Croatia Vs Canada: ఫిఫా ప్రపంచకప్ ప్రారంభమైన దగ్గర్నుంచి సంచనాలను నమోదవుతూనే ఉన్నాయి. పసికూన జట్లు పటిష్ట జట్లను ఖంగుతినిపిస్తున్నాయి. చిన్న జట్లు పెద్ద జట్లను ఓడిస్తున్నాయి. అలాంటి ఓ సంచలనం తృటిలో తప్పింది. గ్రూప్- ఎఫ్ మ్యాచులో కెనడా జట్టు క్రొయేషియాపై గెలిచేలా కనిపించినా.. చివరికి క్రొయేషియానే విజయం సాధించింది.
గ్రూప్- ఎఫ్ లో నిన్న క్రొయేషియ్- కెనడా మధ్య మ్యాచ్ జరిగింది. మొదట కెనడా ఆధిక్యంలోకి వెళ్లటంతో మరో సంచలనం తప్పదేమో అనిపించింది. అయితే క్రొయేషియా ఆటగాళ్లు అద్భుతంగా పుంజుకుని ఘనవిజయం సాధించారు. ఆట రెండో నిమిషంలో కెనడా ఆటగాడు డేవిస్ హెడర్ గోల్ తో క్రొయేషియాకు షాక్ ఇచ్చాడు. దీంతో కెనడా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే తర్వాత క్రొయేషియా ఆటగాళ్లు ఎదురుదాడికి దిగారు. క్రమారిక్ 36వ నిమిషంలో గోల్ కొట్టటంతో స్కోర్లు సమం అయ్యాయ. మార్కో 44వ నిమిషంలో ఓ మెరుపు గోల్ తో క్రొయేషియాకు ఆధిక్యానిచ్చాడు. 70వ నిమిషంలో క్రమారిక్ రెండో గోల్ సాధించడం, లోవ్రో 94వ నిమిషంలో బంతిని నెట్‌లోకి పంపడంతో క్రొయేషియా 4-1తో ఘనవిజయాన్ని అందుకుంది.
ఈ విజయంతో క్రొయేషియా నాకౌట్ అవకాశాల్ని మరింత మెరుగుపరచుకుంది. ఆడిన 2 మ్యాచ్‌ల్లోనూ ఓడిన కెనడా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
- 1998లో బ్రెజిల్‌తో జరిగిన మ్యాచులో డెన్మార్క్ ఓడిపోయిన తర్వాత ప్రపంచ కప్‌లో మొదటి 2 నిమిషాల్లో గోల్ చేసి ఓడిపోయిన తొలి జట్టుగా కెనడా నిలిచింది. ఇప్పటివరకు ఆ రికార్డు ఫ్రాన్స్ పేరుమీద ఉంది. 1978 లో ఇటలీపై రెండు నిమిషాల్లోనే గోల్ చేసిన ఫ్రాన్స్ తర్వాత ఓడిపోయింది.
- క్రొయేషియా గత 5 ప్రపంచ కప్ గేమ్‌లలో నాలుగింటిలో ఓటమిని తప్పించుకుంది.2018 ఎడిషన్ ప్రారంభం నుంచి అది ప్రపంచకప్ లలో మొత్తం 5 గేములు ఆడింది.
- కెనడా ఇప్పటి వరకు ఆడిన 5 ప్రపంచ కప్ మ్యాచ్‌లలో ఓడిపోయింది. కెనడా కన్నా ముందు ఎల్ సాల్వడార్ ఆడిన 6 ప్రపంచకప్ మ్యాచులలో ఓడిపోయింది.
- మారియో మాండ్ జుకిక్ తర్వాత ప్రపంచకప్ లో క్రొయేషియా తరఫున బ్రేస్ గోల్ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.