌ టెస్ట్‌ చేస్తున్న సమయంలో నిజంగానే బట్టలు తీసేయాలా..?


సచిన్‌ టెండూల్కర్‌.. మహేంద్ర సింగ్‌ ధోనీ.. ఉస్సెన్‌ బోల్ట్‌ లాంటి ఎంత మంది గొప్ప గొప్ప క్రీడాకారులు చరిత్రలో నిలిచిపోయే ఎన్నో రికార్డులు నెలకొల్పి.. సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇలాంటి వారికి సక్సెస్‌ అనేది కేవలం ఒకే ఒక్క రాత్రిలోనే ఏదో అద్భుతం జరిగితే వచ్చింది కాదు. వారి వారి చిన్నతనం నుంచే వాళ్లు నమ్ముకున్న గేమ్‌పై ఫోకస్‌ పెడుతూ.. అహర్నిశలు కష్టపడ్డారు. కాబట్టే.. వాళ్లు సక్సెస్‌ చూడగలిగారు.. అలాగే చూస్తున్నారు. 


సాధారణంగా ఎవరూ.. షార్ట్‌ టర్మ్‌ సక్సెస్‌ కోరుకోరు. ఒకవేళ అలాంటి షార్ట్‌ టర్మ్‌ సక్సెస్‌ వచ్చినా.. తక్కువ రోజులే ఉంటుంది. కానీ ఇప్పుడున్న లేదా ఇప్పటికే రిటైర్‌ అయినా గొప్పగొప్ప క్రీడాకారుల సక్సెస్‌.. మాత్రం కచ్చితంగా లాంగ్‌ టర్మ్‌ సక్సెస్‌ అనే చెప్పాలి. అందుకే.. ఇప్పటికీ.. ఇక ఎప్పటికీ.. మనం అలాంటి సక్సెస్‌ఫుల్‌ ఆటగాళ్ల గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నాం. కానీ ఇలా కాకుండా.. తక్కువ టైమ్‌లోనే సక్సెస్‌ను చూడాలన్న ఆశతో వెత్తుకునే సెకండ్‌ ఆప్షన్‌ ఏదైన ఉందంటే అది డ్రగ్స్‌ అనే చెప్పాలి. 


ఏదో డ్రగ్స్‌ అనగానే సినిమాలో చూపించిన్నట్లు బ్యాడ్‌ అనుకోకండి. ఏదైన ఓ మెడిసిన్‌ మన శరీరంలోని ఓ భాగాన్ని ఎఫెక్ట్‌ చేస్తే అది మంచి అయినా చెడు అయినా దానిని డ్రగ్‌ అనే అంటారు. ఏదైన ఒక డ్రగ్‌ను మనం తీసుకుంటే అది మన శరీరంలో ఉన్న హార్మోన్స్‌ను మరింత బూస్ట్‌ చేస్తుంటాయి. అయితే ఒక్కో మనిషికి ఒక్కో స్టామినా ఉంటుంది. ఎంత ఎత్తుకు ఎగరగలడు. ఎంత దూరం పరిగెత్తగలడు. ఎంత దూరం దూకగలడో అంతే చేస్తాడు. కానీ.. డ్రగ్స్‌ కానీ స్టెరాయిడ్స్‌ కానీ తీసుకున్న వ్యక్తి మాత్రం.. తన బాడీలోని హార్మోన్స్‌ మరింత బలంగా ఏర్పడి.. గతంలో చేసినదానికంటే.. పది రెట్లు ఎక్కువగా చేస్తాడు. ఇప్పుడు ఇలాంటి డ్రగ్‌నే క్రీడాకారులు తీసుకుంటుంటారు. 


ఏ క్రీడాకారుడైన కాంపిటేషన్‌కు వెళ్లే వారం రోజుల ముందు.. స్టెరాయిడ్స్‌ తీసుకుంటాడు. దాని వల్ల ఆ క్రీడాకారుడి శరీరంలోని హిమోగ్లోబిన్‌ లెవల్స్‌ అనేవి విపరీతంగా పెరుగుతుంటాయి. ఇక ఆటోమెటిక్‌ ఆ వ్యక్తి పర్ఫామెన్స్‌ పెరుగుతుంది. దీంతో అతడి కాన్ఫిడెన్స్‌తోపాటు బాడీ పెయిన్స్‌ అనే రావు. అంతేకాదు గతంలో కంటే ఎక్కువగా హైపర్‌ యాక్టివ్‌ మారుతాడు. అయితే ఇలా డోపింగ్‌ పాల్పడి గేమ్‌లో పాల్గొనే వాళ్లకు చెక్‌ పెట్టేందుకు వరల్డ్‌ యాంటి డోపింగ్‌ ఏజెన్సీ పని చేస్తుంది. ఎవరైన డోపింగ్‌ పాల్పడ్డారు అని తెలిసిన మరుక్షణమే అతడికి డోపింగ్‌ నిర్వహిస్తుంది ఈ ఏజెన్సీ. 


డోపింగ్‌ టెస్ట్‌ ఎలా చేస్తారు.?
ఏ క్రీడాకారుడు అయితే డోపింగ్‌ తీసుకున్నాడన్న అనుమానం వస్తే.. ముందుగా సదరు ఆటగాడి 90ml మూత్రాన్ని సేకరిస్తారు అధికారులు. ఇలా సేకరించే సమయంలో మహిళలకు అయితే స్త్రీ అధికారి, అబ్బాయిలకు అయితే మగవాళ్లు అధికారిగా ఉంటూ వాళ్లతోపాటే టాయిలెట్‌ రూమ్‌లో నిలబడి మరీ మూత్రాన్ని సేకరిస్తారు. డోపిగా అనుమానిస్తున్న వ్యక్తి టీ షర్ట్‌ను పైకి లేపి, ఇన్నర్‌ను మొకాలి వరకు దించి, మూత్రంనాళం నుంచి నేరుగా సంబంధిత అధికారులు ఇచ్చిన డబ్బాలో పడాలని సూచిస్తారు. దాన్ని నేరుగా గమనిస్తారు అధికారులు. 


ఆ తర్వాత ఓ ప్రత్యేకమైన బార్‌ కోడ్‌తో ఉండే రెండు వేరువేరు డబ్బాలో క్రీడాకారుడి మూత్రాన్ని నింపి, సీల్‌ చేస్తారు. ఆ తర్వాత గత వారం రోజుల క్రితం క్రీడాకారుడు తీసుకున్న ట్యాబ్లెట్స్‌కు సంబంధించిన వివరాలు ఓ పేపర్‌పై రాసి అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. క్రీడాకారుడి మూత్రాన్ని డబ్ల్యూఐడీ ఏజెన్సీకి సంబంధించిన ల్యాబ్‌లో పరిక్షిస్తారు. ఈ ల్యాబ్‌లో మూత్రంలో ఉండే వ్యర్థాలను తొలగించగా ఉంటే ప్యూర్‌ మాత్రాన్ని లిక్విడ్‌ కొమట్రోగఫ్రీ మాస్‌ స్పెక్ట్రోమెట్రీ పరికరం సహాయంతో పరిక్షించి, అందులో ఏఏ మూలకాలు ఉన్నాయో తెలుసుకుంటారు. ఈ మూలకాల్లో ఏదైన స్టెరాయిడ్‌ డ్రగ్‌ ఉన్నట్లు తెలితే.. మాత్రం ఆ క్రీడాకారుడిని డోపీగా తేల్చి, అతడిపై యాక్షన్‌ తీసుకుంటారు వరల్డ్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ అధికారులు.