FIFA WC 2022 Today's Match:  ఫిఫా ప్రపంచకప్  2022లో నేడు రెండు కీలక మ్యాచ్ లు జరగనున్నాయి. చివరి ప్రపంచకప్ ఆడుతున్నాడంటూ వార్తలు వస్తున్న ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో జట్టు పోర్చుగల్ ఇవాళ బరిలోకి దిగనుంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి గం. 12.30లకు జరిగే ఈ మ్యాచ్ లో స్విట్జర్లాండ్ తో పోర్చుగల్ ఆడనుంది. ఈ మ్యాచులో పోర్చుగల్ ఫేవరెట్ అనడంలో సందేహంలేదు. అయితే నాకౌట్ పోరులో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేదు. 


అలాగే ఈరోజు మరో ప్రిక్వార్టర్స్ పోరులో 2010 చాంపియన్ స్పెయిన్ తో మొరాకో జట్టు తలపడనుంది.  ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8. 30లకు ఆరంభం కానుంది.


అందరి కళ్లూ రొనాల్డోపైనే


ఫుట్ బాల్ దిగ్గజాలు లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోలకు ఇదే చివరి ప్రపంచకప్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అర్జెంటీనా తరఫున మెస్సీ ఈ ప్రపంచకప్ లో అదరగొడుతున్నాడు.  అయితే పోర్చుగల్ తరఫున క్రిస్టియానో రొనాల్డో గ్రూప్ స్టేజ్ లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. అయితే రొనాల్డోను బిగ్ మ్యాచ్ ప్లేయర్ గా పేర్కొంటారు. ముఖ్యంగా నాకౌట్ మ్యాచ్ ల్లో రెచ్చిపోయి ఆడటం రొనాల్డోకే చెల్లింది. ఈ క్రమంలో అతడు స్విట్జర్లాండ్ పై ఎలా ఆడాతాడనేది ఆసక్తికరంగా మారింది. రొనాల్డోతో పాటు బ్రూనో ఫెర్నాండెజ్, ఫెలిక్స్, పెపె, సిల్వా, డియాగో కోస్టా లాంటి ప్రతిభ ఉన్న ప్లేయర్లు పోర్చుగల్ లో ఉన్నారు. ఏ రకంగా చూసినా స్విట్జర్లాండ్ కంటే కూడా పోర్చుగల్ మెరుగైన టీం. ఇక స్పెయిన్, మొరాకో మ్యాచ్ విషయానికి వస్తే.. ఇరు జట్లు సమంగా ఉన్నాయి. ముఖ్యంగా స్పెయిన్ యువ ప్లేయర్లతో దూకుడు మీద ఉంది. అదే సమయంలో పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన మొరాకో సంచలన ప్రదర్శనలు చేస్తూ ప్రిక్వార్ట్స్ కు చేరుకుంది.


జపాన్ పై క్రొయేషియా విజయం


క్రొయేషియా నిలిచింది. చిన్న జట్టు జపాన్ పై విజయం సాధించి క్వార్టర్స్ లో అడుగుపెట్టింది. చిత్తు చేసే ఒత్తిడిని అధిగమించి, తన అత్యుత్తమ ఆటతో గెలిచింది. చిన్న జట్టైనా జపాన్ పోరాటం ఆకట్టుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ప్రీక్వార్టర్స్ లో పెనాల్టీ షూటౌట్లో క్రొయేషియా విజయం సాధించింది. జపాన్ జట్టు 3 పెనాల్టీలను అడ్డుకున్న క్రొయేషియా గోల్ కీపర్ లివకోవిచ్ హీరోగా నిలిచాడు.